Horoscope Today 19th September 2024 : 2024 సెప్టెంబర్ 19వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే శక్తి లోపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఏర్పడిన సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కీలక వ్యహారాల్లో నిర్ణయం తీసుకునే ముందు సన్నిహితులను సంప్రదిస్తే మంచిది. వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. ఆర్ధిక అంశాలలో మీ సొంత వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇతరుల మాటలకు ప్రభావితం కావద్దు. శివారాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సంతోషంగా గడుస్తుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి, ఉద్యోగస్తులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటికి బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులను అలంకరిస్తారు. చిత్తశుద్ధితో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వృత్తివ్యాపార రంగాల వారికి విజయసిద్ధి, ఆర్థికవృద్ధి ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఊహించని ఆర్థిక లాభం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికీ ఈ రోజు యోగకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు చేపట్టిన అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. పని ప్రదేశంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉన్నతాధికారుల అండతో ప్రమోషన్ పొందుతారు. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆరాధన శ్రేయస్కరం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారికి పనిఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. తగినంత విశ్రాంతి అవసరం. బాల్యస్నేహితులను కలుసుకొని మధురస్మృతులు నెమరు వేసుకుంటారు. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వృత్తిపరంగా కొన్ని వివాదాలూ చోటు చేసుకోవచ్చు. సహనంతో, సర్దుబాటు ధోరణితో ఉంటే వివాదాలు సమసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహాన లోపిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభకరం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు విశేషమైన యోగకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢపడుతుంది. వృత్తి వ్యాపారంలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గొప్ప ఆర్ధిక ప్రయోజనాలను అందుకుంటారు. వ్యాపారస్తులు విపరీతమైన లాభాలను గడిస్తారు. సమాజంలో గొప్ప పరపతి, ప్రతిష్ట పెరుగుతాయి. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే మీకు దాసోహం అంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక స్థితిగతులు పెరుగుతాయి. పదవీయోగం ఉంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో, ఆశావాదంతో పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. ఉద్యోగస్తులు ఆత్మవిశ్వాసంతో పనిచేసి శభాష్ అనిపించుకుంటారు. ఆశించిన ప్రమోషన్ కూడా అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. హనుమ ఆరాధన శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికీ ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేయండి. విద్యార్ధులు చదువులో రాణిస్తారు. స్నేహితుల నుంచి సహకారాలు అందుకుంటారు. వృత్తి వ్యాపార రంగాల వారు నూతన ఆదాయ వనరులను సమకూర్చుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు తొందరపడవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ సభ్యులతో గొడవలు, వాదనలు ఉంటాయి. ఉద్రేక స్వభావాన్నివిడిచి పెట్టి మాట పైన అదుపు ఉంచుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహ సంచారం సరిగా లేనందున అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలలో పురోగతి లోపిస్తుంది. ఆర్ధికంగా నష్టపోతారు. మాటలను నియంత్రణలో పెట్టుకోలేని కారణంగా సమస్యల్లో చిక్కుకుంటారు. మాటతీరును మార్చుకోకపోతే రోజంగా వాదనలు, సంజాయిషీలతో గడిచిపోతుంది. అనారోగ్య సమస్యల కారణంగా అధిక ధనవ్యయం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. సామాజిక బాధ్యతలు నెరవేర్చడంలో ముందుంటారు. ఉద్యోగస్తులను విజయలక్ష్మి వరిస్తుంది. ఏ రంగంలో అడుగుపెట్టినా, పట్టింది బంగారం అవుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఊహించని శుభఘడియలు రానున్నాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఇష్ట దేవత ఆలయ సందర్శన శుభప్రదం.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కష్టతరంగా మారుతుంది. కుటుంబంలో విభేదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి లోపిస్తుంది. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మీనం (Pisces) : మీనరాశి వారికీ ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా కొత్త పనులకి శ్రీకారం చుడతారు. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలకు అవకాశం ఉంది. ధార్మిక కార్యకలాపాలు, తీర్థయాత్రలపైన ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శ్రేయస్కరం.