ETV Bharat / politics

'ఫోన్​ ట్యాపింగ్​పై సీబీఐ విచారణ జరిపించాలి'- గవర్నర్​కు బీజేపీ నేతల ఫిర్యాదు - BJP leaders meet Governor - BJP LEADERS MEET GOVERNOR

BJP MP Laxman On Tapping Case : ఫోన్‌ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ నేతృత్వంలో బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు ఫిర్యాదు చేసిన నాయకులు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలన్నారు.

Laxman On Tapping Case
Laxman On Tapping Case
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 4:49 PM IST

BJP Leaders Complaint To Governor On Phone Tapping : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను ఆయన నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర నేతల ప్రతినిధి బృందం కలిసింది. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఉల్లంఘన, దేశ ద్రోహానికి మించిన ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు : రఘునందన్ రావు

BJP MP Laxman On Phone Tapping Case : గవర్నర్​కు వినతిపత్రం అందించిన అనంతరం మాట్లాడిన బీజేపీ నేత లక్ష్మణ్ బీఆర్​ఎస్ అధ్యక్షుడు కేసీఆర్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన కేసీఆర్ సర్కారు అపవాదును తీసుకొచ్చిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పాత్రదారులను మాత్రమే అరెస్టు చేస్తున్న ప్రభుత్వం సూత్రధారులను కూడా అరెస్టు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకే నడుచుకున్నామని అధికారులు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. సొంత ప్రయోజనాలకోసం గత ప్రభుత్వం ఫోన్​ ట్యాపింగ్​కు(phone Tapping) పాల్పడటం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.

"నాయకులు, వ్యాపారులు, సినీ రంగంలోని ప్రముఖ వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లుగా వెలుగులోకి వస్తున్నాయి. రాజ్యంగ విరుద్ధమైన, దేశద్రోహానికి మించిన ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారంటే క్షమించరాని నేరం. దీనికి ఎవరు సూత్రధారులో తేల్చాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు సీబీఐ విచారణ ద్వారానే బయటకు వస్తాయి. సీబీఐ ద్వారా ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్​ను ఈరోజు కలవడం జరిగింది"- డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ ఎంపీ

టెలిగ్రాఫ్​ చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే చర్యలు తప్పవు - ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

MP K Laxman Comments On CM : ఫోన్​ట్యాపింగ్ కేసులో ఎంత పెద్ద వ్యక్తులైన వదిలేదిలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. ఇప్పటికే నాలుగు మాసాలు గడిచినప్పటికీ కాళేశ్వరం, మేడిగడ్డ, మాదక ద్రవ్యాలు, ధరణిపై దర్యాప్తు ఊసే లేకుండా పోయిందని ఆయన ఆక్షేపించారు. ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్రప్రభుత్వం తేలికగా తీసుకున్నప్పటికీ కేంద్రం మాత్రం వదిలిపెట్టదని తేల్చిచెప్పారు.

సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు : ఫోన్​ట్యాపింగ్ బాధితుల్లో బీజేపీ నేతలు కూడా ఉన్నారని సీబీఐ విచారణ ద్వారానే అసలు నిజాలన్నీ బయటకు వస్తాయని కె.లక్ష్మణ్ తెలిపారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్‌వీ సుభాష్ తదితరులు ఉన్నారు.

'ఫోన్​ ట్యాపింగ్​పై సీబీఐ విచారణ జరిపించాలి'- గవర్నర్​కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

ఫోన్ ట్యాపింగ్​పై సీఎం రేవంత్​రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలి : ఎంపీ లక్ష్మణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.