Horoscope Today 7th September 2024 : 2024 సెప్టెంబర్ 7న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రోజంతా స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగులు సమర్ధవంతంగా పనిచేసి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. శివారాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు వృత్తి వ్యాపారాలలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఊహించని ఈ పరిణామాలను ధైర్యంగా ఎదుర్కొని స్థిరంగా ముందుకు సాగుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం అండగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తుల అమ్మకాల ద్వారా ధనం చేతికి అందుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. మీ మంచి మనసు, పరోపకార గుణం కారణంగా సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు గట్టి ప్రయత్నాలు చేస్తే తప్పక విజయం ఉంటుంది. గణపతి ఆరాధన శుభప్రదం.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని ఊహించని ఘటనలను ఈ రోజు ఎదుర్కోంటారు. వృత్తి వ్యాపారాలలో క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి. స్నేహితుల సహకారంతో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. పైకం చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే తీవ్రమైన కృషి అవసరం. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవం మీద విశ్వాసం ఉంచి ఆత్మబలంతో పనిచేస్తే విజయం మీదే! చేపట్టిన అన్ని పనులు విజయం చేకూరుస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు వంటి ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారు అనుభవజ్ఞులు సలహాలు తీసుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభప్రదం.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనిచేస్తే శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతల పట్ల దృష్టి సారిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఆర్ధికంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు. వ్యాపారంలో తీవ్రమైన పోటీ, సవాళ్లు ఉండవచ్చు. కుటుంబంలో వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ శ్రేయస్కరం.
తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు, నిధుల కోసం ప్రయత్నించే వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అనుకోని విధంగా అవసరాలకు డబ్బు అందుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం బాగుతుంటుంది. వినాయకుని పూజించడం శుభకరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా కోపాన్ని అదుపులో నియంత్రణలో ఉంచుకోకపోతే భారీ నష్టం తప్పదు. వృత్తి పరంగా వ్యక్తిగతంగా కొన్ని ప్రతికూలతలు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. బంధువుల ప్రవర్తన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. వాహన గండం ఉంది కాబట్టి ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. శ్రీ దుర్గాదేవి ధ్యానంతో ప్రతికూలతలు తొలగిపోతాయి.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. నూతన ప్రాజెక్టులు చేపట్టడానికి అనుకూలమైన సమయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ఉద్యోగంలో కఠిన పరిస్థితులు ఉండవచ్చు. పనిభారం పెరుగుతుంది. పనులు ఆలస్యం కావడం పట్ల ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉంటారు. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి.
మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు యోగకరంగా ఉంటుంది. మీ ప్రతిభకు పురస్కారం దక్కుతుంది. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. సన్నిహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి కానుకలు అందుకుంటారు. నిరుద్యోగులు, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరికొంత కాలం వేచి చూడాలి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
కుంభం (Aquarius) : మకర రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనులు నెమ్మదిగా సాగుతాయి. సహనంతో ఉంటే మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో ఒత్తిడికి లోనవుతారు. ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కష్టసాధ్యమవుతుంది. ఊహించని ఖర్చులు చుట్టుముడతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. శివారాధన శ్రేయస్కరం.
మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాలవారు ఎంత ప్రణాళికతో ఉన్నప్పటికినీ వృత్తి వ్యాపారాలలో అనుకూలతలు ఉండవు. గిట్టని వారు చేసే దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పి కొడతారు. వ్యాపారంలో కష్టనష్టాలు ఉంటాయి. సహనంగా ఉండటం మంచిది. మార్పు, పురోగతి కోసం వేచి చూడాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్యహృదయం పారాయణ శక్తినిస్తుంది.