Tension at TDP Leader Nallamilli Ramakrishna Reddy House: తెలుగుదేశం నాయకులు, పోలీసుల మోహరింపులతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం హోరెత్తింది. వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి దంపతులు 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన తెలుగుదేశం నేత నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డి బహిరంగ చర్చకు సవాల్ చేశారు. ఈ మేరకు అనపర్తి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు మద్దతుగా వందలాదిగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రామవరానికి తరలివచ్చారు.
అప్పటికే రామవరంలో భారీగా మోహరించిన పోలీసులు తెలుగుదేశం నాయకులు అనపర్తి వెళ్లకుండా అడ్డుకున్నారు. నల్లమిల్లిని ముందస్తు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించిన నల్లమిల్లి పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో పోలీసులను నెట్టుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. కారులోకి ఎక్కిన ఆయన అనపర్తి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు ఆపడంతో కారులో నుంచి దిగి అక్కడే బైఠాయించారు. ఈ క్రమంలో రామవరంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
టీడీపీ నేత నల్లమిల్లి ఇంటి వద్ద దుండగులు హల్‌చల్ - అనపర్తి పీఎస్‌లో ఫిర్యాదు
అనపర్తి ఎమ్మెల్యేని స్వేచ్ఛగా వదిలేసిన పోలీసులు తమను అడ్డుకోవడం ఏమిటని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిజాయతీపరుడైతే చర్చకు ఎందుకు భయపడుతున్నారని పోలీసుల అండతో తమను ఎందుకు నిర్బంధిస్తున్నారని నిలదీశారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ పోలీసులు తనతో మాట్లాడతానని వచ్చి నిర్బంధించేందుకు ప్రయత్నించి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేను మాత్రం వదిలిపెట్టి తన ఇంటిపైకి పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
హైస్కూల్ ఆస్తిని కబ్జా చేసినా, ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణ చేసి రూ.15 కోట్లు, పంపిణీ పేరుతో రూ.50 కోట్లు దోచేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలాసేపు రోడ్డుపై బైఠాయించిన నల్లమిల్లిని బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యాన్‌లో ఆయన్ను ఎక్కించారు. పోలీసు వాహనాన్ని అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలు నల్లమిల్లిని తీసుకెళ్లడానికి వీల్లేందంటూ నినదించారు. ఆ తర్వాత కార్యకర్తలను పక్కకు తోసేసి నల్లమిల్లిని స్టేషన్‌కు తరలించారు.
సర్పంచులపై పోలీసుల జులం - అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత
పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. నాతో మాట్లాడతానని వచ్చి నిర్బంధించేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేను మాత్రం వదిలిపెట్టి నా ఇంటిపైకి పోలీసులు ఎందుకు వచ్చారు. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి చేసిన 109 అంశాలపై అవినీతిపై చర్చకు వెళ్తానని చెప్పాను. హైస్కూల్ ఆస్తిని కబ్జా చేశారు అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణ చేసి రూ.15 కోట్లు, పంపిణీ పేరుతో రూ.50 కోట్లు దోచేశారు. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి దంపతులు 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అవి ఆరోపణలు కాదు వాస్తవాలు. ఆ వాస్తవాలను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ దంపతులు అవినీతి చేసిన ప్రతి రూపాయిని నేను నిరూపిస్తాను.- నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత
వైఎస్సార్సీపీలో చేరుతావా, చస్తావా??- ఎస్సై వేధింపులు తాళలేక మత్స్యకారుడు బలవన్మరణం