ETV Bharat / spiritual

ఈ రాశివారికి ఈరోజు పండగే- అదృష్ట యోగం, అదనపు ఆదాయం! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today August 24th 2024 : ఆగస్టు​ 24వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 4:31 AM IST

Horoscope Today August 24th 2024 : ఆగస్టు​ 24వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో పనిచేసి అద్భుతమైన విజయాలను అందుకుంటారు. సంపాదన పెరగడం సంతృప్తిని ఇస్తుంది. శారీరకంగానూ, మానసికంగానూ దృఢంగా ఉంటారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఆర్థికలాభాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి అన్ని రంగాల వారు ప్రతి విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకొని నిగ్రహం పాటించాలి. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు ఎదురు కావచ్చు. అందరినీ కలుపుకొని పోతే సమస్యల పరిష్కారం కష్టం కాదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు పట్టింది బంగారం అన్నట్లుగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి పెద్ద మొత్తంలో లాభాలను పొందుతారు. ఉద్యోగులు నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. స్నేహితుల ద్వారా అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు ఈ రాశివారికి అదృష్ట యోగం పడుతుంది. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన వృద్ధి, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువుల నుంచి అందిన శుభవార్తలు మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ప్రణాళిక ప్రకారం అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ఆర్ధిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. నమ్మిన వారే మీకు హాని తలపెట్టవచ్చు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. విదేశీ బంధువుల నుంచి అందిన వార్తలతో మానసిక శాంతి కొరవడుతుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ప్రయోగాత్మకంగా ఆలోచించి మార్పులు తీసుకు వస్తారు. అయితే ఫలితాలు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల నిరాశకు లోనవుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మనశ్శాంతి కలుగుతుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి కావడంతో ఆనందంగా ఉంటారు. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. రచయితలకు, సాహితీవేత్తలు శుభ సమయం నడుస్తోంది. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇన్ని రోజులుగా ఉన్న చెడు గ్రహ ప్రభావం తొలగిపోయి మంచిరోజులు మొదలయ్యాయి. ఇంట్లోనూ, ఆఫీస్ లోనూ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగస్తులు ఉత్సాహంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. శివారాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చెడు గ్రహాల ప్రభావం ఇంకా తొలగిపోలేదు. అయితే గతం కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సంతానం అనారోగ్యం ఆందోళనకు కలిగిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అల్ల కల్లోలంగా ఉన్న కుటుంబ వాతావరణం కారణంగా మానసికంగా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరుతాయి. ఈ ప్రభావం మీ ఆరోగ్యం పై పడుతుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. మీ ప్రియమైన వారితో మీరు గొడవ పడే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం సహకరించదు. వైద్య ఖర్చుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది. కొన్ని అవమానకరమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. మొండితనం, నిర్లక్ష్య వైఖరీ వీడితేనే సమస్యలు తగ్గుముఖం పడతాయి. నవగ్రహ పూజలు జరిపిస్తే మేలు జరుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధించిన సమస్యలు దూరమవుతాయి. వృత్తిపరంగా, ఆదాయ పరంగా అభివృద్ధి చెందుతారు. సామాజిక సంబంధాలు వృద్ధి చెందుతాయి. సానుకూల శక్తి అధికంగా ఉండడంతో చేపట్టిన అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. ఇంటా బయటా సానుకూల పరిస్థితులు నెలకొనడంతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు, వృత్తి పనివారు తమ సహచరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపావేశాల కారణంగా విరోధులు పెరుగుతారు. పనుల్లో ఆలస్యం ఉంటుంది. అందరితో స్నేహపూర్వకంగా ఉంటే మంచిది. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి. వృధా ఖర్చులను నివారించండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. కొన్ని అవాంఛనీయమైన సంఘటనల కారణంగా బంధువులతో మనస్పర్థలు నెలకొనే అవకాశం ఉంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.