Pithapuram Municipal Council Meeting Fight : పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశాల్లో ఇప్పటి వరకూ అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు బాహాబాహికి దిగడం, గొడవలు పడటం చూస్తూనే ఉన్నాం. అది ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ మారాయ్. 'బట్ ఫర్ ఏ చేంజ్' అంటూ ఆ ఇద్దరు ఆఫీసర్లు మాత్రం 'ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ సెట్' చేశారు. కౌన్సిల్ సమావేశాల్లో ఇద్దరు బాహాబాహికి దిగారు.
వ్యక్తిగత విషయాలు ప్రస్తావించుకుంటూ బూతుల దండకం ఎత్తుకున్నారు. దీంతో కౌన్సిల్‌లోని సభ్యులు ఒక్కసారిగా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వ్యవహారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan) నియోజకవర్గమైన పిఠాపురంలో జరగడంతో అధికారుల రగడ వైరల్‌గా మారింది. వారిద్దరూ ఎందుకు కొట్టుకున్నారంటే..
Officers Fight in Pithapuram Municipal Council : కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కమిషనర్ కనకరావు, డీఈ భవాని శంకర్ సమావేశం జరుగుతుండగానే పరస్పరం కొట్టుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో డీఈ భవానీ శంకర్ సెలవుపై వెళ్లారు. ఎన్నికల తర్వాత తిరిగి విధుల్లో చేరారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. డీఈ భవాని శంకర్ విధుల్లో ఉన్నా కమిషనర్ కనకారావు కాకినాడలోని ఈఈ చేత ఫైల్స్‌పై సంతకాలు చేయించుకుంటున్నారు.
డీఈ ఉండగా ఈఈతో ఫైల్స్‌పై సంతకాలు ఎందుకు చేయిస్తున్నారని కౌన్సిలర్ బోను దేవా కమిషనర్‌ను ప్రశ్నించారు. డీఈ అందుబాటులో లేని కారణంగా కలెక్టర్ ఆదేశాలతో ఈఈతో పని చేయించుకుంటున్నానని కమిషనర్ చెప్పారు. ఈ క్రమంలో డీఈ, కమిషనర్ మధ్య వాదోపవాదాలు జరిగి తిట్టుకున్నారు. ఆపై బాహాబాహికి దిగారు. కౌన్సిల్ సభ్యులు ఇద్దరినీ విడదీసి అడ్డుకున్నారు. దీంతో అక్కడున్న వారంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
ఏం చర్యలు తీసుకుంటారు? : ఉన్నత స్థానంలో ఉన్న కమిషనర్ కనకరావు, డీఈ భవాని శంకర్ బహిరంగంగా కొట్టుకోవడంతో ఈ రచ్చ తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఆఫీసర్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని చర్చ జరుగుతోంది.
పార్వతీపురంలో వైఎస్సార్సీపీ-టీడీపీ కౌన్సిలర్లు బాహాబాహి - పోలీసుస్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదు