ETV Bharat / spiritual

ఈ రోజు ఆ రాశివారికి ప్రతికూల ఫలితాలు! నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు! - Horoscope Today June 26th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 5:00 AM IST

Horoscope Today June 26th 2024 : జూన్​ 26న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today June 26th 2024
Horoscope Today June 26th 2024 (ETV Bharat)

Horoscope Today June 26th 2024 : జూన్​ 26న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.ఈ రోజు ఏర్పడే కొత్త పరిచయాలు రాబోయే రోజుల్లో ఉపయోగకరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారు తమ తమ వృత్తిలో రాణిస్తారు. నైపుణ్యాలను మెరుగు పరచుకుంటారు. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ అవసరం. వ్యాపారులు చేస్తున్న వ్యాపారంలో విజయాలను అందుకుంటారు. శ్రీ సుబ్రమణ్య స్వామి ప్రార్థన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు గొప్పగా ఉంటుంది. ప్రత్యేకించి వ్యాపారులకు ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. చేస్తున్న వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. గొప్ప గొప్ప విజయాలు చేకూరుతాయి. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి, పైఅధికారుల నుంచి సహకారం అందుకుంటారు. సంపదలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటారు. అన్ని రంగాల వారికి చేసే పని పట్ల ఉత్సాహం, ఏకాగ్రత లోపిస్తాయి. శ్రద్ధ లేకుండా చేసే పనులు విజయాలను తీసుకురావు. ఇతరుల సహకారం ఉండదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు నష్టాలను తీసుకు వస్తాయి. హనుమాన్ ఆలయ సందర్శనతో ఆపదలు తొలగుతాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు పనుల్లో ఏర్పడిన ఆటంకాలు, సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు. క్లిష్ట పరిస్థితుల నుంచి సమర్థవంతంగా బయటపడతారు. వ్యాపార, వాణిజ్యాల్లో ఈ రోజు తీవ్రమైన పోటీ ఉన్నప్పటికినీ మీదే పైచేయి అవుతుంది. వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ఎలాంటి సమస్యలు, ఆటంకాలు లేకుండా సాగిపోతుంది. గణపతి ప్రార్థన శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనుల్లో ఆశించిన మేరకు అభివృద్ధి ఉండకపోవచ్చు. ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. మీటింగులు, ప్రయాణాలు వాయిదా వేస్తె మంచిది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో మెలిగితే మేలు. వ్యాపారులు వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు ప్రశాంతంగా, ఓపికతో లేకపోతే నష్టం వాటిల్లుతుంది. వాదనలకు దూరంగా ఉండండి. శత్రు జయం కోసం హనుమ చాలీసా పారాయణ చేయండి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో చేపట్టిన పనులు విజయాలను అందిస్తాయి. ప్రత్యేకించి వ్యాపారులకు ఈ రోజు మంచి యోగకరంగా ఉంటుంది. ఓ మిత్రుని సహకారంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. సంపదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాద బలంతో తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు పనిలో నిర్లక్ష్య వైఖరి కారణంగాపై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. తోటి ఉద్యోగుల సహకారం కూడా లోపిస్తుంది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అవకాశాలు రావడం ఆలస్యం కావచ్చు. సహనంతో ఉండండి. వ్యాపారులు కష్టించి పనిచేసినా విజయాలు ఆలస్యమవుతాయి. గణపతి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారిని ఈ రోజు అధికారం అందలమెక్కిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం. స్థానచలనం కూడా ఉండవచ్చు. ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు ఊహించని లాభాలను అందుకుంటారు. కళారంగం వారు నూతన అవకాశాలకు సంబంధించిన శుభవార్త వింటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహసంచారం సరిగా లేదు కాబట్టి మంచి చేసినా చెడు ఎదురవుతుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి ఆగిపోతుంది. ఆర్థిక పరిస్థితి అదుపు తప్పడం వలన మానసిక ఆందోళనకు గురవుతారు. సహనంగా, ఉంటూ సంయమనం పాటిస్తే గమ్యాన్ని చేరుకోవచ్చు. ఎవరితోనూ తగువు పడకండి ఆ ఘర్షణల ప్రభావం చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే పరిస్థితులు చక్కబడతాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. వ్యాపారస్తులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వృత్తి పరంగా, వ్యక్తిగత పరంగా కూడా ఈ రోజు అన్నింటా సానుకూల ఫలితాలు ఉంటాయి. సంపదలు పెరుగుతాయి. ఇల్లు, భూమి కొనుగోలు చేస్తారు. గృహంలో శాంతి సంతోషం నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని గ్రహాలు ఉచ్చదశలో ఉన్నాయి కాబట్టి వృత్తి వ్యాపార రంగాల వారు ఆర్థిక సంబంధమైన శుభ ఫలితాలు ఈ రోజు అందుకుంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి కావడంతో ఈ రోజంతా చాలా సంతోషంగా ఉంటారు. విహార యాత్రలకు ప్రణాళికలు వేస్తారు. నూతన వాస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. శివారాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగ రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. సన్నిహితుల, కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా సానుకూల పరిస్థితులు ఉంటాయి. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.