ETV Bharat / spiritual

ఆ రాశివారికి ప్రతికూల ఆలోచనల వల్ల అవకాశాలు చేజారుతాయ్! హనుమ ఆరాధన మేలు! - HOROSCOPE TODAY NOVEMBER 5TH 2024

నవంబర్ ​5వ తేదీ (మంగళవారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Horoscope Today November 5th 2024
Horoscope Today November 5th 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 5:01 AM IST

Horoscope Today November 5th 2024 : నవంబర్ ​5వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఈ రోజు ఎక్కువగా దైవచింతనలో కాలం గడుపుతారు. సహృదయంతో గతంలో చేసిన తప్పిదాలకు బాధ్యత తీసుకుని పరిస్థితులను చక్కదిద్దుతారు. భవిష్యత్​లో మీరు అందుకోబోయే విజయాలకు ఇది మంచి బాట అవుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బ తింటుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాలవారు తమ తమ రంగాలలో ఎదురైనా సమస్యల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. సన్నిహితుల సహకారంతో సమస్యల నుంచి బయట పడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో పోటీ పెరగడం వల్ల పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ రోజు కలిసివస్తుంది. పదోన్నతులు రావడం వల్ల నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. వృత్తి పరంగా సీనియర్ల నుంచి సహకారం, స్ఫూర్తి అందుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా కోపావేశాలను అదుపులో ఉంచుకోకపోతే వృత్తి పరంగా భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. తొందరపడి మాట మీరడం వలన శత్రువులు పెరుగుతారు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. సంయమనాన్ని కోల్పోకండి. యోగా ధ్యానంతో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు సంభవించే సూచన ఉంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు ఈ రోజు విజయవంతంగా పూర్తవుతాయి. భూమి, ఇల్లు కొనాలనుకునే వారికి ఈ రోజు శుభసమయం. కళాకారులకు ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. మీలోని కళాత్మకత ప్రదర్శించే అవకాశం లభించవచ్చు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. లక్ష్మీకటాక్షంతో సంపదలు వృద్ధి చెందడంతో మీలో ఉత్సాహం, ఆనందం వెల్లివిరుస్తుంది. బుద్ధిబలంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విమర్శకులకు సరైన సమాధానం చెబుతారు. సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయించడం శ్రేయస్కరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. వ్యాపారంలో సవాళ్లు ఎదురుకావడం వల్ల ఒత్తిడికి గురవుతారు. కుటుంబ సభ్యుల, సన్నిహితుల సహకారంతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో క్లిష్ట పరిస్థితులు ఉండటం వల్ల ఆందోళనకు గురవుతారు. ప్రతికూల ఆలోచనల కారణంగా విజయం అందినట్లే అంది చేజారిపోతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మనస్తాపాన్ని కలిగిస్తుంది. యోగా, ధ్యానం సాధన చేస్తే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు, కొత్త అసైన్మెంట్లు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాలలో సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చిత్తశుద్ధితో లక్ష్యసాధన కోసం కృషి చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అనవసరమైన వాదనలు, చర్చలకు దూరంగా ఉండడం మంచిది. విలాసాలకు పోయి డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. విద్యార్థులు కఠోర సాధనతోనే విజయాలను పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అదుపు తప్పే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చెయ్యండి. ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారేలా ఉంది. గొడవలు, వాదనలు ఏర్పడకుండా సహనం వహించండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. శివారాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి నిపుణులకు, వ్యాపారులకు ఈ రోజు ఫలప్రదం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగంటో ఉత్సాహంగా ఉంటారు. గృహంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. అయితే కొందరి బంధువుల ప్రవర్తన కారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పకపోవచ్చు. వృథా ఖర్చులను అదుపు చెయ్యండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో చెప్పుకోతగ్గ మార్పులేమీ ఉండవు. ఖర్చులు పెరగడం వల్ల అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. వృత్తి నిపుణులు ప్రతిభ, నైపుణ్యాలను పెంచుకోకపోతే రాణించడం కష్టం. కుటుంబంలో ఘర్షణలు జరిగే అవకాశముంది. శనిస్తోత్రం పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. రచయితలకు, కళాకారులకు అనుకూలమైన సమయం. సృజనాత్మకంగా, క్రియేటివ్ గా పనిచేసి మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విదేశాల్లో నివసించే బంధువుల నుంచి శుభ సమాచారం అందుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.