Do Not Use These Old Clothes To Clean House : ఇళ్లు శుభ్రంగా ఉంటేనే.. ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా చూడటానికి కూడా బాగుంటుంది. అందుకే చాలా మంది ఇంటి శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొందరు మాత్రం ఇంటిని క్లీన్ చేయడానికి మోప్లకు బదులుగా.. ఇంట్లో ఉన్న పనికిరాని, పాత దుస్తులను ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రం చేయడానికి కొన్ని రకాలు దుస్తులు అస్సలు ఉపయోగించకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ దుస్తులను క్లీనింగ్ కోసం వాడటం వల్ల ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇంతకీ ఉపయోగించని వస్త్రాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
చనిపోయిన వారి దుస్తులు : సాధారణంగా చనిపోయిన వారి బట్టలను కొంతమంది పారేస్తే.. మరికొందరు ఆ వస్త్రాలతో ఇంట్లోని ఏవైనా వస్తువుల దుమ్ము దులపడానికి ఉపయోగిస్తుంటారు. అలాగే ఇళ్లు తుడవడానికి కూడా ఉపయోగిస్తారు. అయితే చనిపోయిన వారి దుస్తులను ఇలా వాడకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
లో దుస్తులు : అలాగే పాత లో దుస్తులను కూడా ఇంట్లో ఫ్లోర్ తుడవడానికి ఉపయోగించకూడదని వాస్తు నిపుణులు పేర్కొన్నారు. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుందని చెబుతున్నారు.
మీ పర్సులో ఇవి పెట్టుకుంటే చాలు - ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి.. ధనవంతులుగా మారుతారు!
సింథటిక్ దుస్తులతో : కొందరు సింథటిక్ దుస్తులను ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. కానీ, ఇలాంటి వస్త్రాలతో ఇంటిని శుభ్రం చేయడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే.. వీటితో ఫ్లోర్‌ను శుభ్రం చేయడం వల్ల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సింథటిక్ దుస్తులతో ఇంట్లోని ఉత్తర, తూర్పు దిక్కులలో క్లీన్ చేయడం వల్ల అది నెగటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుందని అంటున్నారు. కాబట్టి, ఈ రకమైనటువంటి వస్త్రాలను ఉపయోగించవద్దని సూచిస్తున్నారు.
చిన్నపిల్లల బట్టలు : కొంత మంది ఇంట్లో చిన్న పిల్లల పాత బట్టలను ఫ్లోర్ తుడవడానికి ఉపయోగిస్తుంటారు. అలాగే ఫర్నీచర్ దుమ్ము దులపడానికి వాడతారు. కానీ, ఇలా చేయకూడదని వాస్తు నిపుణులంటున్నారు. ఎందుకంటే.. చిన్న పిల్లల బట్టలను శుభ్రం చేయడానికి వాడటం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇంట్లో గన్నేరు పూల మొక్కలను పెంచుకోవచ్చా? వాస్తు నిపుణులు సమాధానమిదే!
అప్పుల బాధలు వేధిస్తున్నాయా? ఆ రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే సమస్య తీరిపోతుంది!