Horoscope Today 5th September 2024 : 2024 సెప్టెంబర్ 5న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సంతృప్తికరమైన పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు బుద్ధిబలంతో పని చేసి సత్వర విజయాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం సమకూరుతుంది. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. లాభాల శాతం తగ్గుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధనతో మరిన్ని మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మొదలు పెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనోబలంతో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఉద్యోగంలో శ్రమ పెరగవచ్చు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. సంతానం అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఆర్ధిక వృద్ధి, కుటుంబ సౌఖ్యం ఉంటాయి. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతుతో ముందుకెళ్తే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గిట్టని వారు, అసూయపరులు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది. వృత్తి ఉద్యోగాలలో అనుక్షణం జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం. వ్యాపారులకు ధననష్టం సూచన ఉంది. మనోబలంతో చేసే పనులు అనుకూలిస్తాయి. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. వృథా ఖర్చులు నివారించుకోండి. ఓ సంఘటనలో బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. పరిస్థితులకనుగుణంగా మీరు నడుచుకునే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. లేకుంటే అందరితో వివాదాలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. మీ కోపం కారణంగా సన్నిహితులతో సంబంధాలు చెడిపోతాయి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. శ్రీ ఆంజనేయస్వామి దండకం చదువుకుంటే మంచిది.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు అన్ని పనులు సకాలంలో పూర్తి కావడంతో ఈ రోజు సరదాగా, సంతోషంగా ఉంటారు. ఆర్ధికంగా పురోగతి సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతం కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. క్లిష్టమైన పరిస్థితులను మీకు అనుగుణంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. ప్రతికూల ఆలోచనలు వీడండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నందున సహనంతో ఉండడం చాలా అవసరం. మీ స్వధర్మమే కఠినమైన పరిస్థితుల నుంచి బయట పడేస్తుంది. ఆర్ధికంగా సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉండవచ్చు. వివాదాలు నివారించడానికి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అభయ ఆంజనేయస్వామి ప్రార్ధనతో ఆపదలు తొలగిపోతాయి.
మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు పనిలో తమదైన ముద్ర వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు పోటీదారులని అధిగమించి విజేతగా నిలుస్తారు. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. రచయితలకు, కళాకారులకు శుభసమయం. గొప్ప వకాశాలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆరాధన శ్రేయస్కరం.