Horoscope Today March 17th 2024 : మార్చి 17న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మీరు ఈరోజు కాస్త పట్టు విడుపు ధోరణి పాటిస్తూ లౌక్యంతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర వాదనలకు పోయి అపవాదుల్ని ఆహ్వానించవద్దు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది.

వృషభం (Taurus) : ఈ రోజు మీకు అన్నింటా శుభం. ఆర్థికంగా అనుకూలం. మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కాబట్టి మీ మనసు సంతోషంగా ఉంటుంది. వినోదం కోసం ధనవ్యయం ఉంటుంది. ఇంట్లో నెలకొనే ఆనందకర సంభాషణలు మీకు శాంతిని, సంతోషాన్ని కలుగజేస్తాయి.

మిథునం (Gemini) : ఈ రోజు మీ ప్రియమైన వారితో లేదా సన్నిహితులతో ఒకింత వాదనలు చేయాల్సి వస్తుంది. కొన్ని ఆంతరంగిక విషయాలు మిమ్మల్ని అసహనానికి గురి చేయవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే మీకు ప్రియమైన వారిని బాధించిన వారవుతారు. ఈ పర్యవసానం మీ ఆరోగ్యం పైన కూడా ప్రతికూలమైన ప్రభావం చూపవచ్చు. సహనంతో సంయమనాన్ని పాటిస్తే మేలు.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీకు ఆర్ధికంగా అనుకూలిస్తుంది. ఈ సంతోష సమయాన్ని మీరు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి పంచుకుంటారు. విందువినోదాలతో ఆనందంగా కాలం గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. మొత్తానికి ఈ రోజంతా సరదాగా గడిచిపోతుంది.

సింహం (Leo) : దృఢ సంకల్పం, పట్టుదలతో, విశ్వాసంతో మీరు చేపట్టిన అన్ని పనులూ సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. తారాబలం, అదృష్టం వలన ఉద్యోగంలో ప్రమోషన్, ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంది. అపరితమైన మీ రాశి బలం మీకు చక్కని గుర్తింపు తీసుకురావచ్చు. ఈ రోజు ప్రభుత్వ విషయాలకు సంబంధించి, ఆర్థిక సంబంధమైన డాక్యుమెంట్లు చూడడానికి మంచి రోజు.

కన్య (Virgo) : ఈ రోజు మీకు అన్ని సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ధ్యానం, ధార్మిక కార్యక్రమాలతో రోజును మొదలు పెడితే మీకు అంతా మంచే జరుగుతుంది. ఈ రోజు స్నేహితులతో కలుసుకోవడం, మీ సన్నిహిత సంబంధీకుల సహకారం మీకు ఆనందాన్ని ఇస్తాయి. విదేశాలలో మిత్రుల నుంచి అందిన శుభ సమాచారంతో రోజంతా సంతోషంగా, సరదాగా గడిచిపోతుంది.

తుల (Libra) : ఈ రాశి వారికి ఈ రోజు అనారోగ్య సూచన. ఆచితూచి మాట్లాడితే మంచిది. కఠినంగా మాట్లాడి తర్వాత బాధపడినా ప్రయోజనం లేదు. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవని తెలుసుకోవాలి. సానుకూల ఫలితాల కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే మంచిది. అందువల్ల సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. అనైతికమైన,చట్ట విరుద్ధమైన పనులు చెయ్యకండి. మీరు ఏర్పరుచుకుంటున్న కొత్త సంబంధం ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. ఆర్థిక సంబంధమైన లెక్కలు పేపరు మీద పెట్టడం వలన ప్రయోజనాలు పొందవచ్చు.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు మీకు ఆనందంగా కాలం గడిచిపోతుంది. ఈ ఒక్క రోజుకు మీ బాధ్యతలు పక్కన పెట్టి సరదాగా, సంతోషంగా కాలం గడపండి. మంచికాలం మీ కోసం ఎదురుచూస్తోంది. ఈ రోజు స్నేహితులతో విందువినోదాలతో కాలం సరదాగా గడిచిపోతుంది. మీరు చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలు మీకు సంతృప్తితో పాటు ప్రశంసలు కూడా అందిస్తాయి.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంది. ఈ రోజు అదృష్టం అవకాశాల రూపంలో మీకు ఎదురు వస్తాయి. మానసికంగానూ, శారీరకంగానూ బలంగా ఉంటారు. మీ ఇంట్లో, పని ప్రదేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. తత్ఫలితంగా, మీకు అన్నిచోట్లా సహాయ సహకారాలు లభిస్తాయి. మాతృ సంబంధ సమాచారం మీకు ఆనందాన్ని అందిస్తుంది. మీరు విజేతగా నిలవడంతో మీ ప్రత్యర్థుల కన్నా మీ బలం ఏపాటిదో అందరికీ అర్థమవుతుంది.

మకరం (Capricorn) : ఈ రోజు మీకు అనారోగ్య సూచన. ఇది మీ ఆనందాన్ని హరించవచ్చు. మనసు ఆందోళనగా ఉండడం వలన నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. పని ప్రదేశంలో తారాబలం అనుకూలంగా లేదు. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రాణాయామం, విశ్రాంతి వలన మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.

కుంభం (Aquarius) : ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. పట్టుదలకు పోవద్దు. కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది, కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు రావచ్చు. సామాజికంగా మీ పరపతి దెబ్బతినే పనులు చెయ్యవద్దు. ఇల్లు, ఆస్తి వంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదవాల్సి వస్తుంది. ఈ రోజు కాస్త ఆటవిడుపు ఉంటుంది. ఆర్థిక వనరులని పెంచుకోవడం వల్ల దేవుడి దయవల్ల లాభదాయకంగానే ఉంటుంది.

మీనం (Pisces) : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనిచెయ్యండి, చక్కగా ఆనందించండి అనే నినాదాన్ని మీరు ఈరోజు బాగా ఇష్టపడతారు. ఈ రోజు మీ అదృష్టం వింత నడకలు నడుస్తుంది. సృజనాత్మకతలో మీకంటూ కచ్చితమైన ముద్ర వేస్తారు. నూతన దృక్పథం చూపిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకొని, వాటిని త్వరలో అమలు కూడా చేస్తారు. మీ అనుకూల వైఖరి, నిర్ణయాత్మక శక్తి కి అనుకూలంగా పనులు పూర్తయ్యేలా చేస్తారు. ఒక సాహసోపేతమైన పర్యటనకు స్నేహితులతో, రక్త సంబంధీకులతో వెళ్లడం వల్ల సమాజంలో తగినంత గుర్తింపు వస్తుంది.