August 2024 Festival List : శ్రావణ మాసాన్ని.. పండుగలు, పర్వదినాలూ, నోములు, వ్రతాలకూ.. అత్యంత అనుకూలమైన మాసంగా చెబుతారు. ఈ నెలలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. మహిళలు చేసే వ్రతాలు, పూజలు ఎక్కువగా ఈ మాసంలోనే ఉంటాయి. ఈ మాసంలో ప్రతిరోజుకీ ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రతి తిథికీ ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ మాసంలో భక్తితో పూజలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి.. హిందూ పంచాంగం ప్రకారం ఈ నెలలో ఎన్ని పండగలు, వ్రతాలు జరుపుకోనున్నారో మీకు తెలుసా?
ఆగస్టు 5.. ఈ ఆగస్టు 4వ తేదీ ఆదివారం రోజున అమవాస్య వచ్చింది. ఆదివారం నాడు ఆషాఢం అమవాస్య ముగియడంతో.. ఆగస్టు 5వ తేదీ శ్రావణ మాసం ప్రారంభమైంది.
ఆగస్టు 6 -మంగళగౌరి వ్రతం : శ్రావణ మాసంలో మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని మంగళగౌరీ వ్రతాన్ని నిర్వహించుకున్నారు. అయితే.. తొలి మంగళవారమే కాకుండా.. ఈ నెలలోని అన్ని మంగళ వారాల్లోనూ పార్వతీదేవిని పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఆగస్టు 9 -నాగ పంచమి : శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఐదవ రోజు.. అంటే ఆగస్టు 9వ తేదీన శుక్రవారం రోజున నాగ పంచమి పండగను జరుపుకున్నారు.
ఆగస్టు 10 -వేంకటేశ్వర వ్రతం : ఈ రోజున వేంకటేశ్వర వ్రతం చేసుకుంటున్నారు. ఈ వ్రతం చేయడం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఆగస్టు 16- వరలక్ష్మీ వ్రతం : శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ క్రమంలోనే 16వ తేదీన వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. చాలా మంది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఎక్కువ మంది వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారు.
ఆగస్టు 17- శని త్రయోదశి : త్రయోదశి.. శనివారం రోజున వస్తే, దానిని శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినం. శని దోషం ఉన్నవారు ఈ రోజు శనిదేవుని పూజించడం వల్ల దోషం నుంచి విముక్తి లభిస్తుందట. అలాగే శని త్రయోదశి రోజున శనిదేవుని పూజించడం వల్ల కుటుంబంలో సుఖ, శాంతులు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు.
ఆగస్టు 19- రాఖీ పౌర్ణమి : ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 19వ తేదీన రాఖీ పౌర్ణమి జరుపుకోనున్నారు.
ఆగస్టు 22 - సంకటహర చతుర్థి : ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థినాడు సంకటహర చతుర్థిని జరుపుకుంటారు. ఈ రోజున గణపతి పూజ చేయడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఆగస్టు 23 - మూడవ శ్రావణ శుక్రవారం : ఈ రోజున కూడా చాలా మంది వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకుంటారు.
ఆగస్టు 26 - శ్రీ కృష్ణాష్టమి : దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఊరూ వాడల్లో కేరింతల మధ్య.. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఆగస్టు 30 -నాలుగవ శ్రావణ శుక్రవారం
ఆగస్టు 31 - శని త్రయోదశి
ఇవి కూడా చదవండి :
ఆరోగ్యప్రదాయిని 'సూపౌదన' వ్రతం- ఈ విధంగా పూజ చేస్తే సర్వరోగాలు దూరం! - Sravana Masam Vratham 2024
అలర్ట్ : మీరు గృహ ప్రవేశం చేయబోతున్నారా? - ఈ విషయం తెలుసా! - Gruhapravesam August 2024