Horoscope Today March 11th 2024 : మార్చి 11న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
![](https://assets.eenadu.net/article_img/1mesham_44.jpg)
మేషం (Aries) : ఈరోజు మీకు దగ్గు, జలుబు లేదా చిన్నపాటి రుగ్మతలు ఇబ్బంది కలిగించవచ్చు. ఎందుకంటే ఇవి మీ ఆలోచనలు, పనుల నుంచి దారి తప్పిస్తాయి. వీటిని ప్రారంభంలోనే తుంచడానికి, ప్రశాంతంగా ఉండటానికి కొంత సమయం కేటాయించండి. ధ్యానం చేయండి లేదా మ్యూజిక్ వినండి.
![](https://assets.eenadu.net/article_img/2vrushabham_45.jpg)
వృషభం (Taurus) : ఈరోజు మీకు అదృష్టకరంగా ఉంటుంది. అధికారం, గౌరవం, ఆర్థిక పరిస్థితి పెరుగుదలకు కూడా అవకాశం ఉంది. మీరు పదోన్నతి లేదా వ్యాపారంలో పెద్ద ప్రాజెక్టును అందుకుంటారు. ఇప్పుడు వాణిజ్యంలో చేసిన లావాదేవీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
![](https://assets.eenadu.net/article_img/3mithunam_42.jpg)
మిథునం (Gemini) : ఈరోజు మీకు చాలా ప్రయోజనాలతో ఆహ్వానం పలుకుతుంది. బ్రహ్మచారులకు తగిన జీవిత భాగస్వామి దొరకవచ్చు. ఆర్థిక ప్రయోజనాలకు ఇది మంచి రోజు. స్నేహితులను కలవడం, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం వల్ల ఆనందంగా ఉంటారు. మీ పిల్లల నుంచి శుభవార్తను ఆశించవచ్చు.
![](https://assets.eenadu.net/article_img/4karkatakam_39.jpg)
కర్కాటకం (Cancer) : ఈరోజు కర్కాటక రాశివారి పనులు అన్నీ విజయవంతం అవుతాయి. మీ సీనియర్లతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. వాళ్ళు మీ పనితీరుతో సంతోషంగా ఉంటారు. ఈరోజు పదోన్నతులు లభించే ఆస్కారం ఉంది. ఇంటి విషయంలో మీ కుటుంబసభ్యులతో మాట్లాడుతారు. మీ ఇంటి సౌందర్యం మెరుగుపరచడం కోసం కొత్త పనులు చేపడతారు.
![](https://assets.eenadu.net/article_img/5simham_41.jpg)
సింహం (Leo) : ఈ రోజు సింహరాశివారు ధార్మిక, పవిత్ర కార్యాల్లో నిమగ్నం అవుతారు. అంతేకాకుండా ఒక ధార్మిక ప్రదేశానికి పర్యటన చేయవచ్చు. ఈరోజు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్న మీ ప్రియమైన వారి నుంచి కొన్ని వార్తలను వినవచ్చు. ఈరోజు నిర్దేశించిన పనిపై దృష్టి కేంద్రీకరించండి. మీరు మానసికంగా కలత చెందవచ్చు. దానికి ప్రధాన కారణాల్లో మీ పిల్లలు కూడా ఒకటి కావచ్చు.
![](https://assets.eenadu.net/article_img/6kanya_44.jpg)
కన్య (Virgo) : ఈరోజు మీకు శుభప్రదంగా ఉండవచ్చు. సులభంగా పేరు ప్రఖ్యాతలను పొందడానికి అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్థులకు, వారి భాగస్వాములకు మధ్య చాలా అనుకూలత ఉంటుంది. కొత్త దుస్తుల కోసం షాపింగ్ చేయడం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన పర్యటన చేస్తే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/7tula_41.jpg)
తుల (Libra) : ఈరోజు తుల రాశివారు కుటుంబంతో ఆహ్లాదకరమైన క్షణాలను గడుపుతారు. వ్యాపార భాగస్వాములు, సహోద్యోగులతో అద్భుతమైన వాతావరణాన్ని పంచుకుంటారు. పనిలో ఎక్కువ కష్టపడకుండా వేగవంతమైన ఫలితాలను అందుకుంటారు.
![](https://assets.eenadu.net/article_img/8vrutchikam_42.jpg)
వృశ్చికం (Scorpio) : మిమ్మల్ని మీరే ఈ రోజు నిర్ణయించుకుంటారు. మీ జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనికి కొంత సమయం పట్టినా, చివరిలో మీకు అవసరమైనది ఏంటో వాటికి సమాధానాలేంటో తెలుసుకోగలుగుతారు.
![](https://assets.eenadu.net/article_img/9danassu_40.jpg)
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీపై పని ఒత్తిడి చాలా ఉంటుంది. అయితే ఆ ఒత్తిళ్లతో ఢీలా పడిపోకుండా, ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పనిచేస్తుంటారు. ఇందులో ఎటువంటి ఆటంకాలు ఉండవు. మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు.
![](https://assets.eenadu.net/article_img/10makaram_43.jpg)
మకరం (Capricorn) : మీ స్నేహితులు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక ఆహ్లాదకరమైన పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అన్నింటిపై శ్రద్ధ వహిస్తారు. ఈరోజు ఉద్యోగస్థులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉండవచ్చు. మీరు ఈరోజు మీ పోటీదారులను అధిగమిస్తారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
![](https://assets.eenadu.net/article_img/11kumbam_43.jpg)
కుంభం (Aquarius) : కుంభరాశివారికి ఈరోజు చాలా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. కాని వాటిలో అవసరమైన కోరికలేంటో నిర్థరించుకొని ఖర్చు చేస్తారు. కాస్తంత సంయమనం పాటించడం ద్వారా మీరు పొదుపు చేస్తారు.
![](https://assets.eenadu.net/article_img/12meenam_44.jpg)
మీనం (Pisces) : మీ ఖాతాలను జాగ్రత్తగా గమనించండి. సహనం అనేది ఒక ధర్మం, దానిని క్రమం తప్పకుండా పాటించడం అవసరం. కఠినమైన వాతావరణాన్ని నివారించడానికి మీ మాటలను అదుపులో పెట్టుకోవాలి. మీ కోపాన్ని కాస్త తగ్గించుకోండి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. వాదనలు, అర్ధంలేని ఆలోచనలు మానుకోండి. అవి మీకు మరింత హాని కలిగిస్తాయి.