ETV Bharat / politics

'కాంగ్రెస్, బీఆర్ఎస్​ నాణానికి బొమ్మాబొరుసు లాంటివి - రాష్ట్ర పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయింది'

YSRCP Leaders Joined in BJP : నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఐఎస్​ఐ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​ హయాంలో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. పీవీ నరసింహరావుకు కాంగ్రెస్​ ప్రభుత్వం భారతరత్న ఇవ్వకపోయిన తమ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకుడు రామ్మోహన్ బీజేపీలో మర్యాదపూర్వకంగా స్వాగతించారు.

Kishan Reddy Comments on congress
YCP Leaders Join BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 2:22 PM IST

Updated : Feb 16, 2024, 2:30 PM IST

'కాంగ్రెస్, బీఆర్ఎస్​ నాణానికి బొమ్మాబొరుసు లాంటివి - రాష్ట్ర పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయింది'

YSRCP Leaders Joined in BJP : కాంగ్రెస్, బీఆర్ఎస్​ హయాంలో కుంభకోణాలు జరిగాయని, ఇందులో పార్టీలు కుమ్మక్కు అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు మజ్లీస్ అడుగుజాడల్లో పని చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​ నాణానికి బొమ్మ బొరుసు లాంటివని తెలిపారు. పార్టీ కార్యాలయంలో కిషన్​రెడ్డి(Kishan Reddy) సమక్షంలో వైసీపీ నాయకుడు వెళ్లల రామ్మోహన్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అనుచరులతో బీజేపీలో చేరిన రామ్మోహన్​ను స్వాగతించారు.

రాష్ట్రంలో తాజా, మాజీ ప్రభుత్వాల వైఖరితో నష్టపోతున్న ప్రజలు : కిషన్​రెడ్డి

Kishan Reddy Comments on congress : గిన్నీస్ బుక్​లో రికార్డు అయిన పార్టీ బీజేపీ అని కిషన్​రెడ్డి తెలిపారు. రాష్ట్ర పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. అనేక హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వాటిని అమలు చేయలేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో గుత్తేదారులను బెదిరించి సూట్ కేసులు దిల్లీకి మోస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సోనియా గాంధీ కుటుంబానికి భారతరత్నాలు ఇచ్చుకున్నారని, పీవీ నరసింహరావుకు మాత్రం భారతరత్న(Bharat Ratna) ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు తమ ప్రభుత్వం భారతరత్న ప్రకటించిందని గుర్తు చేశారు.

రాజకీయ లబ్ధి కోసమే మేడిగడ్డ పర్యటన, బహిరంగ సభలు : కిషన్​రెడ్డి

Kishan Reddy on BJP Development : భద్రాచలం ఆలయం కోసం మోదీ రూ.50 కోట్లకు పైగా నిధులు కేటాయించారని కిషన్​రెడ్డి తెలిపారు. మోదీ కృషితో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందన్నారు. అతి ప్రాచీన, ప్రముఖమైన దేవాలయాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచమంతా ఆశ్చర్యపడేలా జాతీయ రహదారులను నిర్మించామని చెప్పారు. రూ.26 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ తీసుకు రావడం జరిగిందని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని ప్రశంసించారు.

కేంద్ర ప్రభుత్వ చొరవతోనే బస్తీ దవాఖానాలు కొనసాగుతున్నాయి : కిషన్ రెడ్డి

Kishan Reddy on Modi Development : రావణ కాష్టంలా ఉన్న జమ్మూ కశ్మీర్​ను ఆర్టికల్ 370(Article 370) రద్దు చేసి భారతదేశంలో అంతర్లీనం చేశారని కిషన్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​లో ఐఎస్ఐ ఉగ్రవాదం బలంగా ఉండేదని, మోదీ ప్రధాని అయిన తరవాత ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేశారన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్​ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టామని తెలిపారు. దేశంలో పూర్తిగా అవినీతిని నిర్మూలించామన్నారు. ఇతర దేశాల్లో భారతదేశ గౌరవం పెరిగిందని కిషన్​రెడ్డి చెప్పారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆపాలని మోదీ ఆదేశించారని గుర్తు చేశారు. లౌకిక దేశంలో హిందువులు అణిచివేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

టార్గెట్ 17 ఎంపీ స్థానాలు - ఈనెల 20 నుంచి బస్సు యాత్రలు : కిషన్‌రెడ్డి

Last Updated : Feb 16, 2024, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.