ETV Bharat / politics

బీజేపీ గెలవబోయే 400 సీట్లలో నల్గొండ జిల్లా నుంచీ ఒకటి : శానంపూడి సైది రెడ్డి - Lok Sabha Polls 2024 - LOK SABHA POLLS 2024

Nalgonda BJP MP Candidate Fires On Congress : దేశం మొత్తం మోదీ రావాలి, బీజేపీ గెలవాలని కోరుకుంటోందని ఆ పార్టీ నల్గొండ జిల్లా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ గెలవబోయే 400 ఎంపీ సీట్లలో నల్గొండ జిల్లా నుంచి ఒకటి ఉంటుందని జోస్యం చెప్పారు. వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే, ఉత్తమ్​కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డిలు కనీసం పరిశీలించలేదని విమర్శలు చేశారు.

Nalgonda BJP MP Candidate Fires On Congress

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 9:24 PM IST

Nalgonda BJP MP Candidate Fires On Congress : లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ గెలవబోయే 400 ఎంపీ సీట్లలో నల్గొండ జిల్లా నుంచి ఒకటి ఉంటుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం మొత్తం మోదీ రావాలి - బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు మాటలతో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారెంటీలు కాదు కదా ఒక్క దానిని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజా పాలన దరఖాస్తులు రోడ్ల పాలయ్యాయని, గతంలో జరిగిన ఘటనను గుర్తు చేశారు.

Saidi Reddy comments On Congress : కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాంల పార్టీ అని ఎద్దేవా చేశారు. జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతే పరిశీలించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలపై మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీల్లో పోటీ చెయ్యడానికి కనీసం అభ్యర్థులు (Candidates) కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ అన్న ఆయన, లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఒక్క సీటు కూడా గెలవడం కష్టమని సంచలన ఆరోపణలు చేశారు.

సోషల్ మీడియా వార్తలపై స్పందించిన సైది రెడ్డి
నల్గొండలో బీజేపీ ఎంపీ అభ్యర్థిని మార్చాలంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా(Social Media), పత్రికల్లో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఎంపీ అభ్యర్థిని ప్రధాని మోదీయే ప్రకటించాక అందులో ఎలాంటి సందేహం లేదని హాట్​ కేక్ లాగా ఉందని అందుకే అలాంటి రూమర్స్ అయి ఉండొచ్చన్నారు. పార్టీ విజయానికి నాయకులు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితమే సైది రెడ్డి బీఆర్ఎస్​ పార్టీకి గుడ్​బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్​ నాయకులు కూడా బీజేపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా పలువురు నాయకులు వలస వెళ్లడం బీఆర్​ఎస్​కు ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.

దేశం మొత్తం మోదీ రావాలి- బీజేపీ గెలవాలని కోరుకుంటోంది : శానంపూడి సైది రెడ్డి

యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎంపీగా పోటీ చేస్తున్నా: సైదిరెడ్డి

ఎంపీ అభ్యర్థులపై బీజేపీ నేతల ఆసంతృప్తి - నాయకులను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం -

ఉత్తమ్ వర్సెస్ సైదిరెడ్డి - హుజూర్​నగర్​లో కిడ్నాప్ డ్రామా - అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.