ETV Bharat / politics

గల్ఫ్ బోర్డ్ వ్యవహారం కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ - రేవంత్ సర్కార్​పై బీజేపీ ఫైర్ - BJP election campaign in Telangana

BJP Election Campaign in Telangana 2024 : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌ వేర్వేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ ఓట్లు అభ్యర్థించారు. ఇరువురు నేతలు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

BJP ELECTION CAMPAIGN IN TELANGANA
BJP ELECTION CAMPAIGN IN TELANGANA
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 1:40 PM IST

రాష్ట్రంలో జోరుగా బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

BJP Leaders Comments on Congress : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Lok Sabha Elections 2024 : తాజాగా ఇవాళ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని గాంధీనగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కేంద్రం ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రాజ్యాంగానికి అనుగుణంగా పాలన చేసేది తమ పార్టీనేనని అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్‌ పార్టీ అని బండి సంజయ్ విమర్శించారు.

Bandi Sanjay Fires on Congress : రాజ్యాంగానికి సవరణలు చేయాలని కేసీఆర్‌ చెప్పారని బండి సంజయ్ అన్నారు. కానీ ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఏనాడూ ఖండించలేదని ఆరోపించారు. అంబేడ్కర్‌ జయంతి రోజున కేసీఆర్‌ రాకపోతే బీజేపీ ప్రశ్నించిందని గుర్తు చేశారు. గత ముఖ్యమంత్రి విధానాలపై హస్తం పార్టీ ఏనాడూ ప్రశ్నించలేదని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి పేదలకు ఇస్తామని అమిత్‌ షా చెప్పారని, ఆ వ్యాఖ్యలను వక్రీకరించి కొందరూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో మోదీ మరోమారు ప్రధాని కావాలని, కరీంనగర్‌లోనూ ప్రజలు తనను దీవించాలని బండి సంజయ్ ఓటర్లను కోరారు.

"రిజర్వేషన్ల రద్దు పేరుతో ప్రజల్లో భయాందోళనలు కలిగించి కాంగ్రెస్‌ లబ్ధి పొందాలని చూస్తొంది. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే. మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలందరికి పంచుతామన్నారు. కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో తెలియని వ్యక్తి. ఆరు గ్యారంటీల అమలు దృష్టి మల్లించేందుకే కాంగ్రెస్‌ ఈ కుట్రలు పన్నుతుంది. ఇక బీఆర్ఎస్‌ పని ముగిసింది." - బండి సంజయ్, కరీంనగర్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి

గల్లీ నుంచి దిల్లీ దాక బీజేపీ ఉంటేనే అభివృద్ధి సాధ్యం - అర్వింద్ - BJP CANDIDATE ARVIND INTERVIEW

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా : నిజామాబాద్ పట్టణంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆదర్శనగర్, దుబ్బ కాలనీల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్‌లు అని విమర్శించారు. బ్రిటిష్ పాలకుల కంటే ఎక్కువ దేశాన్ని హస్తం పార్టీ దోచేసిందని ఆరోపించారు. అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో దోపిడీని ఆపేందుకు రాహుల్‌ గాంధీని విదేశాలకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలపై ప్రజలు ఆ పార్టీని నిలదీస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ పాలనపై అవినీతి ఆరోపణలు అర్ధరహితమని అర్వింద్ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఏడాది దోపిడీ ఆపేస్తే పథకాలన్నీ అమలు చేయవచ్చంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటుగా స్పందించారు. రూ.40,000ల కోట్లు వసూలు అవుతాయంటూ ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం ఆయన అవినీతికి నిదర్శనమని ఆరోపించారు. గల్ఫ్ కార్మికులతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. గల్ఫ్ బోర్డు ఎన్నికల స్టంట్ అని, ఇప్పుడు వారు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. గడిచిన ఆరు నెలల్లోనే రేవంత్‌రెడ్డి రూ.20,000ల కోట్లు సంపాదించినట్లా అని అర్వింద్ వ్యాఖ్యానించారు.

హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా - కాంగ్రెస్​కు బండి సంజయ్​ సవాల్ - Bandi Sanjay Challenge to Congress

'దేశంలో 'ఇండియన్ పొలిటికల్ లీగ్' నడుస్తోంది - ఎన్డీయే కూటమి కెప్టెన్ మోదీ - మరి ఇండియా కూటమి కెప్టెన్ ఎవరు?' - Bandi Sanjay Election Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.