ETV Bharat / politics

మనసులు గెలిచేలా బీజేపీ మేనిఫెస్టో - సబ్బండ వర్గాలను ఆకట్టుకునేలా రూపకల్పన - lok sabha elections 2024

Telangana BJP Lok Sabha Manifesto 2024 : లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ దృష్టి సారించింది. కాంగ్రెస్​ రూపొందించి పాంచ్​ న్యాయ్​ మేనిఫెస్టోకు దీటుగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయలను సేకరిస్తోంది.

BJP Manifesto Committee
BJP Focus on Lok Sabha Manifesto 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 9:40 AM IST

మనసులు గెలిచేలా బీజేపీ మేనిఫెస్టో - సబ్బండ వర్గాలను ఆకట్టుకునేలా రూపకల్పన

Telangana BJP Lok Sabha Manifesto 2024 : లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాషాయ పార్టీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ప్రజలకు ఏం కావాలనే అంశాలపై పార్టీ ఆరా తీస్తోంది. అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతోంది. ఇప్పటికే ఈ అభిప్రాయ సేకరణ సెగ్మెంట్ల వారీగా ప్రారంభమైంది. ప్రజలకు ఏం కావాలి. వారు ఏం ఆశిస్తున్నారు?, వారికి ఎలాంటి పథకాల అవసరం ఉందనే అంశాలపై బీజేపీ ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే మేధావులు, మహిళలు, యువకులు, రైతులు, కార్మికులు, పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, సబ్బండ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. వారితో పాటు ప్రజల నుంచి కూడా మరిన్ని అభిప్రాయాలు ఏప్రిల్ 5వ తేదీ వరకు తీసుకోవాలని భావిస్తోంది.

Lok Sabha Polls 2024 : ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా హామీలు ఇవ్వాలని కాషాయదళం భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ (Congress Paanch Nyay) పేరిట మేనిఫెస్టోను ప్రకటించి ప్రజలకు చేరువకావాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మేనిఫెస్టో ఆధారంగానే ప్రజలకు కాంగ్రెస్ చేరువైంది. ఈసారి ఆ అవకాశం హస్తం పార్టీకి ఇవ్వొద్దని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది. పాంచ్​ న్యాయ్​కు ధీటుగా బీజేపీ మేనిఫెస్టో ఉండే విధంగా ప్లాన్​ చేస్తోంది. మహిళలు,యువతపై మరింత ఫోకస్​ చేయనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో మరో రెండు, మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​ రెడ్డి - maheshwar reddy warns on Land Grab

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టో రూపకల్పనలో తలమునకలైంది. ఇప్పటికే పలువురి అభిప్రాయాలను హైకమాండ్​కు పార్టీ పంపించినట్లు తెలిసింది. దీనిపై మరింత స్పీడప్ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించి ఏప్రిల్ 5వ తేదీలోపు ఆ నివేదికను సైతం పంపించాలని కాషాయదళం నిర్ణయించుకుంది.

BJP Manifesto Committee : ఈలోపు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా మేనిఫెస్టో కమిటీ సమావేశాలు నిర్వహించి పార్లమెంట్ల వారీగా ప్రజల అభిప్రాయాలను సైతం హైకమాండ్​కు నివేదిక అందిచాలని చూస్తోంది. ఇప్పటికే కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర కొత్త పథకాల అవసరం ఏమైనా ఉందా? అనే అంశాలపైనా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఎంపీ అభ్యర్థులపై బీజేపీ నేతల ఆసంతృప్తి - నాయకులను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం - bjp leaders issue on mp candidates

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, చంద్రశేఖర్ తివారీ, చాడ సురేష్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, మాధవి తదితరులు హాజరయ్యారు. మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు, ప్రజల నుంచి తమకు అందిన సలహాలు, సూచనలపై వారు చర్చలు జరిపారు. వాటి సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న కాషాయ పార్టీ మేనిఫెస్టో ప్రజలను మెప్పిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

ఫోన్‌ ట్యాపింగ్‌కు మూలకారకులు కేసీఆర్‌, కేటీఆర్‌ : ఎంపీ లక్ష్మణ్‌ - MP Laxman On Phone Tapping

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.