Horoscope Today July 12th 2024 : జులై 12న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ప్రారంభించిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు దూరమవుతాయి. బుద్ధిబలంతో అన్ని సమస్యలు అధిగమిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో చేసే అన్ని పనులు విజయాన్ని తెచ్చిపెడతాయి. మీడియా కమ్యూనికేషన్ రంగాల వారికి ఈ రోజు యోగకరంగా ఉంటుంది. పదిమందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక వృద్ధి, కార్యసిద్ధి ఉంటాయి. కుటుంబ సంబంధాలు దృఢపడతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
మిథునం (Gemini) : మిధునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. లేకుంటే అవకాశవాదులతో సమస్యలు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనులు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. దూర ప్రాంతాల నుంచి అందిన ఓ శుభవార్త వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. మీ అదృష్టాన్ని మీరే నమ్మలేక పోతారు. వ్యాపారస్థులకు శుభ సమయం నడుస్తోంది. మీ పోటీదారులు మీతో గెలవలేక ఓటమిని అంగీకరిస్తారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో విహార యాత్రలకు వెళతారు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కష్ట సమయంలో కుటుంబసభ్యుల మద్దతు ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార రంగాల వారు పని పట్ల చిత్తశుద్ధి, ఏకాగ్రతతో ఉంటే పోగొట్టుకున్నదానికి పదిరెట్లు సంపాదిస్తారు. మనోబలంతో ముందుకెళ్తే విజయం మీదే! ఉద్యోగస్థులు పనిలో వచ్చే స్వల్ప ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. ఇంటా బయటా ఎలాంటి గొడవలు, సమస్యలు లేకుండా ప్రశాంతంగా గడుస్తుంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు. మానసికశాంతి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారిని లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది. ఆర్ధిక లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా వ్యాపారస్థులకు ప్రయాణాలు లాభిస్తాయి. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాల్లో, వ్యక్తిగత జీవితంలోనూ అప్రమమతంగా ఉండాల్సిన సమయం. ఆపదలు పొంచి ఉన్నాయి. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడేటప్పుడు ఆలోచించకుండా మాట్లాడకండి. ఈ రోజు ఎదురయ్యే అన్ని సమస్యలను సూక్ష్మ బుద్ధితో ఆలోచించి పరిష్కరించుకుంటే మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదవడం, ప్రదక్షిణలు చేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి జీవితంలో ఎదుగుదల ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్థులకు గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. మీ పనితీరుకు, నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రసంశలు అందుకుంటారు. ఉన్నత పదవులను పొందుతారు. సంపద వృద్ధి చెందుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా విందు వినోదాలతో సరదాగా సాగిపోతుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వివాహితుల వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. గణపతి ఆలయ సందర్శన శుభకరం.
మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో చెప్పుకోతగిన మార్పులేమీ ఉండవు. రీసెర్చ్, పరిశోధన రంగాల వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. సృజనాత్మకతతో చేసే అన్ని పనులు విజయవంతమవుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. కోపం, చిరాకు పెరుగుతాయి. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. చట్టవిరుద్దమైన పనుల జోలికి పోవద్దు. ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. దుర్గా స్తుతి పారాయణ శక్తినిస్తుంది.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆర్ధికంగా గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. రోజువారీ పనులు పక్కన పెట్టి సరదాగా గడపండి. ఉద్యోగస్థులు ప్రమోషన్లు అందుకుంటారు. కుటుంబంలో పెద్దవారితో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. చేసే ప్రతి పనిలోనూ సానుకూలత ఉంటుంది. వ్యాపారస్థులకు రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.