ETV Bharat / politics

సామాజిక మాధ్యమాలు - పార్టీలకు ఇవే బలాలు - ఎన్నికల ప్రచారాలతో హోరెత్తబోతున్న సోషల్​ మీడియా - Parliament Elections 2024 - PARLIAMENT ELECTIONS 2024

Parliament Elections Campaign 2024 : గోడ మీద రాతలు, కరపత్రాలు, పోస్టర్లు, పాదయాత్రలు, బహిరంగ సభలు, రోడ్‌ షోలు, టీవీ, పత్రికా ప్రకటనలు, ఎన్నికల ప్రచారం అంటే ఒకప్పుడు ఇవి మాత్రమే. కానీ కాలం మారింది. కాలంతో పాటే సాంకేతికత పెరిగింది. ఆ సాంకేతికతతో పాటే ఎన్నికల ప్రచార సరళీ మారిపోయింది. ఇప్పుడు అంతా డిజిటల్‌దే రాజ్యం. సామాజిక మాధ్యమాలు ప్రచారానికి అతి పెద్ద వేదికలుగా మారిపోయాయి. ఎక్కువ శ్రమ, ఖర్చు అవసరం లేకపోవడం, ప్రజలను సులభంగా చేరుకునే వీలుండటంతో పార్టీలన్నీ తమ ప్రచారం కోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుకుంటున్నాయి. మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వీటి జోరు ఎలా ఉండబోతోంది. డిజిటల్‌ మీడియా, పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ఏ విధంగా నిర్దేశించబోతోంది.

Parliament Elections 2024
Parliament Elections Campaign 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 6:41 PM IST

Updated : Mar 21, 2024, 6:52 PM IST

సామాజిక మాధ్యమాలు - పార్టీలకు ఇవే బలాలు - ఎన్నికల ప్రచారాలతో హోరెత్తబోతున్న సోషల్​ మీడియా

Parliament Elections Campaign 2024 : ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో అతి పెద్ద విప్లవం సామాజిక మాధ్యమాల రాక. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల రాకతో గత దశాబ్ద కాలంగా మనిషి జీవితమే మారిపోయింది. సమాచార మార్పిడిలో సరికొత్త వేదికలుగా మారిన సోషల్‌ మీడియా, సమస్తాన్ని డిజిటల్‌ మయం చేసింది. ఈ మార్పును సాధారణ ప్రజలతో పాటు రాజకీయ పార్టీలూ అందిపుచ్చుకున్నాయి. తమ రాజకీయ, ఎన్నికల ప్రచారానికి సామాజిక మాధ్యమాలను ప్రధాన వేదికగా చేసుకున్నాయి. సంప్రదాయ ప్రచారానికి తోడు, వీటిని కూడా జత చేసి ప్రచారాన్ని సాగిస్తున్నాయి.

Lok Sabha Polls 2024 : ముఖ్యంగా 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి ప్రారంభమైన ఈ సంప్రదాయం, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు వచ్చే సరికి పతాక స్థాయికి చేరుకుంది. సామాజిక మాధ్యమాల్లో వివిధ రూపాల్లో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన రాజకీయ పార్టీలు, ఎన్నికల తేదీలు దగ్గర పడే నాటికి దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఒకటి, రెండు అని కాకుండా, దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలకూ సామాజిక మాధ్యమాలు సార్వత్రిక ఎన్నికల్లో అతి పెద్ద ప్రచార ఆయుధాలుగా ఉన్నాయి.

'రూ.95 లక్షలకు మించి ఖర్చు చేయరాదు' - అభ్యర్థుల ఖర్చులపై ఈసీ నిబంధనలు

Lok Sabha Elections Campaign 2024 : సార్వత్రిక ఎన్నికలు ఎర్రటి ఎండాకాలంలో జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలూ 40 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతల్లోనే ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి. బహిరంగ సభలు, పాదయాత్రలు, రోడ్‌ షోలను సుర్రున కాలే ఎండల్లోనే జరపాలి. 2004 నుంచి సార్వత్రిక ఎన్నికలు వేసవిలోనే జరుగుతుండగా, నేతలు, అభ్యర్థులు ఎండల్లోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు కూడా అందుకు అతీతమేమీ కాదు. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు, నాయకులకు వరప్రదాయిని లాంటి వేదికలుగా మారాయి సామాజిక మాధ్యమాలు. గెలుపు కోసం ఎండల్లో ప్రచారం తప్పనిసరి అయినా, దీన్ని కొంతైనా తప్పించుకునేందుకు సామాజిక మాధ్యమాలు పార్టీలు, అభ్యర్థులకు బాగా మేలు చేయబోతున్నాయి.

ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఖాతాలు, ఛానెళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌లలో కోట్లాది మంది ఖాతాలను కల్గి ఉండటం, యూట్యూబ్‌ ఛానళ్లలో కోరుకున్న వీడియో పోస్ట్‌ చేసే అవకాశం సహా దానికి కూడా కోట్ల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఈ వేదికలకు ఉన్న వెసులుబాటు. ఆయా ఖాతాల ద్వారా పార్టీలు, అభ్యర్థులు తాము చెప్పదల్చుకున్నది చెప్పడం, ప్రత్యర్థి పార్టీపై విమర్శలు వంటివి, సందేశాలు, కథనాలు, వీడియోల రూపంలో అందజేస్తుంటారు. ఇలాంటి ఎన్నికల ప్రచారాలతో రాబోయే రెండున్నర నెలలు సామాజిక మాధ్యమాలు హోరెత్తబోతున్నాయి.

ఎంపీ సీటు కోసం మూడు పార్టీల్లోనూ తీవ్ర పోటీ - ఉమ్మడి పాలమూరులో అప్పుడే మొదలైన ఎన్నికల వేడి!

దేశం అంతటా ఈ ఏర్పాట్లలోనే : ఇటీవల ముగిసిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలు పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. వాటితో పాటు లోక్‌సభ ఎన్నికల కోసం మరిన్ని గ్రూప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. శాసనసభ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశం అంతటా రాజకీయ పార్టీలు ఇలాంటి ఏర్పాట్లలోనే ఉన్నాయి. పార్టీలకు ప్రత్యేకంగా సామాజిక మాధ్యమం, ఐటీ విభాగాలు ఉన్నాయి.

బీజేపీ, కాంగ్రెస్‌ వంటి రాజకీయ జాతీయ పార్టీలకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉండగా, ప్రాంతీయ పార్టీలకు రాష్ట్ర, జిల్లా స్థాయిలోనూ ఉన్నాయి. ఇవన్నీ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార జోరు కొనసాగించడానికి సిద్ధం అయ్యాయి. సొంత పార్టీ నేతల పర్యవేక్షణ సహా ఐటీ నిపుణులను ప్రత్యేకంగా నియమించుకుని మరీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచార జోరును కొనసాగించడానికి రంగంలోకి దిగుతున్నాయి.

'ఇందా ఈ డబ్బు తీసుకో - నాకే ఓటేస్తానని దేవుడి మీద ఒట్టేయ్'

ఆ ఏజెన్సీల పంట పండినట్లే : సోషల్‌ మీడియాలో ప్రచార నిర్వహణకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఏజెన్సీలను కూడా నియమించుకుంటాయి. పార్టీలకు తోడు అదనంగా అభ్యర్థులకు కూడా ఇవి పని చేస్తాయి. ఇటీవలి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఇలాంటి ఏజెన్సీలు చాలా చురుగ్గా పని చేశాయి. ప్రచారం ప్రారంభం అయిన నాటి నుంచి, ముగిసే వరకు పని చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. చిత్రాలు, వీడియోలు రూపొందించే ఏజెన్సీ సిబ్బందికి వేతనం, భోజనం, వసతి సౌకర్యంతో పాటు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్రచార వ్యూహకర్తలకు బాగా డిమాండ్‌ పెరిగింది. దీని వల్ల లోక్‌సభ ఎన్నికలు ముగిసే నాటికి ఇలాంటి ఏజెన్సీల పంట పండనుంది.

