ETV Bharat / politics

మాచర్లకు మంచిరోజులొచ్చాయ్ - పిన్నెల్లికి వాత పెట్టిన ఓటర్లు - Macherla Constituency Poll Result

Macherla Constituency Poll Result : మాచర్లకు స్వాతంత్య్రం వచ్చింది! ఔను మీరు విన్నది నిజమే! బ్రిటీషర్లను పోలిన నియంతృత్వం, దోపిడీ ముఠాలను మించిన దౌర్జన్యం, గిట్టని వాళ్లను ఊళ్ల నుంచి వెళ్లగొట్టే రాక్షసత్వం నుంచి మాచర్లకు విముక్తి లభించింది! ఒకటా? రెండా? దాదాపు 15ఏళ్లపాటు పిన్నెల్లి అరాచకాల మధ్య మగ్గిన నియోజకవర్గం ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్యాన్ని తన పాదాల కింద తొక్కేసిన మాచర్ల మారీచుడిని జనం ఇంటికి పంపారు.

Macharla Constituency
Macharla Constituency Result 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 3:00 PM IST

Macherla Constituency Election Result 2024 : పల్నాడు జిల్లా మాచర్లలో ఆటవిక పాలనకు ప్రజలు తెరదించారు. నీ ఆగడాలు ఇక భరించలేం బాబోయ్‌ అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సాగనంపారు. అరాచకానికీ ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ఎలా ఉంటుందో మాచర్ల ప్రజలు ఈ ఎన్నికల్లో చూపించారు. అధికారం అండతో అందినకాడికి దోచుకుని, ప్రశ్నించిన వారిని బెదిరించి, అడ్డొచ్చిన వారిని అంతమొందించి, నిలదీసే వారిని ఊళ్ల నుంచి వెళ్లగొట్టి మాచర్లను ఓ చంబల్‌ లోయలా మార్చిన పిన్నెల్లికి తగిన గుణపాఠం చెప్పారు.

2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లు వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలోకి వెళ్లారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి విజయం సాధించారు. అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని పిన్నెల్లి తన సొంతసామ్రాజ్యంలా మార్చుకున్నారు. తాను చేప్పిందే చట్టం, చేసిందే శాసనం అన్నట్లు చెలరేగారు. చివరకు రాజకీయం కూడా తాను తప్పితే ఎవరూ చేకూడదనే స్థాయికి వెళ్లారు.

పిన్నెల్లికి వాత పెట్టిన ఓటర్లు : గడచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని నామినేషన్‌ కూడా వేయనీయ లేదు. మాచర్ల మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలన్నింటినీ ఏకగ్రీవం చేశామని విర్రవీగారు. ఇదేం అరాచకం అంటూ అక్కడికి వెళ్లిన తెలుగుదేశం నిజ నిర్ధారణ బృందంపై దాడి చేశారు. సెంట్రింగ్‌కర్రతో మాచర్ల నడిబొడ్డునే వెంటాడి కారుపై దాడి చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ఉండాలంటే పిన్నెల్లికి తలొంచాలి! లేదంటే తలదించాలి. లేదంటే ఊరొదిలి వెళ్లిపోవాలి.

గత ఐదేళ్లలో నియోజకవర్గంలోని ఎన్నో గ్రామాల్లో తెలుగుదేశం నేతలు అలా వెళ్లిపోయారు. వాళ్లందరికీ పిన్నెల్లిని ఎదురించాలనే కసి ఉంది. కాకపోతే వారికి అండగా నిలచే బలమైన శక్తి కోసం ఎదురు చూశారు. జూలకంటి బ్రహ్మారెడ్డి రూపంలో మాచర్ల పసుపు సైన్యానికి ఒక బలమైన నాయకుడు దొరికాడు. బ్రహ్మారెడ్డి రాకతో చాలా మంది ధైర్యం కూడదీసుకుని ఎన్నికల ముందు మళ్లీ స్వగ్రామాలకు వచ్చారు. పోతే ప్రాణం వస్తే ప్రజాస్వామ్యం అనుకుని తెగించి పోరాడారు.

AP Election Results 2024 : పోలింగ్‌ రోజు పసుపు సైన్యంలో అదే తెగువ కనిపించింది. గొడ్డలి వేటు పడినా మహిళా నేత మంజుల వెనక్కి తగ్గలేదు. ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లికి, పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రం లోపల టీడీపీ ఏజంట్‌ నంబూరి శేషగిరిరావు, పోలింగ్‌ బూత్ బయట మహిళలు తిరుగుబాటు అంటే ఎలా ఉంటుందో చూపించారు.

ఆ రోజే పిన్నెల్లి ఓటమి ఖాయమైంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో అధికారికమైంది. పిన్నెల్లికి ప్రజా కోర్టులో శిక్ష పడింది. ఈ ఓటమితో పిన్నెల్లి పోయేది ఇంటికి కాదు నేరుగా జైలుకే! ఈవీఎం ధ్వంసం సహా పోలింగ్‌ రోజు దాడులు చేయించిన కేసుల్లో ఈనెల 6 వరకూ హైకోర్టు నుంచి రక్షణ పొందిన పిన్నెల్లికి ఆ తర్వాత ఏ క్షణమైనా సంకెళ్లు వేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు - కౌంటింగ్​ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశం - SC on MLA Pinnelli Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.