Motkupalli Narasimhulu Fires on Congress : పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. తెలంగాణ అంటే ఏం వచ్చింది బూడిద తప్ప, సచ్చింది మాత్రం ఎస్సీలు, బీసీలేనని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి ఒక్క సీటు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ చలో హైదరాబాద్ పేరుతో ఎంఆర్పీఎస్ పిలుపు మేరకు మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని, ఇతర బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
MRPS Maha Dharna Sabha in Hyderabad : రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ నాయకులు, శ్రేణులు మహాధర్నాకు తరలివచ్చారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన మాదిగలకు నివాళులు అర్పించి మౌనం పాటించారు. దొరలకు వ్యతిరేకంగా పోరాడి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని మోత్కుపల్లి గుర్తు చేశారు. గతంలో సీఎంలుగా పనిచేసిన చెన్నారెడ్డి, విజయ భాస్కర రెడ్డి, జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిని చూశానని, ఇంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డిలా ఏ ముఖ్యమంత్రి వ్యవహరించలేదని ఆక్షేపించారు. తమ జాతిని తొక్కేస్తా అంటే ఊరుకోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చేస్తోంది : మందకృష్ణ మాదిగ - Manda Krishna Madiga Demands
Manda Krishna Madiga Comments : లోక్‌సభలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకుండా రేవంత్ కుట్రపన్నారంటూ మోత్కుపల్లి ఒక దశలో కంటితడి పెట్టారు. 80 లక్షల మంది మాదిగలు ఉంటే 1 పార్లమెంట్ సీటు, కనీసం కంటోన్మెంట్ అసెంబ్లీ సీటైనా ఇవ్వడానికి మనసు రాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పెద్దలు ఎందుకు పెదవి విప్పలేదని ఆయన నిలదీశారు. ఎన్నికల్లో మాదిగలు, నేతకాని, బీసీలు కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని మంద కృష్ణమాదిగ అన్నారు. రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో 70 శాతం ఉన్న మాదిగలకు 3 పార్లమెంట్ సీట్లు ఇవ్వాల్సి ఉన్నా రిక్త హస్తం చూపిందని ఆరోపించారు. రాజ్యాంగం గొప్పదనం వల్లే తాను ప్రధాని అయ్యాయని చెప్పిన మోదీ, ఎస్సీ వర్గీకరణ చేస్తారని, బీజేపీకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
"ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అందరం ఏకమై మనం బలమేంటో చూపించాలి. గతంలో సీఎంగా పని చేసిన ఓ వ్యక్తి, ప్రస్తుత ముఖ్యమంత్రి దారుణంగా ప్రవర్తించారు. ఒక కుటుంబంలో ముగ్గురుకి టికెట్లు ఇచ్చారు. 80 లక్షల జనాభాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఇది ఎక్కడి న్యాయం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మా మీద దయలేదా?" - మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి
కాంగ్రెస్ ఇప్పటికైనా తమ తప్పు సరిదిద్దుకోవాలి : మందకృష్ణ మాదిగ - Lok sabha polls 2024