ETV Bharat / politics

నల్గొండ జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార జోరు- వరుస సమావేశాలతో నాయకులు బిజీబిజీ - Lok Sabha Polls 2024

Telangana Lok Sabha Election Campaign 2024 : లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారాలకు పదును పెడుతున్నారు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలోని నాయకులు, ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 12:56 PM IST

Political Parties Speed Up Election Campaign

నల్గొండ జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార జోరు- వరుస సమావేశాలతో నాయకులు బిజీబిజీ

Telangana Lok Sabha Election Campaign 2024 : ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Polls) ప్రచార జోరు ఊపందుకుంటోంది. నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్‌రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో నిలిచారు. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్‌, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్‌ను అధిష్ఠానం ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించగానే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ఇన్‌ఛార్జులను కలిసి ప్రజలకు దగ్గరయ్యేలా నియోజవర్గస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, మాజీమంత్రులను కలిసి మద్దతు కూడకడుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు(strategy) రచిస్తున్నారు.

వరుస సమావేశాలతో దూసుకుపోతున్న పార్టీలు : నల్గొండ లోక్​సభ స్థానం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు(MP Candidates) కుందూరు రఘువీర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి సమావేశాల్లో ముందే ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి హుజూర్‌నగర్‌, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో స్థానిక నేతలను కలిసి సమావేశాలు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి పరిచయాలతో ఈ సారి ఎన్నికల్లో తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. బీజేపీ నేతలతో నియోజకవర్గస్థాయి(Constituency) సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో కలిసి నియోజకవర్గ స్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రసవత్తరంగా లోక్​సభ ఎన్నికల రాజకీయం - పోటాపోటీగా ప్రధాన పార్టీల ప్రచారం - LOK SABHA ELECTIONS 2024

Parties Speed Up Election Campaign : భువనగిరి లోక్​సభ స్థానం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు కూడా సమావేశాలతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో స్థానిక నేతలను కలిసి సమావేశాలు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అప్పటి పరిచయాలతో ఈ సారి ఎన్నికల్లో తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. బీజేపీ నేతలతో(BJP Leaders) నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్‌ కూడా మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో కలిసి నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Lok Sabha Polls 2024 : లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో నామినేషన్‌ దాఖలైన తర్వాత అభ్యర్థులు ప్రచారానికి మరింత పదును పెట్టనున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించిన వారు ఆ తర్వాత మండల, గ్రామాల్లో ప్రచారం చేపట్టనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుల సంఘాలు, మహిళా సంఘాల ఓట్లర్లపై దృష్టిసారించిన అభ్యర్థులు ఈసారి కూడా వారి ఓట్లను కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల హీట్ - ప్రచార వేగం పెంచిన పార్టీలు - LOK sabha Polls 2024

బీజేపీ గెలవబోయే 400 సీట్లలో నల్గొండ జిల్లా నుంచీ ఒకటి : శానంపూడి సైది రెడ్డి - Lok Sabha Polls 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.