Horoscope Today 22nd October 2024 : 2024 అక్టోబర్ 22వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో విజయాల పరంపర కొనసాగుతుంది. వృత్తి జీవితంలో విజయాలు సాధించినా కుటుంబ సమస్యల కారణంగా మానసిక ప్రశాంత కొరవడుతోంది. ముఖ్యమైన సమస్యల గురించి ఒక నిర్ణయానికి రాలేరు. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకునే సమర్ధత లోపిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగరీత్యా ప్రయాణానికి అవకాశం ఉంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మనశ్శాంతి ఉంటుంది.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజంతా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. వృత్తి నిర్వహణలో అయోమయం, అనిశ్చితి కారణంగా చేతికి అందిన అవకాశాలు చేజారిపోయే ప్రమాదముంది. మొండి పట్టుదల వీడి రాజీధోరణి అవలంబిస్తే మేలు. అనారోగ్యం కారణంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. ఈరోజు ప్రత్యేకంగా రచయితలకు, కళాకారులకు , కన్సల్టెంట్లకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు వృత్తి వ్యాపారాలలో విశేషమైన ఆర్ధిక లాభాలను అందుకుంటారు. ఉద్యోగరీత్యా పదోన్నతులు, బదిలీ వంటి శుభ ఫలితాలు ఉంటాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృథా ఖర్చులు పెరిగే సూచన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా తీవ్ర సంక్షోభం నెలకొంటుంది. అనారోగ్య సమస్యలు తీవ్రం కావడం వల్ల గజిబిజిగా, గందరగోళంతో ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా ఉంటారు. ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. ఇంటి మరమ్మత్తుల నిమిత్తం అధిక ఖర్చు ఉంటుంది. మాట నియంత్రణలో పెట్టుకోండి. సన్నిహితుల మధ్య అపార్థాలు తొలగించే ప్రయత్నం చేయండి. శనిస్తోత్ర పరాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆర్ధిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఇతరుల పట్ల ఉదారస్వభావంతో ఉంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. అందివచ్చిన అవకాశాలను చేజార్చుకోవద్దు. బంగారు భవిష్యత్‌కు అవసరమైన నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా అంతటా విజయమే! అదృష్టం వరించి లక్ష్మీకటాక్షాన్ని పొందుతారు. ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతి ద్వారా ఆదాయం వృద్ది చెందుతుంది. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. పిత్రార్జితం నుంచి లబ్ధి పొందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ ధోరణి ఉండడంతో ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం
తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, ఉద్యోగస్థులు తమ సహచరులతో పరస్పర సహకారం కలిగి ఉండడం వలన పని ప్రదేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది.
కుటుంబ సభ్యులతో దూరప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్తారు. సాహిత్య, మేధోపరమైన చర్చలలో పాల్గొంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు ఉంటాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు అన్ని విధాలా సురక్షితంగా ఉండటానికి విచక్షణతో వ్యవహరించాలి. వృత్తి వ్యాపార పనులు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. వీలైనంత వరకు ఈ రోజు కొత్తగా ఏ పనులు మొదలు పెట్టవద్దు. ముఖ్యమైన పనులు, ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన పనులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనేక మార్గాలలో డబ్బు వచ్చి చేరడం వల్ల రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. వృత్తి పరంగా విదేశీయులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటారు. స్నేహితులతో కలిసి సరదాగా విందు వినోదాలలో పాల్గొంటారు. రచయితలకు సాహిత్య కార్యకలాపాలకు అనువుగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భుజంగ స్తోత్ర పారాయణ శుభకరం.
మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు ఊహించని ఆశ్చర్యాలను చూస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ఖర్చులు పెరిగినప్పటికిని ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పంచముఖ ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.
కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేనందున ఈ రోజు చేపట్టే పనులలో ఆలస్యం, ఆర్ధిక నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఊహించని సంఘటనలతో రోజంతా ఆందోళనగా ఉంటారు. కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఉండాలి. తరచుగా మీకు ఇబ్బందులు కలిగిస్తున్న వారెవరో గుర్తించి చర్యలు చేపట్టాలి. కళా రంగం వారు సృజనాత్మకతపై దృష్టి సారిస్తే మెరుగైన అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా చర్చలు, సదస్సులలో పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. కార్యసిద్ధి హనుమ ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.
మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు ప్రతి పనిలోనూ కఠినమైన సమస్యలను ఎదుర్కొంటారు. అపజయాలు వెంటాడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ధననష్టం, ఆస్తినష్టం ఉండవచ్చు. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. వీలైనంత వరకు సహనంతో, ప్రశాంతంగా ఈ రోజును గడిపేందుకు ప్రయత్నించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడవలసి ఉంటుంది. వ్యంగ్య సంభాషణలు చేసి చిక్కులో పడవద్దు. శనికి తైలాభిషేకం చేయించడం వలన సత్ఫలితాలు ఉంటాయి.