ETV Bharat / politics

ఏపీ భవిత కోసమే ఉమ్మడి ప్రయాణం - ఈ నెల 17న టీడీపీ-జనసేన మేనిఫెస్టో - ఈ నెల 17న టీడీపీ జనసేన మేనిఫెస్టో

TDP Jana Sena Election Manifesto : రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనున్న టీడీపీ జనసేన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్​ భవిష్యత్​ కార్యాచరణను వెల్లడించనున్నారు. బీజేపీతో పొత్తుల విషయం రేపటికల్లా తేలనున్నట్లు సమాచారం.

tdp_jana_sena_election_manifesto
tdp_jana_sena_election_manifesto
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 7:09 PM IST

TDP Jana Sena Election Manifesto : అధికారంలోకి వస్తే తమ కూటమి ప్రజలకు ఏం చేస్తుందో తెలిపే పూర్తి స్థాయి ఎన్నికల మేనిఫెస్టోను ఈ నెల 17వ తేదీన ప్రకటించాలని తెలుగుదేశం - జనసేన నిర్ణయించాయి. ఇందుకనుగుణంగా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇదే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు, ఇరుపార్టీల భవిష్యత్ కార్యాచరణను ఆవిష్కరించనున్నారు. దిల్లీ పొత్తులపై శుక్రవారం లోగా స్పష్టత వస్తుందనే అభిప్రాయాన్ని ఇరుపార్టీల నేతలు వ్యక్తం చేశారు. తెలుగుదేశం - జనసేన శ్రేణుల్ని పోలీసులు వేధిస్తే, వారికి అండగా నిలిచేందుకు ఓ ప్రత్యేక కాల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చారు.

బీసీల దశ, దిశ మార్చడం కోసమే 'బీసీ డిక్లరేషన్‌': చంద్రబాబు

తెలుగుదేశం - జనసేన పార్టీలు ఓ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించేలా ఈ నెల 17న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. ప్రజల ఆశీర్వాద బలంతో ముందుకెళ్తున్న ఇరు పార్టీలను విడదీయడం వైఎస్సార్సీపీ తరం కాదనే సంకేతాన్ని ఈ సభ ద్వారా ఇవ్వటంతో పాటు పూర్తిస్థాయి మేనిఫెస్టో, అభివృద్ధి ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణను ఈ వేదిక ద్వారా చంద్రబాబు-పవన్ కల్యాణ్​ ప్రకటించనున్నారు. ఈ సభకు సంబంధించిన వివరాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ ఉమ్మడిగా వెల్లడించారు.

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ - 10 అంశాలతో టీడీపీ-జనసేన 'బీసీ డిక్లరేషన్'

అధికార పార్టీ సభలకు ఇష్టానుసారం బస్సులు కేటాయిస్తున్న ఆర్టీసీ తమ సభలకు మొండిచెయ్యి చూపటాన్ని నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో మాదిరే ఆర్టీసీ తమకు బస్సుల కేటాయింపును నిరాకరిస్తే, ఎండీపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో తప్పులు చేస్తున్న అధికారుల మాదిరే ఆర్టీసీఎండీగా ఉన్న అధికారి కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అవసరమైతే బస్సుల కేటాయింపు వ్యవహారంపై పక్షపాతం చూపుతున్నారని ఎన్నికల కమిషన్ కు కూడా లేఖ రాస్తామన్నారు. తెలుగుదేశం - జనసేన శ్రేణుల్ని భయపెట్టాసని చూసే పోలీసులకు లీగల్ టీమ్ తో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 73062 99999 నంబర్ కు ఫోన్ చేస్తే అందుబాటులో ఉన్న న్యాయసిబ్బంది కార్యకర్తలకు తగిన సహాయ సహకారం అందిస్తారని వెల్లడించారు.

తెలుగుదేశం - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన తేదీ ఖరారు

అధికారం కోసం పొత్తులు పెట్టుకునే సహజ రాజకీయాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడి పాలనకు వ్యతిరేకంగా, ప్రజల కోసం తెలుగుదేశం - జనసేన పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని నేతలు తెలిపారు. తమ ఉమ్మడి ప్రయాణం ముమ్మాటికీ రాష్ట్రం కోసమేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం - జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి కుటుంబానికి జరిగే మేలు ఏమిటనేది చిలకలూరిపేట సభలో అధినేతలు ప్రకటిస్తారని నేతలు తెలిపారు. తాడేపల్లి గూడెం సభను అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను బలంగా అడ్డుకునేందుకు యత్నించినా సభ విజయవంతమైందని గుర్తు చేశారు. పోలీసులు గోడలు దూకి మరీ జనసేన కార్యాలయంలోకి చొరబడి, భద్రతా సిబ్బందిని ఆయుధాలతో బెదిరించారని ఆరోపించారు. అలాంటి ఆలోచనలు పోలీసులకు ఎందుకు వచ్చాయో, ఎవరి ఆదేశాలతో వారు అలా పరిధి దాటి చట్టవిరుద్ధంగా వ్యవహరించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీస్ యంత్రాంగాన్ని ప్రతిపక్ష నేతల్ని భయపెట్టేందుకు వినియోగిస్తున్న ముఖ్యమంత్రి తీరుని తీవ్రంగా ఖండించారు.

బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి, వైకాపానేతలకు లేదని తెలుగుదేశం జనసేన నేతలు స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబానికి బీసీలపై విపరీతమైన వ్యతిరేకత ఉందని విమర్శించారు. రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు మళ్లించారా లేదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీసీలకు అండ దండ టీడీపీ, జనసేన జెండా - బలహీనవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 'డిక్లరేషన్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.