Gayatri Devi Avataram Durga Devi : శరన్నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. "ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః" అని ఆ తల్లిని ప్రార్ధిస్తే సమస్త కోరికలు ఈడేరుతాయి. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా అలరారుతున్న శ్రీ గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. సకల దేవత మంత్రాలకు గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంటుంది. అందుకే సమస్త దేవత మంత్రాలకు చివర గాయత్రీ చేర్చి, రుద్ర గాయత్రీ, విష్ణు గాయత్రీ, లక్ష్మీ గాయత్రీ, వినాయక గాయత్రీ అని గాయత్రీ మంత్రంతో కలిపి చెప్తారు.
సకల దేవతలు నివేదించే పదార్ధాలన్నీ గాయత్రీ మంత్రంతో సంప్రోక్షించిన తర్వాతే దేవతలకు నివేదిస్తారు. జ్ఞాన ప్రదాయిని అయిన గాయత్రీ మాతను పూజిస్తే జ్ఞానం, ఐశ్వర్యం లభిస్తాయి. రోజు అమ్మవారిని నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. కనకాంబరాలతో అమ్మను పూజించాలి. దమాత శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి. క్తులందరిపై శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం ఉండుగాక! శ్రీ మాత్రే నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.