ETV Bharat / spiritual

ఆ రాశుల వారు నేడు సైలెంట్​గా ఉండడం బెటర్​- లేకుంటే అనవసరమైన వివాదాలు పక్కా! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today 9th September 2024 : 2024 సెప్టెంబర్ 9న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 5:15 AM IST

Horoscope Today 9th September 2024 : 2024 సెప్టెంబర్ 9న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు కొంత ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రోజంతా ఆధ్యాత్మికంగా గడుపుతారు. ప్రకృతికి దగ్గరగా సమయం గడుపుతారు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు సమయానుకూలంగా సహనంతో ఉండడం అవసరం. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. శివారాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సౌఖ్యం, ఆర్ధిక వృద్ధి, కార్యసిద్ధి వంటి శుభ ఫలితాలు ఉంటాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంటికి బంధువుల రాకతో సందడి వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపడతారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేనందున చేపట్టిన పనుల్లో తీవ్ర ఆటంకాలు ఉండవచ్చు. కొత్త ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లతో అశాంతి నెలకొంటుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు, మర్యాద ఉంటాయి. ఆర్థిక సంబంధమైన లబ్ధి కూడా ఉండవచ్చు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. చేపట్టిన పనులన్నీ ఆలస్యం కావడం ఆందోళన కలిగిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. కొత్త పనులు ఈ రోజు మొదలు పెడితే విజయవంతం కావు. కోపావేశాలను, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు కొత్తగా ఏ పని మొదలు పెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. వృత్తి వ్యాపారులకు నూతన వెంచర్లు, ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభసమయం. ఉద్యోగులు నూతన అధికారం చేపడతారు. స్థానచలనం సూచన కూడా ఉంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికీ , షేర్స్​లో ఇన్వెస్ట్ చేయడానికీ అనుకూలమైన సమయం. ధార్మిక కార్యక్రమాలు, దేవాలయ సందర్శన చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులు మొదలు పెట్టేముందు పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉంటే మంచిది. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు కారణమవుతాయి. అందరినీ సంప్రదించి సమష్టిగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అభయ ఆంజనేయస్వామి ఆరాధన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు తారాబలం అద్భుతంగా ఉంది కాబట్టి వృత్తి వ్యాపారాలవారికి, ఉద్యోగులకు కలిసి వచ్చే కాలం. అన్ని రంగాల వారికి ఆర్ధిక ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. బంధుమిత్రులతో విహారయాత్రకు వెళతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కీలకమైన వ్యవహారాల్లో రాజీధోరణి అవలంబిస్తే మంచిది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలతలు ఉంటాయి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఉండవచ్చు. ఉద్యోగులు పట్టుదలతో పనిచేసి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్ధతను నిరూపించుకుంటారు. వ్యాపారస్తులకు గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఊహించని విధంగా ఆదాయం పెరగడం వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రయోజనకరంగా ఉంటాయి. దైవబలం అండగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. సకల మనోభీష్టాలు నెరవేరే అద్భుతమైన రోజు ఇది. ఈ రోజు మీరు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి వ్యవహారాల ఒప్పందాలు చెయ్యడానికి ఇది సరైన రోజు. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. ఎటు చూసినా శుభఫలితాలు కనిపిస్తున్నాయి. శ్రీలక్ష్మీనారాయణుల ఆరాధన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు ఉద్యోగులు ప్రతి విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సహోద్యోగులతోనూ, ఉన్నతాధికారులతో సమయానుకూలంగా వ్యవహరిస్తే శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. దూరప్రయాణాలు లాభిస్తాయి. గృహ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. కుటుంబ సభ్యులతో తీర్ధ యాత్రలకు ప్రణాళికలు వేస్తారు. అభయ ఆంజనేయస్వామి ఆరాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. చిత్రసీమ, ఫైన్ ఆర్ట్స్ రంగాల వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు మెండుగా వస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంతో మీ అనుబంధం దృఢ పడుతుంది. మీరు సాధించిన విజయాలు మీకు గొప్ప పేరు ప్రతిష్టలను తీసుకు వస్తాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ఆటంకాలు తొలగి పోతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.