ETV Bharat / spiritual

ఆ రాశివారి కోపం అదుపులో ఉంచుకోవాలి - లేకుంటే చాలా ప్రమాదం - వినాయక ప్రార్థన శుభకరం! - HOROSCOPE TODAY

అక్టోబర్ 26వ తేదీ (శనివారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Horoscope
Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 5:00 AM IST

Horoscope Today 26th October 2024 : 2024 అక్టోబర్ 26వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, కుటుంబ పరంగా కీలకమైన చర్చలలో పాల్గొంటారు. ఈ చర్చలు వివాదాలకు దారితీసే అవకాశముంది. కాబట్టి కోపావేశాలను అదుపులో ఉంచుకోండి. వృత్తి పరంగా ఎదురయ్యే సమస్యలతోటి ఆందోళన చెందుతారు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఉద్యోగులు, సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కనుక ఉత్సాహంగా ఉంటారు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ నృసింహ స్వామి ఆలయ సందర్శనం శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తోబుట్టువులతో ఆస్తి తగాదాల కారణంగా కోర్టు గడప ఎక్కాల్సి వస్తుంది. కుటుంబంలో ఉద్రిక్తత నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. దీనితో తీవ్ర నిరాశకు లోనవుతారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెట్టాలి. శనిస్తోత్రం పారాయణ చేస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి, ఆర్థికవృద్ధి ఉండడంతో సంతోషంగా ఉంటారు. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలలో భావోద్వేగానికి లోనవుతారు. కోపావేశాలను అదుపులో ఉంచుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు నిరాశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతారు. అనాలోచిత నిర్ణయాల వలన చేతికి అంది వచ్చిన అవకాశాలు దూరమవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారులకు ప్రయాణాలు కలిసిరావు. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడంతో ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఇన్నాళ్ల మీ కష్టానికి ప్రతిఫలాన్ని అందుకుంటారు. వృత్తి పరంగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. గృహాలంకరణ కోసం అధిక ధనవ్యయం చేస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన శుభ వర్తమానం మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. కీలకమైన బాధ్యతలు చేపడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు, ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఉండడంతో ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సుతో హాయిగా గడుపుతారు. చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు రుణవిముక్తులు అవుతారు. భాగస్వామ్య వ్యాపారాల ద్వారా మంచి లాభాలను అందుకుంటారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు, అనారోగ్యం ఈ రోజు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. సన్నిహితుల ప్రవర్తన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరగడంతో ఒత్తిడికి లోనవుతారు. యోగా ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత పొందవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పర్యటనలు చేస్తారు. ఖర్చులు అధికం కాకుండా జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సహచరులతో అభిప్రాయభేదాలు రావచ్చు. మొండి పట్టుదలకు పోకుండా రాజీధోరణి అవలంభిస్తే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విఘ్న వినాయకుని ప్రార్థిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి దైవబలంతో మంచి ఆరోగ్యం, సంపద, సంతోషం చేకూరుతాయి. వ్యాపారంలో విజయ పరంపర కొనసాగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. విలాస వస్తువుల కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. చెడు సావాసాల పట్ల ఆకర్షితులవుతారు. పాశ్చాత్య సంస్కృ తుల ఆకర్షణలకు దూరంగా ఉంటే మంచిది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మేధోపరమైన సంభాషణలకు, ముఖ్యమైన వ్యవహారాలకు దూరంగా ఉండండి. కొత్త ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మోసపోయే ప్రమాదముంది. కార్యసిద్ధి హనుమ ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.