ETV Bharat / spiritual

ఆ రాశుల వారు నేడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి- లేకుంటే అందరూ శత్రువులుగా! - DAILY HOROSCOPE IN TELUGU

నవంబర్ ​4వ తేదీ (సోమవారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 3:14 AM IST

Horoscope Today November 4th 2024 : నవంబర్ ​3వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ రోజు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే శత్రువులు పెరిగే ప్రమాదముంది. కోపావేశాలు అదుపులో ఉంచుకోకపోతే పని మీద దృష్టి సారించలేరు. మాట్లాడే ప్రతిమాట ఆలోచించి మాట్లాడాలి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసిరావు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సౌఖ్యం, ఆర్ధిక వృద్ధి, కార్యసిద్ధి వంటి శుభ ఫలితాలు ఉంటాయి. సమాజంలో పేరు, ప్రఖ్యాతులు సాధిస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలవారు ఈ రోజు తమ తమ రంగాలలో విజయవంతంగా చాలా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. గృహంలో ప్రశాంత వాతావరణం ఉండవచ్చు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వృధా ఖర్చులు పెరగవచ్చు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. పనిలో తోటివారి సహకారం ఉంటుంది. మీ పనితీరుకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. శ్రీలక్ష్మీ దేవి ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. అనారోగ్యం కారణంగా చేపట్టిన పనులన్నీ ఆలస్యం కావడం ఆందోళన కలిగిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. కొత్త పనులు ఈ రోజు మొదలు పెడితే విజయవంతం కావు. కోపావేశాలను, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ కలహాలకు ఆస్కారముంది. కోపాన్ని అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉంటే గొడవలు ఉండవు. ప్రతికూల ఆలోచనల కారణంగా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కొరవడుతుంది. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు, ఆటంకాలు ఏర్పడటంతో అశాంతితో ఉంటారు. ఆర్ధిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. నీటి గండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. ఆస్తి సంబంధిత వ్యవహారాలలో బంధువులతో విరోధం ఏర్పడవచ్చు. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగుతాయి.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకోని సంపదలు కలిసి రావడంతో ఆనందంగా ఉంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెంచాలి. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఇతరులు చెప్పిన మాటలు నమ్మి మోసపోయే ప్రమాదముంది. స్వబుద్ధితో ఆలోచించి వివేకంతో చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదు. నమ్మించి మోసం చేసే వారిపట్ల జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో పురోగతి, ఆర్ధిక ప్రయోజనాలుంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టం వాటిల్లుతుంది. మీ మాటతీరుతో చిక్కుల్లో పడతారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆర్ధిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదముంది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆర్ధికంగా శుభ ఫలితాలున్నాయి. అనుకోకుండా సంపదలు కలిసివస్తాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. స్నేహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఊహించని ధనలాభాలు అందుకుంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి చేపట్టిన పనులు సులభంగా, సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు, వృత్తినిపుణులు ఊహించని విజయాన్ని అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఆర్థికంగా గొప్ప శుభఫలితాలను అందుకుంటారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ కంటే బలవంతులతో, ఉన్నతాధికారులతో గొడవలకు దిగడం ప్రమాదం. ఈ రోజంతా అనారోగ్యం కారణంగా బద్ధకంగా, అలసటగా ఉంటారు. వ్యాపారంలో పోటీ దారులతోనూ, ప్రత్యర్థులతోనూ అనవసరమైన తగాదాలు రాకుండా చూసుకుంటే మంచిది. ప్రతికూల ఆలోచనలు వీడి వృత్తిలో మీ నైపుణ్యం చూపవలసిన తరుణం ఆసన్నమైంది. చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు కూడా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంకట మోచన హనుమాన్ ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.