ETV Bharat / politics

కండువా మార్చినా కలిసిరాలేదు - చివరి నిమిషంలో పార్టీలు మారి ఓటమిని చవిచూశారు - Parties Changed Leaders Hopes Failed - PARTIES CHANGED LEADERS HOPES FAILED

Parties Changed Leaders Hopes Failed : తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు పార్టీలు మారిన పలువురికి తాజా ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. సొంత పార్టీని కాదని, మరో పార్టీకి మారిన అభ్యర్థులకు పరాభవం తప్పలేదు. అయితే గులాబీ పార్టీలో ఎంపీ సీటు పొంది మరీ, హస్తం గూటికి చేరిన కడియం కావ్యకు మాత్రం కలిసొచ్చిందనే చెప్పొచ్చు. తొలి ప్రయత్నంలోనే భారీ మెజారిటీ సాధించి విజయకేతనం ఎగురవేశారు.

Telangana Lok Sabha Polls Results 2024
Parties Changed Leaders Hopes Failed (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 10:26 PM IST

Parties Changed Leaders Hopes Failed : తెలంగాణలో లోకసభ ఎన్నికల ముందు కొందరు నేతలు సొంత పార్టీని వీడి మరోపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారు. ఇంతకుముందు ఉన్న పార్టీపైనే విమర్శనాస్తాలు సంధించారు. కానీ వారిలో చాలా మంది వ్యూహాలు ఫలించలేదు. ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురై, రిజల్ట్స్​ తారుమారయ్యాయి.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, సార్వత్రిక సమరంలోనూ అదే ఉత్సాహాన్ని కనబరచాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఆ దిశగానే ఓవైపు చేరికలు, మరోవైపు పాలనా కార్యకలాపాలు జరిపింది. ఇదిలా ఉంటే విపక్ష భారతీయ జనతా పార్టీ రెండెంకల స్థానామే లక్ష్యంగా తీవ్రంగా శ్రమించింది. ఇందులో సైతం పలు పార్టీల నేతల చేరికలను ఆహ్వానిస్తూ ముందుకు సాగింది.

TG Lok Sabha Results 2024 : ముఖ్యంగా మోదీ మేనియాతో గెట్టక్కాలని తలచింది. అనుకున్నట్టుగానే ఈ రెండు జాతీయ పార్టీలు పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఈదఫా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులతో బేరసారాలు జరిపి, పార్టీలోకి ఆహ్వానించాయి. ఈ మేరకు గులాబీ పార్టీలు చాలా వరకు ముఖ్య నేతలు మొదలుకొని సర్పంచ్​ల వరకు ఫిరాయింపులు జరిపారు. అలా బీఆర్ఎస్​ను కాదని తమ పార్టీలోకి వచ్చిన పలువురికి జాతీయ పార్టీలు ఎంపీ టిక్కెట్​ సైతం కట్టబెట్టాయి. పాపం ఏమిలాభం? చాలా వరకు నేతల ఆశలు గల్లంతయ్యాయి.

కడియం కావ్యకు మాత్రం కలిసొచ్చిన కాలం : పలుచోట్ల మొదట నాలుగు రౌండ్లకే వెనుదిరగాల్సిన పరిస్థితి సైతం ఎదురైంది. కానీ అనూహ్యంగా తొలి రౌండ్​ లెక్కింపు కార్యక్రమంలో వెనుకడగు వేసి, చివరకు భారీ మెజారిటీ సైతం కైవసం చేసుకున్న సందర్భం సైతం ఉంది. ఆ కోవలో వరంగల్ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎన్నో రాజకీయ మలుపుల మధ్య సీటును సంపాదించుకొని, తన స్థానాన్ని సుస్థిరపరచుకుంది.

ఈమె మినహా మిగిలిన ఫిరాయింపు నేతలంతా వెనుదిరిగారనే చెప్పవచ్చు. అందులో ప్రధానంగా చూసుకుంటే, గత బీఆర్ఎస్ పార్టీకు చెందిన నేతలు దానం నాగేందర్, రంజిత్​రెడ్డి, కడియం కావ్య, సునీతా మహేందర్​రెడ్డి పలువురు కాంగ్రెస్​లో చేరగా, అదే గులాబీ పార్టీకి చెందిన మరికొందరు ఆరూరి రమేశ్, బీబీ పాటిల్​, శానంపూడి సైదిరెడ్డి, ఎంపీ రాములు( కుమారుడు భరత్ ప్రసాద్) బీజేపీలో చేరి ఎంపీ సీటును పొందారు. కానీ వారి ఆశలు ఫలించక, పరాభవన్ని చవిచూడాల్సి వచ్చింది. ​

కారు కనబడుట లేదు - లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఘోర పరాజయం - lok sabha election results 2024

ఉమ్మడి వరంగల్​లో కాంగ్రెస్ జయకేతనం - భారీ మెజారిటీతో గెలుపొందిన కడియం కావ్య, బలరాం నాయక్​ - WARANGAL LOK SABHA POLL RESULT 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.