ETV Bharat / spiritual

మీ శరీరం మీద ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే - అఖండ రాజయోగం కలుగుతుందట! - BENEFITS OF MOLES ON BODY

-పుట్టు మచ్చల వల్ల లాభం, నష్టం కలుగుతాయంటున్న జ్యోతిష్యులు - ఇవి ఎక్కడ ఉంటే మేలు కలుగుతుందో తెలుసా?

Benefits of Moles on Body
Benefits of Moles on Body (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Benefits of Moles on Body: మనిషి శరీరం మీద పుట్టు మచ్చలు ఉండటం సహజం. అయితే, జాతకాలను నమ్మేవారు.. శరీరంలోని కొన్ని భాగాలలో పుట్టుమచ్చలు ఉంటే, అదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు. కొన్ని పుట్టుమచ్చలను రాజయోగానికి సంకేతాలుగా భావిస్తారు. మరి, శరీరంలోని ఏ భాగాలలో పుట్టుమచ్చలు ఉంటే రాజయోగానికి సంకేతమో ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కొన్ని ప్రత్యేకమైన పుట్టుమచ్చలు, ప్రత్యేకమైన ప్రదేశాల్లో శరీరం మీద ఉంటే రాజయోగం పడుతుందని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోందట. ముఖ్యంగా పుట్టుమచ్చ తేనె రంగు లేదా గోధుమ రంగులో ఉన్నట్లైతే అది రాజయోగాన్ని కలిగిస్తుందని అంటున్నారు. అలా కాకుండా ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మధ్యమ ఫలితాలను అందిస్తుందని, నలుపు రంగులో పుట్టుమచ్చ ఉంటే అది అధమ ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. అయితే రాజయోగం కలగాలంటే పుట్టుమచ్చలనేవి పుట్టుకతోనే ఉండాలని అంటున్నారు. ఒకవేళ మధ్యలో పుట్టు మచ్చలు వస్తే వాటిని చెలికత్తె మచ్చలని అంటారని.. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలూ ఉండవని అంటున్నారు.

రాజయోగం కలిగించే పుట్టుమచ్చలు :

కళ్లు: ఎవరికైనా కంట్లో పుట్టుమచ్చ ఉంటే మంచిదని మాచిరాజు చెబుతున్నారు. మగవారికైతే కుడి కంట్లో, ఆడవారికైతే ఎడమకంట్లో తేనె రంగులో లేదా గోధుమ రంగులో పుట్టుమచ్చ ఉంటే మంచిదని.. అలాంటివారికి లక్షమందిలో ఒకరికి కలిగే అదృష్టం కలుగుతుందని అంటున్నారు.

వీపు: మగవారికి వీపు మీద పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిదని సూచిస్తున్నారు. వీపు మీద తేనె లేదా గోధుమ రంగులో పుట్టుమచ్చ ఉంటే అఖండ రాజయోగం కలుగుతుందని అంటున్నారు. అంటే రాజకీయాల్లో, సినీ ఫీల్డ్​లో చక్రం తిప్పే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీపు మీద మచ్చ పెద్దగా ఉంటే ఆ రాజయోగం అనేది తారాస్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు.

పెదవులు: ఆడవారికి పెదవుల మీద పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిదని వివరిస్తున్నారు. ఏ మహిళకైనా పెదవి పై భాగంలో తేనె లేదా గోధుమ రంగులో పుట్టమచ్చ ఉంటే ఆ స్త్రీ మహర్జాతకురాలు అవుతుందని అంటున్నారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటుందని.. సంపదలకు లోటు లేకుండా జీవితం గడుస్తుందని చెబుతున్నారు.

మెడ : స్త్రీలకు మెడ మీద పుట్టుమచ్చ ఉన్నా అది అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తుందని అంటున్నారు.

నాభి: పురుషులకు లేదా స్త్రీలకు నాభి మీద పుట్టుమచ్చ ఉంటే మంచిదంటున్నారు. అంటే నాభి చుట్టుపక్కల మచ్చ ఉంటే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పినట్లు వివరిస్తున్నారు.

తొడ: స్త్రీలకు లేదా పురుషులకు తొడ మీదు పుట్టుమచ్చలు ఉంటే కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. పురుషులకైతే కుడి తొడ మీద, స్త్రీలకైతే ఎడమ తొడ మీద నలుపు రంగులో ఉంటే పరిచయాల విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. పురుషులైతే స్త్రీ పరిచయాల విషయంలో స్త్రీలైతే మగవారి పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఆ స్నేహాల వల్ల మోసపోయే అవకాశం ఎక్కువుంటుందని అంటున్నారు.

శుక్ర స్థానం: మగవాళ్లకు శుక్ర స్థానంలో అంటే చేయి బొటన వేలు కింద భాగంలో నలుపు రంగులో పుట్టుమచ్చ ఉంటే వాళ్లు మహిళలతో పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఈశాన్యంలో ఈ మూడు వస్తువులు ఉంచితే - అపార ధనలాభం కలుగుతుందట!

వాస్తు: ఇంటిని శుభ్రం చేయడానికి వీటిని ఉపయోగిస్తే - ఆర్థిక ఇబ్బందులు తప్పవట!

అప్పుల బాధలు వేధిస్తున్నాయా? ఆ రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే సమస్య తీరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.