ETV Bharat / politics

హనుమాన్​ చాలీసా చదివి - హరీశ్​రావు నయా నాటకం మొదలెట్టారు : రఘునందన్​ రావు - Raghunandan Rao on BRS Harish Rao

Raghunandan Rao Slams BRS Harish Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు నయా నాటకాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్​ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ అండర్ ​స్టాండింగ్​లో ఫోన్​ ట్యాపింగ్​ కేసు విచారణ జరుగుతుందని ఆరోపించారు. ఇరు పార్టీల మధ్య మాటలే తప్ప, చర్యలు తీసుకోరన్నారు.

Congress And BRS Are on Understanding Says Raghunandan Rao
Raghunandan Rao Slams BRS Harish Rao
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 12:54 PM IST

Raghunandan Rao Slams BRS Harish Rao : ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కేసీఆర్​ను మొదటి ముద్దాయిగా, హరీశ్​రావును రెండో ముద్దాయిగా చేర్చాలంటూ మెదక్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన రావు డిమాండ్​ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్​ నేతలపై విమర్శలు గుప్పించారు. ఫోన్​ ట్యాపింగ్​లో దేవుడిని కూడా వదిలిపెట్టలేదన్నారు. యాదగిరి గుట్ట దేవాలయాన్ని కట్టడానికి బంగారం దుకాణదారులను భయపెట్టినట్లు అనిపిస్తుందని ఆరోపించారు.

"హరీశ్​రావును సూటిగా ఐదు ప్రశ్నలు అడుగుతున్నా. వరంగల్​లో ఒక అర్చకుడు సత్యనారాయణ హత్యకు గురయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? భైంసా పట్టణంలో సంక్రాంతి పండుగ రోజు సకినాలపై మూత్ర విసర్జన చేసినప్పుడు ఏం చేశారు? అధికారంలో ఉన్నప్పుడు నిజాంలు, అధికారంలో లేనప్పుడు హిందువులా? హిందూ అమ్మాయిలు పరీక్షలు రాయడానికి వెళ్తే, మంగళ సూత్రం తీసివేయించారు? అప్పుడు హరీశ్​రావు హిందువు కాదా?" - రఘునందనరావు, మెదక్ బీజేపీ అభ్యర్థి

బీఆర్ఎస్ కాంగ్రెస్​ మధ్య అండర్​స్టాండింగ్​లో ఫోన్​ ట్యాపింగ్​ కేసు విచారణ జరుగుతోంది రఘునందనరావు

కేసీఆర్​కు మెదక్ ఎంపీ స్థానం​ కోసం స్థానిక అభ్యర్థి దొరకలేదా?- రఘునందన్​ రావు - Raghu Nandan Rao Fires On Kcr

చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగితే కనీసం పరామర్శించారా అని నిలదీశారు. ఈ క్రమంలోనే హనుమాన్​ చాలీసా చదవారు కానీ అందులో 4 తప్పులు చదివారని తెలిపారు. హనుమాన్​ చాలీసా చదివి హరీశ్​రావు నయా నాటకం మొదలుపెట్టారని మండిపడ్డారు. వారి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. అధికారంలో ఉండి అనేక తప్పులు చేశారని మండిపడ్డారు.

'2015 ఓటుకు నోటుకు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించింది ఇప్పటి టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ మహేందర్ రెడ్డి కాదా? 2015 ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ ఎందుకు పక్కన పెడుతున్నారు. 2016 నుంచే ఎందుకు ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తున్నారు. ఆనాడు నోటుకు ఓటు కేసు విచారణ బయటకు రాకుండా, 2016 నుంచే ఫోన్ ట్యాపింగ్ విచారణ చేయిస్తున్నారు. 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ విచారణ చేయాలి' అని రఘునందన్​ రావు డిమాండ్​ చేశారు.

లీకేజీతో సంబంధం లేకుంటే కేటీఆర్‌ ఎందుకు స్పందించారు: రఘునందన్‌రావు

Congress And BRS Are on Understanding Says Raghunandan Rao : కాంగ్రెస్, బీఆర్​ఎస్​ అండర్ ​స్టాండింగ్​తో ఫోన్​ ట్యాపింగ్​ కేసు విచారణ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్​లో మొదటి ముద్దాయి కేసీఆర్, రెండో ముద్దాయి హరీశ్​ రావు, మూడో ముద్దాయిగా వెంకట రామిరెడ్డి, నాలుగో ముద్దాయిగా కేటీఆర్ పేరు చేర్చాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో మూడున్నర కోట్లు పట్టుకున్నా, రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. వివేక్​ వెంకటస్వామి కూడా బాధితుడే కదా, మరి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని అడిగారు.

ఎమ్మెల్సీ వెంకట రామిరెడ్డిని కొత్త వియ్యంకుడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కాపాడుతున్నారా? అని ప్రశ్నించారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడికి పోయాయన్న ఆయన, రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారాన్ని పక్కన పెట్టి, మునుగోడు, దుబ్బాక ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీశారు.

''ఫోన్​ ట్యాపింగ్​'లో కొందరినే బాధ్యులు చేయడం సరికాదు - ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చాలి' - BJP on Phone Tapping Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.