ETV Bharat / spiritual

భాద్రపద మాసం స్పెషల్ - వినాయక చవితితో పాటు ముఖ్యమైన పండగలివే! - Bhadrapada Masam 2024 - BHADRAPADA MASAM 2024

Bhadrapada Masam Festival : శ్రావణమాసం ముగిసింది. భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపద మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ. ఆ ఒక్కటే కాదు భాద్రపద మాసంలో ఎన్నో విశేషాలు మరెన్నో పండుగలు. ఆ వివరాలేమిటో ఈ కథనంలో చూద్దాం.

Bhadrapada Masam Festival
Bhadrapada Masam Festival (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 4:30 AM IST

Bhadrapada Masam Festival : తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు మాసాలలో ఆరవ మాసం భాద్రపద మాసం. భాద్రపదం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వినాయక చవితి పర్వదినం. కానీ ఇదే నెలలో వరాహ జయంతి, వామన జయంతి, రుషి పంచమి, ఉండ్రాళ్ల తద్ది, పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్ష దినాలు ఇలా భాద్రపద మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భాద్రపద మాసంలో వచ్చే పర్వ దినాలు, ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం.

పర్వదినాలు - విశేషాలు

సెప్టెంబర్ 3 : భాద్రపద మాసం ప్రారంభమవుతుంది.

సెప్టెంబర్ 6 భాద్రపద శుక్ల తదియ : ఈ రోజు వరాహ జయంతి పర్వదినం. ఈ రోజు విష్ణువు వరాహ రూపం ధరించాడు. అందుకే వరాహస్వామిని తలచుకుని తెల్లని పువ్వులతో పూజించినా, భూదానము చేసినా, వెండి దానము చేసినా సకల శుభాలు కలుగుతాయి.

సెప్టెంబర్ 7 భాద్రపద శుద్ధ చవితి : ఈ రోజు వినాయక చవితి పర్వదినం. ఈ రోజు గణపతి పుట్టిన రోజు ఇంకా గణనాధుడు గణములన్నింటికీ అధిపతి అయిన రోజు కూడా. అందుకే విఘ్నేశ్వరుని పూజించి, ఉండ్రాళ్లు నైవేద్యంగా పెట్టి, వాటిని మనము కూడా ప్రసాదంగా తిని, కథ విని అక్షింతలను శిరస్సున వేసుకోవాలి.

సెప్టెంబర్ 8 భాద్రపద శుద్ధ పంచమి: ఈ రోజు ఋషి పంచమి పర్వదినం. సాధారణంగా మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు ఋషి రుణం, దేవతా రుణము, పితృదేవతల రుణము ఈ మూడింటిని తప్పనిసరిగా తీర్చుకోవాలి. అందులో భాగంగా ఈ రోజు వీలున్నంత వరకు ఋషులను తలచుకోవాలి. ముందుగా గణపతి ప్రార్థన చేసి తరువాత సప్తర్షులను, అత్రి, మరీచి, కౌండిన్యుడు మొదలైన ఋషులను తలచుకోవాలి. ముఖ్యంగా పురాణం పురుషుడు వ్యాస భగవానుని తలుచుకోవాలి. ఋషుల రూపంలో ఉండే గురువులను, పౌరాణికులను ఈరోజు పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలిగి ఋషి ఋణం తీరుతుంది. ఈ రోజు సాయంకాలం ప్రదోష సమయంలో శివాలయంలో ప్రదక్షిణలు చేసి శివ దర్శనం చేసుకోవడం చాలా మంచిది.

సెప్టెంబర్ 11 భాద్రపద శుద్ధ అష్టమి: ఈ రోజు జ్యేష్ఠ గౌరీ పూజ. రాముని భర్తగా పొందేందుకు సీతాదేవి జ్యేష్ఠ గౌరీమాతను పూజించిందని అంటారు. వివాహం కావలసిన కన్యలు ఈ పూజ చేస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుందని శాస్త్ర వచనం.

సెప్టెంబర్ 14 భాద్రపద శుద్ధ ఏకాదశి : ఈ రోజు పరివర్తన ఏకాదశి. ఈ రోజు విష్ణు మూర్తిని లక్ష్మీదేవి సమేతంగా పూజిస్తే తెలిసో తెలియకో చేసిన పాపాలు నశిస్తాయని అంటారు.

