ETV Bharat / spiritual

ఈ రోజు ఆ రాశివారు దూరప్రయాణం చేయకపోవడమే బెటర్! - రాశి ఫలాలు తెలుగు టుడే

Horoscope Today February 4th 2024 : ఫిబ్రవరి 4న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 4th 2024
Horoscope Today February 4th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 5:01 AM IST

Horoscope Today February 4 2024 : ఫిబ్రవరి 4న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మీరు ఒక వింత అనుభూతికి లోనవుతారు. మీరు ఆధ్యాత్మికతపరంగా వృద్ధి చెందుతారు. కానీ మీరు అందరికంటే నేనే గొప్ప అని భావించవద్దు. దూర ప్రయాణాలు చేయడానికి ఇది మంచి సమయం కాదు

.

వృషభం (Taurus) : మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తి మీకు ఈ రోజు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు మీరు ప్రయత్నించకపోవడమే మంచిది. ప్రశాంతంగా, స్థిరంగా ఉండండి. మీ స్వభావానికి తగిన రీతిలో ప్రవర్తించండి. మీ మంచితనాన్ని, ప్రశాంతతను ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఇవ్వొద్దు. మీకు విజయాన్ని సాధించిపెట్టేవి మంచితనం, సత్ప్రవర్తనే అని గుర్తించుకోండి.

.

మిథునం (Gemini) : ఉద్యోగంతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపించండి. వ్యాయామం చేసేందుకు సమయం కేటాయిస్తారు. మీ చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంటుంది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. గాసిప్స్, సరదా, హాస్యంతో ఈ రోజు ఫుల్ ఎంజాయ్​ చేస్తారు. అయితే ఇవేవి మీరు ఖాళీగా ఉండే సమయంలో చేసేవి కావు. రోజులు గడుస్తున్న కొద్దీ మీరు మరింత స్థిరంగా, మీ పనిపై దృష్టి సారిస్తారు.

.

సింహం (Leo) : ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. కుటుంబసభ్యులతో అనవసరమైన వాదనలు వస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యాలు ఇబ్బంది పెడతాయి. మీ తల్లి అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. మీపై అధిక ఒత్తిడి ఉంటుంది. జలాశయాలకు దూరంగా ఉండండి. మీరు ఎక్కువగా ఆందోళన చెందవద్దు. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం.

.

కన్య (Virgo) : ఆరోగ్యవంతమైన శరీరంతోనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ శరీరము, మనసు ఆరోగ్యంగానే ఉంటాయి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఇవి చాలు. మీరు పనిలోనే విశ్రాంతి తీసుకుంటారు. మరికొంత సేపు మీకు ప్రియమైన వారితో కాలక్షేపం చేస్తారు. ఫలితంగా మీకు వారినుంచి సహకారం అందుతుంది. మీ ఆధ్యాత్మిక సంబంధమైన ఙ్ఞానానికి తగిన గుర్తింపు ఉంటుంది.

.

తుల (Libra) : మిమ్మల్ని ఒంటరితనం ఇబ్బంది పెడుతుంది. ఈరోజు గందరగోళంగా ఉంటుంది. మీరు కొంచెం బెరుకుగా ఉంటారు. సహనం కలిగివుండాలి. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిలా ప్రవర్తించండి. జీవితం పట్ల సర్దుకుపోయే వైఖరి మీకు వరంలా పని చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మీరు మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ స్నేహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఇది మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు ఇష్టమైన వారిని కలుసుకుంటారు. ఓ శుభవార్త వింటారు. ప్రయాణాలు ఆనందదాయకం.

.

ధనుస్సు (Sagittarius) : మాటలను నియంత్రణలో పెట్టుకోలేని మీ అనాశక్తత కారణంగా మీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. మాటతీరును మార్చుకునే ప్రయత్నం చేయండి. లేని పక్షంలో లేనిపోని మాటలు పడాల్సి వస్తుంది. మీరు ఏదో కోల్పోయామని ఆలోచిస్తుంటారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు సన్నిహిత స్నేహితులును, ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడాలనే ఆలోచన చేస్తుంటారు. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకుంటారు.

.

కుంభం (Aquarius) : ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వృత్తిపరంగా కూడా మీరు చక్కగా రాణిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఇది మీలో మరింత ఉత్సాహం నింపుతుంది. మీ సహోద్యోగుల నుంచి లభించే సహకారంతో మీరు మంచి పేరు తెచ్చుకుంటారు.

.

మీనం (Pisces) : ఈరోజు మీరు నీరసంగా ఉంటారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడుతుంటారు. ఇది కేవలం మీరు మంచి మూడ్​లో లేకపోవడం వల్ల కావచ్చు. మీ నిరంతర ఆలోచనలు, గొణగడం మీ చుట్టూ ఉన్న వారికి చికాకు కలిగిస్తాయి. డ్యూటీలో మీ సీనియర్లతో వ్యవహరించేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉంటే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.