Horoscope Today March 5th 2024 : మార్చి 5న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మీరు హాజరుకావల్సిన ఒక ముఖ్యమైన ఫంక్షన్ మీరు ఊహించినట్లుగా ఉండదు. అది కొంత వరకు మిమ్మల్ని భాధపెడుతుంది. ఈ రోజంతా ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆఫీసులో లేదా ఇంట్లో మనస్పర్థలు రావచ్చు. మీ మొండితనాన్ని అదుపులో పెట్టుకొనట్లయితే ఇబ్బందులు పడతారు. అది మీరు ప్రస్తుతం చేస్తున్న పనులు మీద ప్రభావం చూపవచ్చు.
వృషభం (Taurus) : మీరు ధ్యానం చేస్తూ ప్రశాంతతను అలవరచుకోవడం మంచిది. కొన్ని రోజులు మీకు అనుకూలంగా ఉండవు. సహద్యోగులు, ఉన్నతాధికారు నుంచి పని ఒత్తిడి తప్పదు. మీరు ఊహించే ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. మీరు జాగ్రత్తగా, మౌనంగా ఉండి మీ పనులు చూసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కొత్త పనులు ప్రారంభించవద్దు.
మిథునం (Gemini) : మీరు ఈ రోజు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు చూడదగ్గ ప్రదేశానికి కుటుంబసభ్యులతో వెళ్తారు. మీ దృఢమైన శరీరం, మానసిక స్థితి బాగుంటుంది. మీరు షాపింగ్ చేసే అవకాశం ఉంది. నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చేయవచ్చు.
కర్కాటకం (Cancer) : ఈ రోజు మీకు వ్యాపారపరంగా చాలా మంచి రోజు. స్నేహితులు, సహోద్యోగుల నుంచి మీకు సహకారాలు అందుతాయి. ఉన్నతాధికారులు మీ పనికి సంతృప్తి చెందుతారు. ఖర్చుల మీద దృష్టి సారించండి.
సింహం (Leo) : ఈరోజు ప్రయాణం చేయడంలో మీకు చాలా ఆసక్తి ఉంటుంది. మీ కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి విహారయాత్రకు ఏర్పాట్లు చేస్తారు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి చక్కని ప్రశంసలు లభిస్తాయి. అద్భుతమైన రోజు మీ కోసం వేచి ఉంటుంది.
కన్య (Virgo) : ఈ రోజు మీకు అనువైనది కాదు. సోమరితనం, బద్దకం, సరిగా ఆలోచించక పోవడం మిమ్మల్ని అలసిపొయేలా చేస్తాయి. మీరు ప్రేమించే వ్యక్తితో, మీ భార్యతోను గొడవ పడే అవకాశం ఉంది. మీ తల్లి గారి అరోగ్యం విషయంలో ఒత్తిడికి గురి కావచ్చు. ఈ రోజు ఆస్తి లేదా కోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.
తుల (Libra) : మీరు వివిధ ప్రదేశాలను పర్యటించడం వల్ల ఉత్సాహంగా, ఆనందంగా గడుపుతారు. దేవుడికి నమస్కారం చేసుకోండి. కుటుంబ వ్యవహారాలు అన్నీ బాగుంటాయి. మీరు మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు.
వృశ్చికం (Scorpio) : మీరు చదివిన స్ఫూర్తిదాయక పుస్తకాల ప్రభావం ఈ రోజు మీపై అధికంగా ఉంటుంది. కొత్త వ్యాపారంలోకి మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని ప్రతీ ఒక్కరూ గమనిస్తూ ఉంటారు.
ధనుస్సు (Sagittarius) : ఈరోజు మీ ఆరోగ్యం జాగ్రత్త అని సలహా ఇస్తున్నాం. మీకు అప్పగించిన పనులన్నీ సరైన టైంలో పూర్తి చేస్తారు. మీ బంధువులతో మాట్లాడడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం సౌకర్యంగా, ఆనందదాయకంగా గడుస్తుంది. ఈ రోజు మీరు స్థిరంగా ప్రవర్తిస్తారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
మకరం (Capricorn) : ఈరోజ జాగ్రత్తగా ఉండాలని మీకు సలహా ఇస్తున్నాం. మీరు సంపాదించిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేస్తారు. ధార్మిక, సామాజిక కార్యకలాపాల్లో ఎక్కువ పాల్గొనడం వల్ల ఖర్చు అధికం అవుతుంది. మీరు చాలా చికాకుగా గడుపుతారు.
కుంభం (Aquarius) : కొత్త పనులు ప్రారంభించడానికి శుభప్రదమైన రోజు. ఈ రోజు మీరు సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. మీరు మీ భార్యా పిల్లల నుంచి మంచి వార్త వింటారు.
మీనం (Pisces) : ఈ రోజు మీకు ఆశాజనకంగా లేదు. చిన్న విషయాలకే బాధపడుతారు. మీ సంకల్పబలాన్ని దృఢంగా ఉంచుకోవాలి. చైతన్యం పెంచుకుంటే మీరు విషయాలను మరింత స్పష్టంగా మరింత వాస్తవంగా చూసుకునేందుకు సాయమవుతుంది.