ETV Bharat / politics

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు - ముగ్గురు వైఎస్సార్సీపీ నేతలను విచారిస్తున్న పోలీసులు - POLICE INTERROGATING YSRCP LEADERS

ఇప్పటికే కేసు సీఐడికి అప్పగింత - సాంకేతిక కారణాలతో కేసు అప్పగింత ఆలస్యం

police_are_interrogating_ysrcp_leaders
police_are_interrogating_ysrcp_leaders (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2024, 12:37 PM IST

Police are Interrogating YSRCP Leaders in the Case of Attack on TDP Central Office : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఈ ముగ్గురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. దాడి రోజు వీరు ఎక్కడెక్కడ కలిసింది, ఏ యే ప్రాంతాల్లో సమావేశమైందనే వివరాలను పోలీసులు రాబడుతున్నారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని సాంకేతిక కారణాలతో కేసును అప్పగించడంలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మంగళగిరి పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - దర్యాప్తునకు సహకరించాలని సజ్జలకు హైకోర్టు ఆదేశం - AP HC on Sajjala Bail Petition

Attack on TDP Central office Cases handed Over to CID : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వారిలో జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి ఉన్నారు. ఈ కేసులో ఇంకుముందే ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో పలువురు వైఎస్సార్సీపీ కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళగిరి గ్రామీణ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 2021 అక్టోబరు 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైఎస్సార్సీపీ మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు విచారిస్తున్నారు.

ఇటీవల నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలనుసేకరించారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధారించారు. అయితే, పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన నిందితుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో కొందరు టీడీపీలో చేరతామని రాయబారాలు కూడా నడిపినట్లు సమాచారం.

ఏపీ పోలీసుల దర్యాప్తులో ఉన్న మూడు ప్రధాన కేసులను సీఐడీ చేతికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలతో పాటు సంచలనం సృష్టించిన సినీనటి కాదంబరీ జెత్వానీ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీచేశారు. ఈ 3 కేసులనూ ఇప్పటి వరకు స్థానిక పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు. డీజీపీ ఆదేశాలతో కేసులకు సంబంధించిన రికార్డులన్నింటినీ సీఐడీకి అప్పగించారు.

"27 ప్రశ్నలకు ఒక్క సమాధానం లేదు" - చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో దర్యాప్తునకు సహకరించని జోగి రమేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.