ETV Bharat / spiritual

అమర్​నాథ్​ కథేంటి? ఆ రెండు పావురాలు ఇంకా ఉన్నాయా? వీడని మిస్టరీలు ఎన్నో! - Amarnath Yatra 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 4:21 AM IST

Amarnath Yatra History In Telugu : భారతదేశం అతి ప్రాచీనమైన దేవాలయాలకు పుట్టినిల్లు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మోక్షాన్ని పొందాలంటే తీర్ధయాత్రలు చేయడం తప్పనిసరని తెలుస్తోంది. అయితే ఈ తీర్థయాత్రల్లో కొన్ని యాత్రలు చేయడం చాలా కఠినతరంగా ఉంటాయి. అయితే మోక్షాన్ని కోరుకునే వారు ఇలాంటి యాత్రలనే ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ యాత్రలు కచ్చితంగా మోక్షాన్ని ఇస్తాయి. అలాంటిదే అమర్‌నాథ్‌ యాత్ర! ఈ కథనంలో అమర్‌నాథ్‌ యాత్రా విశేషాలను తెలుసుకుందాం.

Amarnath Yatra 2024
Amarnath Yatra 2024 (Getty Images)

Amarnath Yatra History In Telugu : జమ్ముకశ్మీర్​లోని పహెల్‌గావ్ నుంచి 29 కి.మీ దూరంలో ఉన్న అమర్‌నాథ్‌ యాత్ర ప్రతి ఒక్కరూ చేయవలసిన యాత్ర! ఎత్తైన కొండపైన ఉన్న గుహలో మంచుతో ఏర్పడే శివలింగాన్ని సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమర్‌నాథ్‌కు తరలివస్తారు. హిమలింగ దర్శనానికి వెళ్లే రహదారి ప్రమాదకరమైనది. అయినప్పటికీ, మహాదేవుడు వెలసిన ఈ పవిత్ర స్థలానికి లింగభేదం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా తరలివస్తారు. అందరి లక్ష్యం ఒక్కటే మహాదేవుని దర్శనం.

హిమలింగ దర్శనం ఎప్పుడు?
సహజంగా హిమంతో ఏర్పడే శివలింగం ఉన్న అమర్‌నాథ్ ఏడాదికి రెండుసార్లు మాత్రమే భక్తుల దర్శనార్థం తెరుస్తారు. ఆ సమయంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యాత్రికులు అమర్‌నాథ్ శివలింగ దర్శనానికి వస్తుంటారు.

ఈ ఏడాది ఎప్పుడు?
జూన్ 29వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు కొనసాగే ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి. ఎంతో దుర్లభమైన ఈ యాత్ర చేయబోయే ముందు అమరనాథ్ గురించిన విశేషాలను తెలుసుకుందాం.

ఇప్పటికీ వీడని మిస్టరీలు ఎన్నో!
అమర్​నాథ్ యాత్రకు సంబంధించి అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ రహస్యాలను ఛేదించడం ఎవ్వరికీ సాధ్యపడలేదు. ఈ గుహలోనే పరమశివుడు తన అర్ధాంగి పార్వతికి అమరత్వం గురించి వివరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ అమరత్వం గురించి విన్న వారికీ మరణం ఉండదని శాస్త్ర వచనం.

నేటికీ సజీవంగా జంట పావురాలు
Amarnath Story Of Pigeons : పరమశివుడు పార్వతికి అమరత్వం గురించి బోధిస్తున్న సమయంలో ఆ గుహలో రెండు జంట పావురాలు ఉన్నాయట! శివుడు పార్వతికి బోధించిన మంత్రోపదేశాన్ని ఆ పావురాలు కూడా విన్నాయని, అందుకే ఇప్పటికీ ఆ గుహలోనే ఆ జంట పావురాలు సజీవంగా ఉన్నాయని అంటారు. మంచులింగ దర్శనానికి వెళ్లినవారు అనుభవపూర్వకంగా చెప్పే ఈ మాటలు వింటే ఆధ్యాత్మిక భావంతో మనసంతా పులకరిస్తుంది.

సహజలింగం - స్వయంభూ లింగం
హిందూ పురాణాల ప్రకారం పరమ శివుడు మూడో కన్ను తెరవడం వల్లనే ఈ గుహ ఏర్పడిందని, ఇక్కడ శివలింగం సహజంగానే పెరుగుతోంది కాబట్టి దీనిని సహజలింగమని అంటారని తెలుస్తోంది. అమరనాథ్ స్థలపురాణం ప్రకారం పరమశివుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచ భూతాలను ఈ గుహ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టారని, అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని తెలుస్తోంది.

