ETV Bharat / spiritual

ఆ రాశివారికి పెళ్లి కుదిరే ఛాన్స్! ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది! - DAILY HOROSCOPE

అక్టోబర్ 29వ తేదీ (మంగళవారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 5:00 AM IST

Horoscope Today 29th October 2024 : 2024 అక్టోబర్ 29వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న గడ్డు పరిస్థితుల నుంచి బయట పడతారు. మీ సహజ లక్షణాలైన పరోపకారం గురించి విమర్శించే వారిని పట్టించుకోవద్దు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరగడం వల్ల సంతృప్తిగా ఉంటారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా రంగాల వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేస్తారు. రచయితలూ, కళాకారులుకు అనుకూలమైన సమయం. నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. బుద్ధిబలంతో ఓ కీలక విషయంలో విజయం సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడంలో సందిగ్దత నెలకొంటుంది. భావోద్వేగాలను అదుపు చేయడంలో విఫలం అవుతారు. కుటుంబ సమస్యలకు సంబంధించిన చర్చలలో సంయమనం పాటించండి. మీ సహనమే మీకు శ్రీరామరక్ష. వృత్తిపరంగా ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేస్తే మనచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులలో పని చేసే అవకాశం రావడం వల్ల ఆనందంగా ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. అదృష్టం కలిసివచ్చి అనుకోని విధంగా సంపదలు వరిస్తాయి. మీ ప్రత్యర్ధులు వారి ఓటమిని అంగీకరించి మౌనంగా పక్కకు తప్పుకుంటారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి వృత్తి వ్యాపారాలలో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటారు. సామాజిక పరపతి పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలను కుటుంబ సభ్యుల సహకారంతో అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ శ్రేయస్కరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున కోరినవన్నీ పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో విజయం చేకూరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు వృద్ధి చెందుతాయి. సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారులకు ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిని ఈ రోజు అనారోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. పనిపట్ల ఏకాగ్రత లోపిస్తుంది. శత్రువులు పుంజుకునే ప్రమాదముంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఒక కీలక వ్యవహారంలో ఆర్థిక నష్టం ఉండే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. లేకుంటే సన్నిహితులతో అపార్ధాలు, కలహాలు ఏర్పడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో నూతన అవకాశాలను అందుకుంటారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. పనిప్రదేశంలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అదృష్టం వరించి అనుకున్నవన్నీ సాధిస్తారు. ఆర్థిక అంశాలలో స్వబుద్ధితో, తెలివిగా వ్యవహరించి లాభం పొందుతారు. ఉద్యోగులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగులకు మీ సహకారాన్ని అందిస్తారు. వ్యాపార పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు సత్ఫలితాలను అందిస్తాయి. పిత్రార్జితం కలిసి వస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలం, తెలివితేటలతో పనిచేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. బద్దకాన్ని వీడి చురుకుగా ఉంటే కార్యసిద్ధి ఉంటుంది. రచయితలకు, కవులకు శుభసమయం నడుస్తోంది. సృజనాత్మకతతో పనిచేసి సామాజికంగా మంచి గుర్తింపు పొందుతారు. గిట్టనివారి విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో మేలు జరుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా అనేక ఇబ్బందులు, ఒత్తిడి పెరిగే అవకాశం వుంది. కోపావేశాలకు లోను కాకండి. దైవారాధనలో గడిపితే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ వాదనలు దిగవద్దు. ఇతరులను బాధపెట్టే విధంగా ప్రవర్తించవద్దు. ఇంట్లో శుభకార్యాల మూలక ధనవ్యయం ఉండవచ్చు. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహగతులు అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి సంతృప్తినిస్తుంది. వ్యాపారులు భాగస్వాముల సహకారంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సినీ, కళా రంగం వారు గొప్ప అవకాశాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శివారాధన శ్రేయస్కరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.