ETV Bharat / spiritual

ఈ రాశులవారికి ఈరోజు టైం బాగలేదు! కాస్త జాగ్రత్తగా ఉండాలి! - వార ఫలాలు

Horoscope Today February 29th 2024 : ఫిబ్రవరి 29న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 29th 2024
Horoscope Today February 29th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 5:05 AM IST

Horoscope Today February 29th 2024 : ఫిబ్రవరి 29న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఆలోచనలను అదుపులో పెట్టుకోండి. విదేశ వ్యాపారంతో సంబంధమున్న వారికి లాభాలు ఉండవచ్చు. మేథోపరమైన చర్చల్లో పాల్గొనేటప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.

.

వృషభం (Taurus) : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీకు కేటాయించిన పనులను చక్కగా ప్లాన్​ చేసుకొని నెమ్మదిగా పూర్తి చేయండి. అసంపూర్ణంగా మిగిలి పోయిన పనులను పూర్తి చేస్తారు. మీ సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. శారీరకంగా దృఢంగా ఉంటారు. మీ తల్లిదండ్రుల నుంచి ఓ శుభవార్త వింటారు.

.

మిథునం (Gemini) : మీ సొంత ఆలోచనల నుంచి బయటకు రావాలి. మీ పిల్లలు, భాగస్వామి లేదా ప్రియమైనవారు అడిగే కోరికలను పరిశీలించండి. వీరి ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం పట్లా ప్రత్యేక శ్రద్ధ చూపండి.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీకు అనుకూలంగా ఉండదు. మానసికస్థితి ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలకు దిగుతారు. ధనం పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. సమస్యలను ధైర్యంతో ఎదుర్కోండి. రేపటి రోజు చక్కగా ఉంటుంది.

.

సింహం (Leo) : మీ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారు. వ్యక్తులతో మీరు జరిపే సంభాషణలు జీవతం విలువను మీకు తెలియజేస్తాయి.

.

కన్య (Virgo) : మంచి సంబంధాలను ఏర్పరుచుకుంటారు. వాటి ద్వారా ప్రయోజనాలను పొందుతారు. మీకు కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

.

తుల (Libra) : ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అందుకు అవసరమయ్యే డబ్బును సమకూర్చుకునేందుకు ఈ రోజు మంచి సమయం. ఈ రోజు సృజనాత్మకతతో వ్యవహరిస్తారు. అలాంటి వ్యక్తిత్వం గలవారిని సులభంగా ఆకట్టుకుంటారు.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. డ్రైవింగ్​ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శస్త్రచికిత్సలకు సంబంధించి ఏవైనా ప్లాన్స్​ చేసి ఉంటే వాటిని వాయిదా వేయడం ఉత్తమం.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. డబ్బు సమయానికి అందుతుంది. మొత్తంగా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. నచ్చినవారితో విహార యాత్రకు వెళ్తారు.

.

మకరం (Capricorn) : కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. మీ కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో జరిపే సమావేశాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు లాభాలను, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.

.

కుంభం (Aquarius) : ఈ రోజు మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తీవ్రంగా శ్రమిస్తారు. ఇది మీకు భారంగా మారుతుంది. దీనికి తోడు మీ పిల్లల పరిస్థితులు మీ సమస్యను మరింత ఇబ్బందికరంగా మారుస్తాయి. కుటుంబ సభ్యులతో గొడవలకు దిగుతారు. పక్కింటివారితో జాగ్రత్తగా ఉండండి.

.

మీనం (Pisces) : ఈ రోజు మీరు చేపట్టబోయే అన్ని పనుల విషయంలో అప్రమత్తత పాటించండి. రహస్య విషయాలు లేదా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో నిగ్రహం పాటించండి. అవి నైతికంగా తప్పు కావచ్చు లేదా నియమాలకు విరుద్ధం కావచ్చు. కఠినమైన వ్యక్తులు, పరిస్థితులతో మీరు ప్రశాంతమైన వైఖరితో, భరోసాతో కూడిన దృక్పథంతో వ్యవహరించండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.