ETV Bharat / politics

3 ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం - చేవెళ్ల పీఠం దక్కేది ఎవరికి? - Chevella Lok Sabha Election - CHEVELLA LOK SABHA ELECTION

Lok Sabha Election Fight 2024 : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్​సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు జోరు కొనసాగిస్తున్నాయి. లక్ష మెజార్టీతో తమ అభ్యర్థిని గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థిస్తుంటే, మూడు లక్షల మెజార్టీతో గెలుస్తానని బీజేపీ అభ్యర్థి అంచనా వేసుకుంటున్నారు. ముచ్చటగా మూడోసారి చేవెళ్ల ఎంపీ సీటు దక్కేది తమకేనని బీఆర్​ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే గత ఎన్నికల్లో సుమారు 10 లక్షల మందికిపైగా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రాకపోవడం ఒకవైపు కలవరానికి గురిచేస్తుండగా, ఈసారి పెరిగిన 6 లక్షల ఓట్లు గెలుపుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి.

Chevella Lok Sabha Election Fight
Lok Sabha Election Fight 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 11:50 AM IST

Chevella Lok Sabha Election Fight : తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో ఒకటైన చేవెళ్ల లోక్ సభ స్థానాన్ని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్​ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ ఒకసారి దక్కించుకోగా, బీఆర్​ఎస్ రెండుసార్లు సొంతం చేసుకుంది. కమలం పార్టీ ఖాతా తెరవలేకపోయింది. కానీ ఈసారి ఆయా పార్టీలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతూ కోటీశ్వరులైన అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్​ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ మెజార్టీపై అంచనాలు వేసుకుంటున్నారు.

కాంగ్రెస్ లక్ష మెజార్టీతో గెలుస్తామని భావిస్తుండగా గత ఎన్నికలతో పోల్చితే 3 లక్షలపైనే తనకు మెజార్టీ రావచ్చని బీజేపీ అభ్యర్థి కొండా ఆశిస్తున్నారు. బీఆర్​ఎస్ మాత్రం మెజార్టీ లెక్కలు పక్కనపెడితే సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోమని, మూడోసారి కూడా గెలిచి చూపిస్తామని ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. వీరికి తోడు మరో 40 మంది ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. అయితే ఈ పార్లమెంటులో గడిచిన మూడు ఎన్నికల్లో లక్షల మంది ఓటర్లు ఓటింగ్​కు దూరంగా ఉండటం శోచనీయం. పట్టణ, గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల మిళితంగా ఉండే చేవెళ్ల లోక్​సభలో గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లిలో చాలా మంది ఓటింగ్​కు దూరంగా ఉండటం ఈ ఎన్నికల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

2019 లోక్​సభ ఎన్నికలు : 2019 ఎన్నికల్లో 23,02,163 మంది ఓటర్లు ఉండగా, కేవలం 13 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పుడు 53 శాతం మాత్రమే పోలింగ్​ నమోదైంది. అందులో బీఆర్​ఎస్​కు 5,28,148 ఓట్లు రాగా, కాంగ్రెస్​కు 5,13,831 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2,01,960 ఓట్లు పోల్​ అయ్యాయి. ఆ ఎన్నికల్లో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​కు కేవలం 1 శాతం ఓటింగ్​ తేడా మాత్రమే ఉంది. ఈ ఓటింగ్ శాతంతోపాటు మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ప్రచారాన్ని ముమ్మరం చేసిన మూడు పార్టీలు తమదైన శైలిలో హామీలు, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి.

యువత వైపు పార్టీలు మొగ్గు : మరోవైపు చేవెళ్ల లోక్​సభ గెలుపు ఓటములను యువ ఓటర్లే నిర్ణయించబోతున్నారు. పెరిగిన ఓట్లలో 52 శాతం ఓట్లు యువత వాటానే ఉండటం గమనార్హం. మొత్తం 7 ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 ఏళ్లలోపు 15 లక్షల 20 వేల 890 మంది యువ ఓటర్లున్నారు. వారు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే విజయవకాశాలు ఉండటంతో ప్రధాన పార్టీలు వారిపై గురిపెట్టాయి. వారిని మచ్చిక చేసుకుంటే కుటుంబసభ్యుల ఓట్లతోపాటు ఆ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించి తమవైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీల నేతలు తెర వెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై హామీలు ఇస్తూ గెలిపించాలని కోరుతున్నాయి.

కాంగ్రెస్ గ్యారంటీలు ప్రజలకు 'గాడిద గుడ్లు'లా కనిపిస్తున్నాయి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల లోక్​సభ స్థానాన్ని 'హస్త'గతం చేసుకునే దిశగా కాంగ్రెస్ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.