సామాజిక మాధ్యమాల ప్రచారాల్లో దేశవ్యాప్తంగా అధికార బీజేపీ ముందుంది. ఒకరకంగా దీనికి శ్రీకారం చుట్టిందే ఆ పార్టీ. 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి దీనిని ప్రారంభించింది. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ 2013లో ప్రకటించగా, అంతకు ముందే ఫేస్‌బుక్‌లో ఆయన అభిమానులు మోదీ ఫర్‌ పీఎం సహా వివిధ పేర్లతో ప్రత్యేకంగా ఖాతాలు తెరిచి సంఘీభావం తెలిపారు. మోదీ ప్రధాని అభ్యర్థి కావాలంటూ ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఒకరకంగా మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విస్తృత స్పందన కూడా ఒక కారణం అని అంటారు.

ఓటర్లను ప్రలోభ పెట్టేవి తప్ప ఇతర సామాగ్రి సీజ్ చేయొద్దు : సీఈసీ

ముందంజలో బీజేపీ : ఇక మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయనకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో మరిన్ని ఖాతాలు వెలిశాయి. ఈ స్పందనను చూసిన బీజేపీ అధిష్ఠానం కూడా 2014లో సోషల్‌ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహించింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇలా ప్రచారం చేపట్టినా, దీనిలో కమలం పార్టీ ముందు నిలిచింది. ఇక ఆ తర్వాత దేశంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సోషల్‌ మీడియా బలమైన ప్రచార వేదికగా మారింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ లెటర్‌ ఫ్రమ్‌ ది ప్రైమ్‌ మినిస్టర్‌ పేరుతో ఓ లేఖను ప్రచారం చేస్తుండగా, మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ మోదీ పేరుతో మరో వెబ్‌ పేజీని కూడా ప్రారంభించింది. కాంగ్రెస్‌ రాహుల్‌ గాంధీ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసింది.

సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం అంటే వీడియోలు, లఘు చిత్రాలు తీసి ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌, ఎక్స్​లో పోస్ట్‌ చేయడం, సొంత పార్టీ హామీలు, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే వ్యాఖ్యానాలు, చిత్రాలే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా పేర్కొనే ప్రముఖులైన వ్యక్తులకు నేతలు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ పార్టీల ఎజెండాను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు కేంద్రమంత్రులు పాడ్‌కాస్ట్‌, యూట్యూబ్‌ ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా మరో పాడ్‌కాస్ట్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కొవిడ్‌ తర్వాత సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య పెరిగింది. వీరికి కూడా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా డిమాండ్‌ పెరగనుంది.

కంచుకోటను మరోసారి కైవసం చేసుకునేందుకు 'హస్తం' పక్కా ప్లాన్ - నిజామాబాద్​ బరిలో ఆ అభ్యర్థి!

ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి : దేశంలో 50 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లు, 36.6 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. వీరిలో ఎన్నికల సందర్భంగా ఇక ప్రచారాలు జోరుగా సాగనున్నాయి. బయట రోడ్ల మీద పార్టీల సభలు, సమావేశాలు, సోషల్‌ మీడియాలో ప్రచారాలతో అంతటా సందడిగా మారనుంది. అయితే అదే సమయంలో సోషల్‌ మీడియా వేదికగా నకిలీ సమాచార వ్యాప్తి సహా, వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కల్గడం అనే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలను వినియోగించే వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘం కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా, జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి వాటిపై నిఘా పెట్టింది.

ఏదేమైనా సామాజిక మాధ్యమాలు, ఎన్నికల ప్రచారంలో వచ్చిన సరికొత్త మార్పు. అయితే ఈ ప్రచారం దుర్వినియోగం కాకుండా సాఫీగా సాగాలని, ఎన్నికలు సక్రమంగా ముగిసి భారత ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లాలని అందరి ఆకాంక్ష.

'ఎన్నికలు అయిపోయే వరకు మీరే కాస్త సర్దుకోండమ్మా - ప్రచారాలు ముగియగానే మళ్లీ వచ్చి పనిలో చేరిపోతాం'

Last Updated : Mar 21, 2024, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.