సెప్టెంబర్ 14 భాద్రపద శుద్ధ ద్వాదశి: ఈ రోజు వామన జయంతి పర్వదినం. మధ్యాహ్నం 11:45 నుంచి 12:30 లోపు ద్వాదశి ఘడియలు ఉన్న రోజున వామన జయంతి జరుపుకోవాలి. ఈ రోజు విష్ణువు ఆలయంలో ప్రదక్షిణలు చేయడం, విష్ణువును చామంతి పువ్వులు, మల్లె పువ్వులు లేదా పసుపు పచ్చని పూలతో పూజించడం చాలా మంచిది. ఈ రోజు బ్రాహ్మణులకు అన్నదానం, భూదానం, గోదానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.

సెప్టెంబర్ 16 భాద్రపద శుద్ధ చతుర్దశి: కన్య సంక్రమణం. ఈ రోజు సూర్యుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నదీస్నానం, సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.

సెప్టెంబర్ 17 భాద్రపద శుద్ధ పౌర్ణమి: ఈ రోజు అనంత పద్మనాభ వ్రతం. భరించలేని కష్టాల నుంచి ఉపశమనం పొందాలంటే అనంత పద్మనాభ వ్రతాన్ని చేసుకోవాలని పెద్దలు అంటారు. ఈ రోజు శ్రీ అనంత పద్మనాభ స్వామిని పూజించి, వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకోవాలి.

సెప్టెంబర్ 18 భాద్రపద బహుళ పాడ్యమి: మహాలయ పక్షారంభం. ఈ రోజు నుంచి పితృ పక్షాలు మొదలవుతాయి. భాద్రపద మాసం కృష్ణ పక్షం పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు మహాలయ పక్షం అంటారు. ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణములు ఇవ్వడం వంటివి చేయాలి. తర్పణములు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో విడిచిపెట్టిన తరువాత భోజనం చేయవచ్చు. ఈ మహాలయ పక్షంలో పితృ దేవతలను తలుచుకొని నువ్వులు, బియ్యం వంటివి దానం చేయడం మంచిది, రోజూ ఒక్కొక్క కూరగాయ దానం చేయడం కూడా మంచిది.

సెప్టెంబర్ 21 భాద్రపద బహుళ చవితి: సంకష్ట హర చతుర్థి వ్రతం. ఈ రోజు పనిలో వచ్చే ఆటంకాలను తొలగించుకోడానికి సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు.

సెప్టెంబర్ 24 భాద్రపద బహుళ అష్టమి : ఈ రోజు అనధ్యాయ తిథి. అనధ్యాయ తిథి అనగా ఈ రోజు వేదాలు అధ్యయనం చేయకూడదు, మంత్ర అధ్యయనం చేయకూడదు. కేవలం పురాణాలు మాత్రం వినాలి.

సెప్టెంబర్ 28 భాద్రపద బహుళ ఏకాదశి : ఈ రోజు సర్వేషాం ఇందిరా ఏకాదశి. పితృ పక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణులను పూజిస్తే పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం.

సెప్టెంబర్ 29 భాద్రపద బహుళ త్రయోదశి : పక్ష ప్రదోషం. ఏ రోజైతే సాయంత్రం సమయంలో త్రయోదశి తిథి ఉంటుందో ఆ రోజును పక్ష ప్రదోషం అంటారు. ఈ పక్ష ప్రదోషం నెలలో రెండు సార్లు వస్తుంది. ఈ రోజు శివారాధన చేస్తే దారిద్య్ర బాధలు తొలగిపోతాయని విశ్వాసం.

సెప్టెంబర్ 29 భాద్రపద బహుళ చతుర్దశి : మాస శివరాత్రి. అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ రోజు సాయంత్రం సమయంలో శివునికి అభిషేకాలు, బిల్వార్చన చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని శాస్త్రవచనం.

అక్టోబర్ 2 భాద్రపద బహుళ అమావాస్య: మహాలయ అమావాస్య. ఒకప్పుడు ఈ చరాచర జగత్తును అంతా శివుడు తనలో లయం చేసుకున్న తిథి ఇది. ఈ రోజు పితృ దేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు,తిలోదకాలు ఇవ్వడం,నువ్వులు దానం చేయడం చాలా మంచిది.

రానున్న భాద్రపద మాసంలో పంచాంగ కర్తలు సూచించిన విధంగా మన పండుగలను జరుపుకుందాం మన ఆచార వ్యహారాలను, సంస్కృతీ సంప్రదాయాలను భావి తరానికి అందజేద్దాం.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వినాయకుడిపైకి డైరెక్ట్​గా సూర్యకిరణాలు! ఈ అద్భుతమైన టెంపుల్ ఎక్కడుందంటే? - Special Ganesh Temple

సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే వినాయక క్షేత్రం- ఎక్కడుందో తెలుసా? - Ganesh Special Temple

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.