Dwadash Aditya Worship : హిందూ పురాణాల ప్రకారం సూర్యుని ద్వాదశ ఆదిత్యులుగా ఆరాధించడం సంప్రదాయం. అదితి, కశ్యపులు యొక్క 12మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో అభివర్ణిస్తారు.
భాగవతంలో ద్వాదశ ఆదిత్యుల ప్రస్తావన
మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణన ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం మనకున్న 12 నెలల్లో ఒక్కో నెలలో సూర్య భగవానుని ఆయా ఆదిత్యుని నామంతో పూజిస్తూ ఉంటారు.
ద్వాదశాదిత్యులు పేర్లు - సంచరించే మాసాలు
- 'ధాత' - చైత్ర మాసం
- 'అర్యముడు' - వైశాఖ మాసం
- 'మిత్రుడు' - జ్యేష్ఠ మాసం
- 'వరుణుడు' - ఆషాఢ మాసం
- 'ఇంద్రుడు' - శ్రావణ మాసం
- 'వివస్వంతుడు' - భాద్రపద మాసం
- 'త్వష్టా' - ఆశ్వయుజ మాసం
- 'విష్ణువు - కార్తీక మాసం
- ''అంశుమంతుడు' - మార్గశిర మాసం
- 'భగుడు' - పుష్య మాసం
- 'పూషా' - మాఘ మాసం
- 'పర్జన్యుడు' - ఫాల్గుణ మాసం
ద్వాదశ నమస్కారాలు
సాధారణంగా సూర్యారాధనలో ద్వాదశ నమస్కారాలకు ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో శుచియై సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ద్వాదశ ఆదిత్యులలో ఒక్కో ఆదిత్యుని పేరు చెబుతూ 12 సూర్య నమస్కారాలు చేయడం సూర్యుని ఆరాధించే విధానం. ఈ విధంగా ఎవరైతే ప్రతిరోజూ చేస్తారో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని శాస్త్ర వచనం.
మహర్షి వాక్కు
సూర్యుని ఆరాధనలో ప్రధానమైన ద్వాదశ నమస్కారాలు రోజూ చేసుకుంటూ, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ నిరాటంకంగా చేసుకున్నట్లైతే జీవించి ఉన్నంత కాలం ఆరోగ్యంగా జీవించి తుదకు అనాయాస మరణం పొందుతారని మహర్షి వాక్కు. అందుకే మనమందరం కూడా మహర్షులు చెప్పిన ప్రకారం సూర్యుని ఆరాధించి, ఆయురారోగ్యఐశ్వర్యాలను పొందుదాం.
ఆదివారం సూర్యడిని ఎలా ఆరాధించాలి
హిందూ ధర్మ శాస్త్రంలో సూర్య ఆరాధనకు విశిష్ట స్థానముంది. ముఖ్యంగా ఆదివారం సూర్యుని ఆరాధించడం మన సనాతన సంప్రదాయం. అయితే ఆరాధన ఏ విధంగా చేస్తే మంచిది? ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మీ ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు- ఎవరికీ ఎలాంటి శని బాధలు ఉండవ్! - Plant To Remove Shani Problem