ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులు - కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది! - DAILY HOROSCOPE

అక్టోబర్ 18వ తేదీ (శుక్రవారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 4:52 AM IST

Horoscope Today 18th October 2024 : 2024 అక్టోబర్ 18వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజంతా సుఖ, శాంతిమయంగా గడుస్తుంది. సానుకూల ఆలోచనల ప్రభావంతో శారీరకంగానూ, మానసికంగానూ ఉత్సాహంగా ఉంటారు. అన్ని పనులూ అత్యుత్సాహంతో ముగిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృ వర్గం నుంచి ఆర్థికపరమైన లబ్ధి ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఈ రోజు ఆశించినదానికన్నా మెరుగైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనుల్లో ఆచి తూచి వ్యవహరించాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనోబలం కోల్పోకుండా నిగ్రహం పాటించాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఆటంకాలను అధిగమిస్తారు. వృధా ఖర్చులు పెరిగే సూచన ఉంది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ ఆలోచనలను, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే వృత్తి, వ్యాపారంలో రాణించడం కష్టం. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తే చిక్కుల్లో పడటం ఖాయం. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ప్రతి చిన్న విషయానికి భావోద్వేగంతో అతిగా స్పందిస్తే చిక్కుల్లో పడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహసంచారం యోగిస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. గత కొంతకాలంగా అనుభవిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బంధు మితృల నుంచి కానుకలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. సంకల్ప బలంతో చేపట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. నిర్దేశించిన లక్ష్యం దిశగా పయనిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకి ప్రణాళిక వేస్తారు. విదేశాల్లో నివసించే బంధువుల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. తీవ్రమైన కోపావేశాల కారణంగా మానసిక శాంతి కొరవడుతుంది. సంతానం ప్రవర్తన మనస్తాపం కలిగించవచ్చు. వ్యాపారంలో ఆటంకాలు, ప్రతికూలతలు ఉండవచ్చు. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో శుభ ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా గందరగోళానికి గురవుతారు. ఏది సరైనదో ఎంచుకోలేక తికమక పడతారు. మీపై స్నేహితుల ప్రభావం పూర్తిగా ఉంటుంది. అనుభవం, అవగాహన లేకుండా కొత్త మార్గంలో పయనించడం శ్రేయస్కరం కాదు. ఆర్థిక నష్టం సూచితం. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. పరిణితితో అలోచించి నిర్ణయం తీసుకుంటే మేలు జరుగుతుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ అనుకున్నట్లుగా జరగడం వల్ల ఈ రోజు మీరు పూర్తిగా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్​కు బంగారు బాటలు వేసుకోడానికి శుభసమయం. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. వృత్తి పరంగా ఎదిగేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రచయితలకు కళాకారులకు అనుకూలమైన సమయం. సమాజంలో గుర్తింపు పొందుతారు. అనూహ్యంగా సంపదలు కలిసివస్తాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. శుభ సమయం నడుస్తోంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సహచరుల సంపూర్ణ సహకారం ఉంటుంది. అదృష్టవంతులు అవుతారు. వృత్తి పరంగా ఊహించిన దానికన్నా అధిక ఆదాయాన్ని పొందుతారు. ఈ ఆనందాన్ని కుటుంబంతో పంచుకుంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ సన్నిహితుల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. గతంలో వాయిదా పడిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన లాభాలు అధికంగా ఉంటాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపార రంగాల వారు అన్ని విషయాలలో ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. బంధువులతో కలహాలు సూచితం. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తగిన విశ్రాంతి అవసరం. హనుమాన్ చాలీసా పఠనం మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఒక కీలకమైన విషయంలో గెలుపు మీదే అవుతుంది. మీ ప్రతిభకు ప్రత్యర్ధులు మట్టి కరుస్తారు. కుటుంబంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవచ్చు. న్యాయ పరమైన అంశాలలో తొందరపాటు నిర్ణయాలు తగదు. ఇష్ట దేవత ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో గందరగోళంకు గురవుతారు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఈ పరిస్థితులు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలోనూ ఇబ్బందిపడతారు. ప్రతికూల అలోచనలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా మీ వృత్తిపై దృష్టి సారించండి. దైవబలం మీద విశ్వాసం ఉంచితే సానుకూల ఫలితాలుంటాయి. శివారాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం, విలాసాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఇతరులను మీ మాటలతో బాధించకుండా ఉండటానికి మాటలు, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. డబ్బుకు సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రతికూలమైన ఆలోచనలతో నిరాశకు లోనవుతారు. శివపంచాక్షరీ జపం శక్తినిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.