ETV Bharat / spiritual

ఆరోగ్య ఐశ్వర్యాన్నిచ్చే భాను సప్తమి పూజ - ఎలా చేయాలో తెలుసా? - BHANU SAPTAMI 2024

ఆదివారమే భాను సప్తమి - పూజా విధానం మీ కోసం!

Lord Surya Bhagavan
Lord Surya Bhagavan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2024, 5:17 PM IST

Bhanu Saptami 2024 : ఆదివారం రోజు సూర్య భగవానుని పూజించడం అత్యంత ఫలప్రదం అని హిందువుల విశ్వాసం. ఆదివారాన్ని ఆరోగ్య వారమని కూడా శాస్త్రంలో వర్ణిస్తారు. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యునికి ఆదివారం సూర్యోదయ సమయంలో ఇచ్చే అర్ఘ్యం ఆరోగ్యం, సుఖసంపదలు ఇస్తుందని విశ్వాసం. ఇక భాను సప్తమి రోజు చేసే సూర్య ఆరాధన కోటి రెట్ల ఫలవంతమైనదని అంటారు. ఈ సందర్భంగా అసలు భాను సప్తమి అంటే ఏమిటి? ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర్మశాస్త్రం ప్రకారం ఆదివారం నియమాలు
సాధారణంగా ఆదివారం అంటే ఆటవిడుపుగా భావిస్తాం. కాని ఆదివారం అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. జీవితంలో అభ్యుదయానికి ప్రధానంగా భావించే ఆ నియాలు ఏంటో చూద్దాం.

  • సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం
  • ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి.
  • ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు.
  • ఆదివారం రోజు ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
  • ఆదివారం విధిగా బ్రహ్మచర్యం పాటించాలి.
  • ఆదివారం ఈ అయిదు నియమాలు పాటిస్తే సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్ర వచనం.

భాను సప్తమి అంటే?
ఏ రోజైతే ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తుందో ఆ రోజును భానుసప్తమి అని అంటారు. దానినే విజయ సప్తమి, కల్యాణ సప్తమి అని కూడా అంటారు. భాను సప్తమి రోజు చేసే సూర్యారాధన విశేష ఫలప్రదమని పండితులు చెబుతున్నారు. భానుసప్తమి సూర్యునికి సంబంధించిన పర్వదినం. ఈ రోజున చేసే పూజ, దానం, జపం, హోమం అత్యంత ఫలవంతం అని, ఈ పూజలు అనంతకోటి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. అందునా పరమ పవిత్రమైన కార్తిక మాసంలో వచ్చే భాను సప్తమి మరింత విశేషమైనదని పురాణం వచనం.

భాను సప్తమి ఎప్పుడు
డిసెంబర్ 8 ఆదివారం సప్తమి తిథి రోజున భాను సప్తమిగా జరుపుకుంటాం. ఈ రోజు సప్తమి తిథి సూర్యోదయంతో ఉంది. ఈ రోజునే భాను సప్తమిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు సూర్యోదయం నుంచి ఉదయం 9 గంటల వరకు పూజకు శుభ సమయం.

భాను సప్తమి పూజా విధానం

  • భాను సప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచియై సూర్యభగవానునికి నమస్కరించుకోవాలి.
  • ఆవు పాలు పొంగించి అందులో పిడికెడు బియ్యం, బెల్లం, నెయ్యి వేసి మెత్తగా పరమాన్నం తయారు చేసుకోవాలి.
  • సూర్యునికి ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని రథం ఆకారంలో ముగ్గు వేసుకుని అందులో మధ్యభాగంలో పద్మాన్ని వేసుకోవాలి. ముగ్గుకు నలువైపులా పూలతో, పసుపుకుంకుమలతో అలంకరించుకోవాలి.
  • సూర్య భగవానునికి 12 సార్లు భక్తితో సూర్య నమస్కారాలు చేసి, రాగిపాత్రలో నీరు తీసుకొని అర్ఘ్యం సమర్పించాలి.
  • ముందుగా తయారు చేసుకున్న పరమాన్నాన్ని సూర్య భగవానునికి నివేదించాలి. అనంతరం ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా అందరూ స్వీకరించాలి.

భానుసప్తమి పూజకు నియమాలు
భానుసప్తమి పూజ చేసుకునే ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లి, వెల్లుల్లి, మధ్య మాంసాలు తీసుకోరాదు. కఠిన బ్రహ్మచర్యం పాటించాలి.

భానుసప్తమి పూజాఫలం
భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో భాను సప్తమి పూజ చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం సమకూరుతుంది. సూర్య భగవానుని అనుగ్రహంతో అవివాహితులకు వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. విద్యార్ధులకు చక్కని విద్య లభిస్తుంది. వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి మనశ్శాంతి చేకూరుతుంది. రానున్న భాను సప్తమి రోజు మనం కూడా సూర్యుని ఆరాధిద్దాం ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. ఓం శ్రీ ఆదిత్యాయ నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.