ETV Bharat / politics

'బీఆర్ఎస్‌లోనే ఉండండి - కానీ మాకోసం పనిచేయండి!' - కాంగ్రెస్ ఖతర్నాక్ ప్లాన్ - Lok Sabha Elections 2024

Telangana Congress Lok Sabha Elections Strategy : తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలన్న లక్ష్యంతో హస్తం పార్టీ నాయకత్వం ఉంది. ఈ క్రమంలోనే రాజధాని పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మూడింటిలో గెలిచేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా వారు ఆ పార్టీలో ఉన్నా సరే, కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసేందుకు సహకరించాలని ఒప్పందాలు చేసుకుంటోంది.

TS CONGRESS LOK SABHA ELECTIONs PLAN
TS CONGRESS LOK SABHA ELECTIONs PLAN
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 10:48 AM IST

Updated : Mar 30, 2024, 2:28 PM IST

Telangana Congress Lok Sabha Elections Strategy : శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు గెలుచుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మూడింటిలో గెలిచేందుకు సరికొత్త వ్యూహాన్ని (TS Congress Elections Strategies 2024)అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొందరు ప్రజాప్రతినిధులతో అనధికారికంగా ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో హస్తం పార్టీ అగ్రనేతలు సమావేశమవుతున్నారు.

Congress Focus on Parliament Elections 2024 : వీరిలో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా లేరు. అటువంటి వారితో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడి ఒక ఒప్పందానికి వస్తున్నారు. బీఆర్ఎస్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా సరే, హస్తం పార్టీ విజయానికి సహకరించాలని కోరుతున్నారు. దీనికి పలువురు ఎమ్మెల్యేలు సమ్మతి తెలిపారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ - ఆరోజే మేనిఫెస్టో ప్రకటన - Lok Sabha Elections 2024

ఇప్పటికిప్పుడు చేరకపోయినా : గ్రేటర్‌ హైదరాబాద్‌లో 29 అసెంబ్లీ సీట్లకుగాను మూడింటిలోనే కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎమ్మెల్యేల బలం అవసరమని, లేనిపక్షంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం కష్టమనే భావనలో హస్తం పార్టీ ఉంది. దీనికోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యతను కొందరు సీనియర్‌ నాయకులకు అప్పగించింది. వీరు సదరు ఎమ్మెల్యేలతో మాట్లాడి, అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కూడా ఫోన్‌లో మాట్లాడిస్తున్నారు.

Telangana Congress Lok Sabha Election Plan : హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి (Telangana Congress Joinings 2024) సుముఖత వ్యక్తం చేశారని, ఎన్నికలకు ముందు వీరు చేరే అవకాశం ఉందని సమాచారం. మరో పదిమంది ఎమ్మెల్యేలతోనూ హస్తం పార్టీ అగ్రనేతలు మాట్లాడారు. వీరిలో సగం మంది ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడారు. వీరంతా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌లో చేరకపోయినా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు పరోక్షంగా తోడ్పాటు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. పోలింగ్‌కు ముందు వీరే కాకుండా వారి అనుచరులు కూడా పరోక్షంగా కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి తోడ్పాటు అందించేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

అడ్డంకులు అధిగమిస్తూ - వ్యూహాలకు పదును పెడుతూ - గెలుపు దిశగా కాంగ్రెస్ కార్యాచరణ - T Congress Lok Sabha Election Plan

కార్పొరేటర్లు, పురపాలక సంఘాలు : బల్దియా పరిధిలోని కార్పొరేటర్లను సైతం దారికి తెచ్చుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల లోపు దాదాపు 30 మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం ఎన్నికల లోపు పూర్తికాకపోయినా ఎమ్మెల్యేల తరహాలో కార్పొరేటర్లతో అంతర్గత ఒప్పందం చేసుకుని హస్తం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పది మంది కార్పొరేటర్లతో మాట్లాడితే వారంతా సుముఖత వ్యక్తం చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు తెలిపారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోని ప్రజాప్రతినిధుల విషయంలో కూడా ఇదే తరహాలో కాంగ్రెస్‌ నేతలు ముందుకెళ్తున్నారు.

బీఆర్ఎస్​కు వరుస షాక్​లు - కాంగ్రెస్‌లో భారీ చేరికలు - హస్తంతో టచ్‌లో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు! - lok sabha elections 2024

ఆ 2 రాష్ట్రాల మోడల్​తో లోక్​సభ బరిలోకి కాంగ్రెస్ - బీజేపీని ఢీకొట్టేందుకు 'పాంచ్​ న్యాయ్​' అస్త్రం - Lok sabha elections 2024

Last Updated : Mar 30, 2024, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.