జల రూపంలో దర్శనం
అమర్​నాథ్​ గుహలో శివుడు జల రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. అమరనాథ్ వద్ద ప్రవేశించే పంచ నదులు సాక్షాత్తు శివయ్య జటాజూటం నుంచి ప్రవహించాయని నమ్ముతారు. ఇందుకు సాక్ష్యంగా అమరనాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఎలా వస్తుందనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది.

జన్మరాహిత్యమే నిజమైన మోక్షం
శివయ్య చెప్పే అమరత్వం రహస్యం విన్న వారికి మరణం అనేది ఎప్పటికీ సంభవించదని అంటారు కానీ అమరత్వం అంటే మరణం లేకపోవడం కాదు మనిషై పుట్టాక మరణం తప్పదు. పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందడమే నిజమైన అమరత్వం. అంతే కాదు గొప్ప గొప్ప పనులు చేసి మరణించిన వారిని అమరజీవులని అంటారు. అంటే వారు మరణించిన వారు సాధించిన కీర్తి మాత్రం శాశ్వతం.

మోక్ష కాముకులు మాత్రమే వెళ్లాలని!
మోక్షం అంటే మరుజన్మ లేకుండా భగవదైక్యం చెందడమేనని ధర్మ శాస్త్రం చెబుతోంది. ఇలాంటి మోక్షాన్ని కోరుకునే వారు మాత్రమే అమరనాథ్ యాత్రకు వెళ్లాలి. అంతే కానీ ప్రాపంచిక సుఖాలు ఇంకా ఇంకా అనుభవించడం కోసం జీవించి ఉండాలన్న ఆశ నెరవేర్చుకోవడం కోసం ఈ యాత్రకు వెళ్లకూడదు.

అమరనాథ్ యాత్రకు ఎలా వెళ్లాలి?
Amarnath Yatra Registration 2024 : అమరనాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ముందుగా అమరనాథ్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉండే పలు బ్యాంకు శాఖల్లో తగిన రుసుము చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

హెలికాప్టర్‌లో ఇలా!
చాలా మంది భక్తులు రిమోట్ మార్గం ద్వారా అమర్‌నాథ్ చేరుకోవడానికి హెలికాప్టర్‌ను బుక్ చేసుకుంటారు. హెలికాప్టర్‌లో అమర్‌నాథ్ చేరుకోవడానికి ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. అమర్‌నాథ్ చేరుకోవడానికి ఆన్‌లైన్‌లో హెలికాప్టర్ బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. యాత్రకు వెళ్లాలనుకునే ఒక్కో వ్యక్తి ఎంత రుసుము చెల్లించాలనే వివరాలన్నీ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో దొరుకుతాయి.

ఇలా చేరుకోవాలి!
Amarnath Yatra Route : అమర్‌నాథ్ యాత్రికులు ముందుగా జమ్ము చేరుకొని అక్కడ నుంచి టాక్సీల ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ కానీ, 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్‌కు కానీ చేరుకోవాలి. బల్తాల్ నుంచి అమరనాథ్ చేరుకునేందుకు ఒకట్రెండు రోజులు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అదే పహల్గామ్ నుంచి వెళ్లాలంటే దాదాపు 36 నుంచి 48 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో ట్రెక్కింగ్​కు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. యాత్రికులకు ఈ మార్గంలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తుంది.

చిన్న వయసులోనే తీర్థయాత్రలు!
చివరగా ఇలాంటి కఠినమైన యాత్రలు చేయాలంటే చిన్న వయసులోనే చేయాలి. మన సమాజంలో ఒక దురభిప్రాయం ఉంది. తీర్ధయాత్రలంటే ముసలి వాళ్లు మాత్రమే చేయాలి అని. కానీ అది పొరపాటు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, కాళ్లు చేతులు సహకరిస్తున్నప్పుడే ఇలాంటి కఠిన యాత్రలు చేయడం మంచిది. ముఖ్యంగా ఎత్తైన కొండలపై ట్రెక్కింగ్ చేస్తే శరీరంలో పేరుకున్న బాడ్ కొలెస్ట్రాల్, టాక్సిన్స్ వెళ్లిపోతాయి. అందుకే ఇలాంటి యాత్రలు చేయడం ఆధ్యాత్మికంగా ఎంత అవసరమో ఆరోగ్యపరంగా కూడా అంతే అవసరం. భోలేనాథ్​కు జై!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

'కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!'- జడ భరతుడి కథ తెలుసా? - Jad Bharat Charitra

జాతకంలో దోషాలా? శనివారం ఆ చెట్టుకు పూజ చేస్తే అంతా సెట్! - Puja For Shani Shanti

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.