Horoscope Today March 13th 2024 : మార్చి 13న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : రోజంతా సుఖశాంతిమయంగా గడుస్తుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఎనర్జిటిక్‌గా ఉంటారు. కాబట్టి అన్ని పనులు కూడా మీరు అత్యుత్సాహంతో ముగిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ రోజు సంతోషంగా గడుపుతారు.
వృషభం (Taurus) : మీరు జాగ్రత్తగా ఉండాలి. నిగ్రహం పాటించాలి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని సమస్యల నుంచి తప్పించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి.
మిథునం (Gemini) : ఆలోచనల విషయంలో ఈ రోజు మీరు చాలా ఊగిసలాటలో ఉంటారు. మీరు చిక్కుల్లో పడతారు. మీ ఆరోగ్యం, ఆహార అలవాట్లపై దృష్టి పెట్టాల్సిన సమయమిది. మార్పును క్రమంగా అలవర్చుకోండి.
కర్కాటకం (Cancer) : ఈ రోజు మీ సమయం అనుకూలంగా ఉంటుంది. అరుదైన బహుమతులను స్వీకరిస్తారు. ఇంటి వద్ద వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
సింహం (Leo) : ఈ రోజు మీకు సాధారణంగా గడుస్తుంది. మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు లక్ష్యం దిశగా నడక ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలు మిమ్మల్ని తీరిక లేకుండా చేయవచ్చు. మీరు ఒక తీర్థయాత్రకు ప్రణాళిక వేయవచ్చు. విదేశాల్లో నివసించే బంధువుల నుంచి శుభ వార్తలు తెలుస్తాయి.
కన్య (Virgo) : మిమ్మల్ని ఏది తికమక పెడుతోంది. మీ మనస్సులో ఒక విప్లవాత్మక ఆలోచన ఉండవచ్చు. మీ స్నేహితులు తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి మీ వద్ద ప్రస్తావించి ఉండొచ్చు.
తుల (Libra) : ఈరోజు మీరు పూర్తిగా ఆనందంగా ఉంటారు. మీ పాత స్నేహితుల సాన్నిహిత్యం మీకు ఉత్తేజపరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా, ఆనందకరంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio) : మీకు చాలా మంచి రోజు. మీరు మీ కుటుంబసభ్యులతో ఎక్కువ సేపు గడుపుతారు. మీ సంతోషం రెట్టింపు అవడానికి మీ ఇంటి వద్ద నుంచి మంచి విషయాలు వింటారు. డబ్బు పరమైన లాభాలు మీ కొరకు ఎదురు చూసున్నాయి.
ధనుస్సు (Sagittarius) : మీరు గ్రహ సమస్యల నుంచి ఇంకా కోలుకున్నట్లు అనిపించడం లేదు. ఫలితంగా పూర్తి అస్వస్థతతో లేదా మానసికంగా అస్థిరంగా భావిస్తారు. మీరు జీర్ణసంబంధ రోగాలకు తీసుకునే మందులపై జాగ్రత్త వహించండి.
మకరం (Capricorn) : ఈ రోజు మీకు శుభప్రదమైన రోజు. శారీరకంగా, మానసికంగా అత్యుత్సాహంతో ఉంటారు. అనుకోని సంఘటనలు మీ కుటుంబ సభ్యులను చుట్టుకుని బాధిస్తాయి. మీరు దానికి ఆందోళన చెందుతారు. మీరు నిద్రలేమితో బాధ పడతారు. నీరు పొదుపుగా వాడండి.
కుంభం (Aquarius) : నిర్ణయాలు తీసుకునే మీ శక్తిపై ఆత్మవిశ్వాసం, గందరగోళం ప్రభావం చూపుతాయి. ఈ కారణంగా సులభమైన పరిష్కారాలు కనుగొనడంలో ఇబ్బందిపడతారు. మీ రోజువారీ పనుల ప్రకారం వెళ్లండి. పెద్ద ఆలోచనలు, వివాదాలకు దూరంగా ఉండండి.
మీనం (Pisces) : మీరు ఈరోజు అధిక డబ్బు ఖర్చు చేయకుండా ఉండండి. మీరు ఎవరినైనా బాధించకుండా ఉండడానికి మీ మాటలు, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. డబ్బుకు సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. రోజు మొత్తం మీ మానసిక, శారీరక దృఢత్వం సాధారణంగా ఉంటుంది..