Chandrababu Naidu joined NDA : జాతీయ ప్రజాస్వామ్య కూటమి(NDA)లో తెలుగుదేశం కూడా చేరిపోయింది. దిల్లీలో బీజేపీ అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ జరిపిన చర్చలు కొలిక్కివచ్చాయి. పొత్తుల్లో కీలకమైన సీట్ల సర్ధుబాటుపై ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయి. ఇవాళ మరోసారి భేటీ అనంతరం పొత్తు, సీట్ల అంశంపై అధికారికంగా వెల్లడించనున్నారు.
రాష్ట్ర అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి: బాబు, పవన్
ఎన్డీయేలోకి టీడీపీ చేరిక ఖరారైంది. ఈ మేరకు బీజేపీ అధినాయకత్వంతో గురువారం రాత్రి జరిగిన భేటీలో అవగాహన కుదిరింది. పొత్తుల్లో భాగంగా ఏపీలో ఆయా పార్టీలు పోటీ చేయాల్సిన స్థానాలపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. బీజేపీ, జనసేన పార్టీలకు 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు (Loksabha Seats) దక్కించుకున్నాయి. తక్కిన అన్నింటా తెలుగు దేశం పార్టీ పోటీ చేసేలా అంగీకారం కుదిరినట్లు సమాచారం. ఇవాళ మరో సారి భేటీ జరగనుండగా మధ్యాహ్నానికి అధికారికంగా సంయుక్త ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీచేయనున్నట్లు సమాచారం.
టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది - వైఎస్సార్సీపీ జడిసింది!
ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకున్నాయి. 2014 ఎన్నికల్లో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మరోసారి చేతులు కలిపింది. దేశంలో 400ఎంపీ స్థానాలు దక్కించుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ దిశగా దక్షిణాది (South India)లో పొత్తులు ఆహ్వానిస్తున్నారు. ఉత్తర భారత దేశంలో కీలకమైన బిహార్, ఉత్తర ప్రదేశ్లో ఆ దిశగా అడుగులు పడ్డాయి. బిహార్లో జనతాదళ్ (Janata Dal) అధినేత నీతీష్‌కుమార్ (Nitish Kumar), ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌చౌదరి (Jayant Choudhary) ని ఎన్డీఏలో చేరిపోయారు. అతి త్వరలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ సైతం చేరడానికి రంగం సిద్ధమైంది. ఇక దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు ఖరారైంది.
ఖరారు కాని టీడీపీ, జనసేన రెండో జాబితా - ఉత్కంఠలో ఆశావహులు
ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమి ఆవిర్భవించగా.. పోటీ చేసే స్థానాలపై ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయి. ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పలుమార్లు సమావేశమై ఒప్పందం ప్రకటించారు. ఫిబ్రవరి 24న విడుదల చేసిన తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులను ప్రకటించగా టీడీపీ 94, జనసేన 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బీజేపీ అధినాయకత్వం టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది. బీజేపీ 5 లోక్‌సభ, 6 అసెంబ్లీ, జనసేన 3 లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయనున్నాయి. 17లోక్‌సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ (telugudesam party)అభ్యర్థులను బరిలో దింపనుంది. మొత్తంగా బీజేపీ, జనసేన పార్టీలు 8 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి.