Ragidi Laxma Reddy Met Malla Reddy : ప్రజల ఆశీర్వాదంతో మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని గెలుస్తామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఎదుర్కొని ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో నేడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తనకు టికెట్ కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ (Parliament) ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అత్యధిక మెజార్టీతో మల్కాజిగిరి (Malkajgiri) పార్లమెంట్ స్థానం పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తన గెలుపునకు కృషి చేస్తామని చెప్పారని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ది చేశామని, ఐటీ రంగంలో జరిగిన అభివృద్ధిలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారని వివరించారు.
"మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నియమించినందుకు పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులందరినీ కలుసుకోవడం జరిగింది. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సహకారమందిస్తామని ఎమ్మెల్యేలందరూ తెలియజేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఐటీ రంగం ఇంత అభివృద్ధి జరిగిందంటే అది కేటీఆర్ ఘనతే అని చెప్పవచ్చు. ఐటీ జాబ్ చేయాలనుకునే యువత తెలంగాణ వైపు చూసేవిధంగా ఆయన అభివృద్ధి చేశారు."- రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి
Ragidi Laxma Reddy On KCR : "రాబోయే ఎన్నికల్లో ప్రజలు నన్ను గెలిపిస్తారని భావిస్తున్నాను. గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉన్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాను. ఎంతో మంది పేదలను (Poor people) కలుసుకున్నాను. మెడికల్ క్యాంపులు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను చేశాను. మా ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ప్రజలకు మంచి పరిపాలన అందించాం. అదే మమ్మల్ని గెలిపిస్తుంది" అని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు మరో షాక్ - కాంగ్రెస్ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్
కేసీఆర్ ప్లాన్ ఛేంజ్ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్ షోలతోనే ఎన్నికల ప్రచారం
బీఆర్ఎస్ కదనభేరీ సభ - నేడు కరీంనగర్ వేదికగా కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం