ETV Bharat / politics

చంద్రబాబు ఇంటికి టీడీపీ ఆశావహులు - సీట్లపై చర్చ - Unhappy Leaders In TDP

TDP Aspirants meet Chandrababu: టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని నేతలు చంద్రబాబును ఉండవల్లిలోని వారి నివాసంలో కలుస్తున్నారు. తమ సీటు విషయమై చర్చించి వారు ఆశిస్తున్న స్థానాలను వారికే కేటాయించాలని చంద్రబాబును కోరారు.

tdp_aspirants_meet_chandrababu
tdp_aspirants_meet_chandrababu
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 4:29 PM IST

TDP Aspirants meet Chandrababu: తెలుగుదేశం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి క్యూకట్టారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆశావహులు ఆయన్ను కలుస్తున్నారు. తమ సీటు విషయమై చర్చించి వారు ఆశిస్తున్న స్థానాలను వారికే కేటాయించాలని చంద్రబాబును కోరారు. నిన్ననే పసుపు కండువా కప్పుకున్న మాజీమంత్రి గుమ్మనూరు జయరాం చంద్రబాబుతో భేటీ అయ్యారు. గుమ్మనూరు గుంతకల్లు స్థానం ఆశిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావ్ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎచ్చర్ల స్థానంపై అధినేతతో చర్చించారు.

టీడీపీలోకి గుమ్మనూరు: వైసీపీకి రాజీనామా చేశాక బర్తరఫ్ చేసినా ఏం చేసినా తనకు అనవసరమని మాజీమంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే మనస్ఫూర్తిగా తెలుగుదేశంలో చేరినట్లు స్పష్టం చేశారు. గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో భారీగా వైసీపీ శ్రేణులు పసుపు తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచే చేస్తానని గుమ్మనూరు చెప్పారు. అయితే ఇన్నాళ్లూ ఆలూరుకు సేవలందించానని ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను బయటపెట్టారు జయరాం.

విభేదాలు పక్కనపెట్టి విజయానికి కృషి చేయండి- కష్టపడే ప్రతి ఒక్కరికీ అవకాశం: చంద్రబాబు

సంతృప్తిగా సోమిరెడ్డి: సర్వేపల్లిలో రకరకాల పేర్లతో సర్వేలు చేయించడం వల్ల కేడర్ గందరగోళంలో పడుతోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు. అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన సంతృప్తిగా బయటకొచ్చారు. ప్రస్తుతం సర్వేపల్లి టీడీపీ ఇన్​ఛార్జిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉన్నారు.

గౌతు శివాజీ, బండారు అప్పలనాయుడు తమ సీటు విషయమై చర్చించేందుకు చంద్రబాబుని కలవడానికి ఆయన నివాసానికి వచ్చారు. గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరిష (Gouthu Sireesha) పలాస టిక్కెట్ ఆశిస్తున్నారు. పెందుర్తి టిక్కెట్‌ను బండారు సత్యనారాయణ మూర్తి ఆశిస్తున్నారు. బండారు అప్పలనాయుడు ఎంపీ రామ్మోహనాయుడు (MP Kinjarapu Ram Mohan Naidu) వెంట చంద్రబాబు నివాసానికి వచ్చారు. రెండో విడత అభ్యర్థుల జాబితాలో తమ పేర్లు ఉంటాయని ఆశావహులు ఆశిస్తున్నారు.

ఆశావహులు, అసంతృప్తులతో చంద్రబాబు భేటీ - రాజకీయ భవిష్యత్తుకు హామీ

భవిష్యత్తును చూసుకుంటానంటూ భరోసా: టీడీపీ - జనసేన తొలి జాబితా ప్రకటించిన తర్వాత సీట్లు దక్కని నేతలు, మిత్రపక్షానికి సీట్లు కేటాయించిన స్థానాలకు చెందిన నాయకులు చంద్రబాబుతో సమావేశమవుతున్నారు. వారందరికీ సర్ది చెబుతున్న చంద్రబాబు సర్వేలు, సామాజిక సమీకరణాలు, పొత్తుల కారణంగా ఏర్పడిన పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మీ భవిష్యత్తును చూసుకుంటానంటూ చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. అలానే జనసేన నాయకులతో కలిసి నడవాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

ఖరారు కాని టీడీపీ, జనసేన రెండో జాబితా - ఉత్కంఠలో ఆశావహులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.