ETV Bharat / spiritual

ఆ రాశివారు మొండి పట్టుదల, దూకుడు తగ్గించుకోవాలి - శివారాధన శ్రేయస్కరం!

అక్టోబర్ 20వ తేదీ (ఆదివారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Horoscope
Horoscope (ETV Bharat)

Horoscope Today 20th October 2024 : 2024 అక్టోబర్ 20వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో మీ మాటే చెల్లుబాటు కావాలన్న మొండి పట్టుదలకు పోకుండా రాజీధోరణి అవలంబిస్తే మేలు. సమిష్టి నిర్ణయాలతో మేలు జరుగుతుంది. కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కోపం అదుపులో పెట్టుకుంటూ జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితోనూ అనవసరంగా వాదనల్లోకి దిగి అపవాదుల్ని మీదకు తెచ్చుకోకండి. వృథా ఖర్చులు నివారించి పొదుపు మార్గాలపై దృష్టి సారిస్తే మంచిది. అమ్మవారి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ధన లాభం ఉంటాయి. అంతటా శుభఫలితాలు ఉండడంతో సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. గృహ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరిస్తారు. మీ ప్రియమైన వారితో, సన్నిహితులతో అనవసరంగా వాదిస్తారు. ఎవరికీ చెప్పుకోలేని, మీకు మాత్రమే తెలిసిన కొన్ని కారణాల వల్ల చికాకుగా, కోపంగా ఉంటారు. స్వీయ నియంత్రణ లేకుంటే ప్రియమైన వారితో విభేదాలు రావచ్చు. భావోద్వేగాలను అదుపు చేయలేనందున ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మనశ్శాంతి లభిస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. గతంలో కంటే మీ ఆదాయ వనరులు పెరిగి ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ ఆనందాన్ని కుటుంబంతో సెలబ్రేట్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభ ఫలితాలు ఉంటాయి. కనుక ఆనందంగా ఉంటారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం కలిసికట్టుగా ఈ రోజు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. తారాబలం అనుకూలించి అదృష్టం వల్ల ప్రమోషన్ ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలలో అనుకూలత ఉంది. సింహారాశి వారి సహజంగా ఉండే అపరిమితమైన బలం సామాజికంగా మంచి గుర్తింపు తీసుకువస్తుంది. ఈ రోజు ప్రభుత్వ విషయాలకు సంబంధించి, ఆర్థిక సంబంధమైన డాక్యుమెంట్లు చూడడానికి మంచిరోజు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఒక్క ప్రతికూలత కూడా లేని శుభకరమైన రోజు. దైవారాధన, ధార్మిక కార్యక్రమాలతో శుభారంభం చేస్తే అంతా మంచే జరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో కలుసుకుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలలో మిత్రుల నుంచి అందిన శుభ సమాచారంతో ఈ రోజంతా సంతోషంగా, సరదాగా గడిచిపోతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కోపావేశాలతో తీవ్రమైన పదజాలంతో మాట్లాడి సన్నిహితులను బాధిస్తారు. కోపం తగ్గాక ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. అనవసరంగా సంబంధాలు దెబ్బ తింటాయి. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. సమస్యలు తీరాలంటే దైవ ప్రార్థన, ధ్యానం లాంటివి చేయడం మంచిది. అందువల్ల సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. అనైతికమైన, చట్ట విరుద్ధమైన పనులు చేయకండి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరగవచ్చు. నవగ్రహ శ్లోకాలు పారాయణ చేస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో తీవ్రమైన కృషి చేసి అనుకున్నది సాధిస్తారు. మీ లక్ష్య సాధనకు మార్గం సుగమం చేసుకుంటారు. తీరికలేని పనుల నుంచి కొంత విరామం తీసుకొని కుటుంబంతో సరదాగా గడపండి. స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సాహసయాత్రలపై ఆసక్తి చూపిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. తారాబలం అనుకూలించి అదృష్టం అవకాశాలుగా మారి మీ ఇంటి తలుపు తడుతుంది. మానసికంగానూ, శారీరకంగానూ దృఢంగా ఉంటారు. కాలం కలిసివచ్చి చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి. మీ ఇంట్లో, పని ప్రదేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ విజయంతో ప్రత్యర్ధులు తమ ఓటమిని అంగీకరిస్తారు. మీ కుటుంబం గర్వించే స్థాయికి ఎదుగుతారు. శివారాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు గ్రహాలు అనుకూలించవు. అనారోగ్యం మీ ఆనందాన్ని హరిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. పిల్లల ఆరోగ్యం ఆందోళన కరంగా ఉంటుంది. యోగా, ప్రాణాయామం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విశ్రాంతి మీద శ్రద్ద పెట్టండి. శని స్తోత్రం పారాయణ చేస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మొండి పట్టుదల, దూకుడు తగ్గించుకోవాలి. కోపావేశాలపై అదుపు సాధించాలి. ప్రతికూల పరిస్థితుల వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. కుటుంబ సభ్యులతో కలహాల కారణంగా జీవితం సాఫీగా గడవదు. సామాజికంగా పరపతి దెబ్బతినే పనులు చేయవద్దు. ఇల్లు, ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టాలి. మిత్రుల సహాయంతో ఆర్థిక వనరులను పెంచుకోవడం వలన ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టపడి పనిచేస్తేనే, విజయాన్ని పొందగలుగుతారు. సృజనాత్మకతతో పనిచేసి వృత్తిలో మీదంటూ ఖచ్చితమైన ముద్ర వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సమర్ధవంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని త్వరలో అమలు కూడా చేస్తారు. ఉద్యోగులు సానుకూల వైఖరి, నిర్ణయాత్మక శక్తితో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. స్నేహితులతో సాహసోపేతమైన పర్యటనకు ప్రణాళికలు వేస్తారు. శివపార్వతుల ఆలయ సందర్శన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.