ETV Bharat / politics

'కాళేశ్వరం' కేసు సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్​ పిటిషన్​ - విచారణ ఏప్రిల్​ 2కు వాయిదా వేసిన హైకోర్టు - TS High Court On KA Paul Petition - TS HIGH COURT ON KA PAUL PETITION

TS High Court On KA Paul Petition : కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరంపై నమోదైన ఇతర పిటిషన్లతో కలిపి ఈ కేసును విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ రెండో తేదీకి వాయిదా వేసినట్లుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.

TS High Court On KA Paul Petition
TS High Court On KA Paul Petition
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 6:55 PM IST

TS High Court On KA Paul Petition : కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్ వేసిన పిటిషన్​పై హైకోర్టులో (High Court) నేడు విచారణ జరిగింది. కాళేశ్వరంపై నమోదైన ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. ఇప్పటికే జ్యుడీషియల్ కమిటీ వేసినట్లు (Judicial) ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కాళేశ్వరంపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ, కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామంది. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని వివరించింది. అయితే దర్యాప్తునకు వనరులు, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.

KA Paul Comments On KCR : మరోవైపు తను హైకోర్టులో వేసిన పిటిషన్​పై కేఏ పాల్ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో (Kaleswaram Project) రూ.వందల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, సీబీఐతో విచారణ జరిపించాలని కోరినట్లుగా తెలిపారు. తన పిటిషన్​ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుందని, ఏప్రిల్ రెండో తేదీకి కేసును వాయిదా వేసినట్లుగా కేఏ పాల్ వెల్లడించారు.

" కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో పిటిషన్ వేశాను. నా పిటిషన్​ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని విచారిస్తామని చెప్పింది. కేసును ఏప్రిల్ రెండో తేదీకి వాయిదా వేసింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.కోట్లు దండుకున్నారు. కేసు విచారణ జరిగితే అన్ని వివరాలు బయటకు వస్తాయి"- కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

TS High Court On KA Paul Petition

సీఎం రేవంత్ తమ్ముడు మాట తప్పాడు : కేఏ పాల్
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు గురించి సీబీఐతో విచారణ జరిపిస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తానని వెల్లడించారు. రైతులు, ఉద్యోగులు, యువత (Youth) ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. రాష్ట్రంలో 17 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ మాట తప్పారని కేఏ పాల్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.కోట్ల అవినీతి జరిగిందని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పార్టీలన్నీ ఒక్కటే అని, తానైతేనే న్యాయం జరుగుతుందని బాబుమోహన్ తనతో అన్నారని కేఏ పాల్ తెలిపారు.

అభివృద్ధిపై బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ అబద్దపు మాటలు చెబుతున్నాయి: కేఏ పాల్‌ - KA Paul on BRS and Congress

ప్రజా శాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్​ - ప్రకటించిన కేఏ పాల్​ - KA Paul Comments on Congress

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.