ETV Bharat / politics

తెలంగాణ నుంచి లోక్​సభ ఎన్నికల బరిలో రాహుల్​ గాంధీ! - ఖమ్మం లేదా భువనగిరి నుంచి పోటీ

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 6:50 AM IST

Updated : Feb 27, 2024, 7:02 AM IST

Rahul Gandhi Contests from Telangana in Lok Sabha Elections 2024 : లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మరోసారి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని నిలబెట్టేందుకు పీసీసీ చేసిన ప్రయత్నాలు సఫలమైనట్లు తెలుస్తోంది. ఈసారి సోనియా గాంధీతో పోటీ చేయించాలని రాష్ట్ర నేతలు భావించారు. కానీ అనూహ్యంగా రాష్ట్రంలోని ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీలో ఉన్నత స్థాయిలో నిర్ణయం జరిగినట్లు సమాచారం. రాహుల్‌ రాకతో పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.

Rahul
Rahul in telangana

తెలంగాణ నుంచి లోక్​సభ ఎన్నికల బరిలో రాహుల్​ గాంధీ

Rahul Gandhi Contests from Telangana in Lok Sabha Elections 2024 : కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్‌ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌, అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. తెలంగాణ నుంచి రాహుల్‌ (Rahul Gandhi) పోటీ చేస్తే పార్టీపై మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి.

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని, నియోజకవర్గానికి న్యాయం చేయలేనని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ (Rajya Sabha) సభ్యురాలిగా నిలవాలని సూచించినా, సోనియాగాంధీ రాజస్థాన్‌ నుంచి ఎగువసభకు వెళ్లారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ ఎంపీగా (Wayanad MP) ఉన్న రాహుల్‌ను ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించే అంశంపై పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది.

ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు - వర్చువల్​గా 2 పథకాల ప్రారంభానికి ఏర్పాట్లు

Lok Sabha Elections 2024 : అందుకు ఆయా నేతలతో పాటు రాహుల్‌ అంగీకరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి పోటీ చేస్తారని రాష్ట్ర కాంగ్రెస్‌లోని పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

వయనాడ్​ నుంచి పోటీ చేయనున్న డి.రాజా సతీమణి : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న కేరళ వయనాడ్‌లో పోటీ చేస్తున్నట్లు సీపీఐ తెలిపింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి యానిరాజాను అభ్యర్థిగా ప్రకటించింది. విపక్ష ఇండియా కూటమి(India Alliance)లోని ఇతర పార్టీలతో కాంగ్రెస్‌ ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతోంది. ఇంతలో కూటమిలోని తన అభ్యర్థిని సీపీఐ ప్రకటించింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న కేరళలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ సైతం మెజార్టీ ముస్లిం ఓటర్లు ఉన్న వయనాడ్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. ఈ తరుణంలో రాహుల్‌గాంధీ మరోసారి వయనాడ్‌ నుంచి పోటీలో ఉండకపోవచ్చని సమాచారం.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి - పీఏసీ ఏకగ్రీవ తీర్మానం

రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక- తొలిసారి పెద్దల సభకు

Last Updated : Feb 27, 2024, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.